మెగాస్టార్ చిరంజీవి సినిమా ఇండస్ట్రీలో తనకు పెద్దరికం వద్దని తాను ఇండస్ట్రీకి పెద్ద గా వ్యవహరించను అని చెప్పిన సంగతి తెలిసిందే. అయితే ఇండస్ట్రీ బిడ్డగా అవసరమైనప్పుడు తాను ముందుకు వస్తానని మెగాస్టార్ తెలిపారు. కానీ యూనియన్ల పేరుతో గొడవలు పెట్టుకుని పంచాయతీ కోసం తన వద్దకు రావద్దని చిరంజీవి తెలిపారు. అయితే తాజాగా చిరు వ్యాఖ్యలను రామ్ గోపాల్ వర్మ ఓ టీవీ కార్యక్రమంలో సమర్థించారు. మెగాస్టార్ చేసిన వ్యాఖ్యలపై వర్మ ఆసక్తికర కామెంట్లు చేశారు. చిరంజీవి ఏ విధంగా అలా చెప్పారో తెలియదు గాని ఆయన చెప్పిందే నిజమని ఆర్జివి వ్యాఖ్యానించారు.
Ramgopal varma
చిరంజీవి ఒక గొప్ప స్టార్ అని అన్నారు. ఆయన ఈ స్థాయికి రావడానికి అప్పటి నుంచి ఇప్పటి వరకు ఎంతో కష్టపడ్డారని తెలిపారు. అలా ఎంతో కష్టపడి ఒక స్టేజ్ లో ఉంటే అతని వద్దకు పంచాయితీలు చెప్పమని వెళ్లడం ఏంటని ప్రశ్నించారు. అలా చేసి చిరంజీవి సమయాన్ని వృధా చేయవద్దని అన్నారు. దానికి ఉదాహరణగా ఎంతో కష్టపడి ప్రపంచ సుందరిగా గెలిస్తే వాళ్లను సేవా కార్యక్రమాలకు పిలుస్తారని అన్నారు.
Also read : ఆ వ్యక్తి విమర్శలతో ఆలోచనలో రాజమౌళి…ఆ తరవాతనే బాహుబలి…!
అది సరైంది కాదని అన్నారు. ఐశ్వర్యరాయ్ ని సేవా కార్యక్రమాలు… అవయవ దానం లాంటి కార్యక్రమాలు పిలుస్తారు అక్కడ కూడా అందం తోనే పని అని అన్నారు. ఇదిలా ఉంటే ఆర్జివి గత కొద్ది రోజులుగా ఏపీ టికెట్ల వ్యవహారంపై ఎంతో చురుగ్గా మాట్లాడుతున్న సంగతి తెలిసిందే. ఏపీ సర్కార్ వర్సెస్ ఆర్జీవీ విధంగా ట్వీట్ల వర్షం కురిపించారు. ఎట్టకేలకు ఆర్జీవి ఏపీ మంత్రి పేర్ని నానితో చర్చించే అవకాశం కూడా దొరికింది. త్వరలోనే ఆర్జీవి ఏపీ మంత్రి పేర్ని నానిని కలిసి టికెట్లు అంశంపై చర్చించనున్నారు. ఆ తర్వాత టికెట్ల అంశంపై ఎలాంటి నిర్ణయం తీసుకోబోతున్నారు అనేది ఆసక్తికరంగా మారింది.