Home » పండ్లతో తయారు చేసే ప్రసాదం వల్ల కలిగే ఫలితాల గురించి మీకు తెలుసా ? 

పండ్లతో తయారు చేసే ప్రసాదం వల్ల కలిగే ఫలితాల గురించి మీకు తెలుసా ? 

by Anji
Ad

సాధారణంగా దేవాలయాలకు వెళ్లినప్పుడు మనం ప్రసాదం తీసుకుంటాం. ప్రసాదం అనేది రకరకాలుగా ఉంటుంది. ఎక్కువగా దేవాలయాల్లో స్వీట్లు, నైవేద్యం వంటివి పెడుతుంటారు. కానీ వాస్తవానికి దేవునికి పండ్లు మాత్రమే తీసుకెళ్లాలి. కేవలం ఒక్క దేవునికి మాత్రమే కాదు.. వృద్ధులను, పెద్దలను, అనారోగ్యంగా ఉన్నవారిని, గురువులను, స్వాములను, నూతన శిశువులను, కొత్త దంపతులను, గర్భిణులను, చిన్న పిల్లలను పలకరించడానికి వెళ్లినప్పుడు వట్టి చేతులతో అసలు వెళ్లకూడదని పెద్దలు చెబుతుంటారు. అందుకే మన ఇంటికి ఎవరైనా చుట్టాలు వస్తే.. తప్పకుండా ఏవో ఒక రకమైన పండ్లు తీసుకొస్తుంటారు. అలా తీసుకురావడానికి కారణం ఉందండోయ్.. అలాంటి ప్రదేశాలకు వెళ్లినప్పుడు ఖాళీ చేతులతో వెళ్లినట్టయితే మన పనులు కూడా అసంతృప్తిగానే ఉంటాయట. అదేవిధంగా దేవాలయానికి కూడా ఖాళీగా వెళ్లకూడదట. పూలు, పండ్లు, కొబ్బరికాయ ఏదో ఒకటి పూజా సామాగ్రి తీసుకెళ్లి పూజ చేయిస్తే మనకు మంచి జరుగుతుందని నమ్ముతుంటారు. నైవేద్యం కోసం ఎక్కువగా పండ్లను తీసుకెళ్లితే మంచిది అంటుంటారు. ఏయే పండును తీసుకెళ్లి నైవేద్యం చేయిస్తే ఎలాంటి ఫలితం ఉంటుందో ఇప్పుడు మనం తెలుసుకుందాం. 

Advertisement

అరటిపండు :

Health Benefits with Banana: రోజుకు ఒక్క అరటిపండు తినడంతో కలిగే  ప్రయోజనాలు... | Health Benefits with Banana By Eating Daily

అరటి పండులో ప్రోటిన్స్ చాలా ఎక్కువగా ఉంటాయి. ఈ అరటి పండు నైవేద్యంగా చేయిస్తే నిలిచిపోయిన పనులు ముందుకు సాగుతాయి. త్వరగా పనులు పూర్తవుతాయి. చాలా వరకు గణేష్ వద్ద చేతిలో అరటిపండ్లను ఉంచుతారు. అదేవిధంగా ప్రసాదంలో కూడా అరటిపండ్లను కలుపుతారు. సత్యనారాయణ స్వామి వంటి వ్రతాలు చేసినప్పుడు ఆ ప్రసాదంతో అరటిపండు తప్పకుండా కలుపుతారు. ముఖ్యంగా అరటి గుజ్జు వ్లల రుణ విముక్తి కలుగుతుంది. రావాల్సిన సొమ్ము, నష్టపోయిన డబ్బు అన్ని తిరిగి వస్తాయి. ప్రభుత్వానికి అధికంగా కట్టిన పన్ను సైతం తిరిగి వస్తుంది. 

కొబ్బరి కాయ : 

Manam News

కొబ్బరి చెట్టు యొక్క శాస్త్రీయ నామం కొకాస్ న్యూసిఫెరా. కొబ్బరికాయలో నీరు, కండ వంటివి ఉంటాయి. నీరు, కండ గట్టితనంగా ఉండే నారతో కప్పబడి ఉంటుంది. కొబ్బరి నీరు వాంతులను, తల తిరగడాన్ని అరికడుతుంది. కలరా వ్యాధికి కూడా మంచి విరుగుడు అనే చెప్పవచ్చు. దేవాలయానికి కొబ్బరికాయ లేదా పూర్ణఫలం తీసుకెళ్లితే పనులు సులభతరమవుతాయి. అనుకున్న పనులు నెరవేరుతాయి. అధికారుల నుంచి ఎలాంటి సమస్యలు రావు. స్నేహపూర్వకంగా పనులు జరిగిపోతాయి. 

సపోటా పండు : 

Manam News

సపోటా పండులో ఐరన్, పొటాషియం, క్యాల్షియం, మినరల్స్, విటమిన్స్ వంటి పోషక పదార్థాలు చాలా ఉంటాయి. అదేవిధంగా యాంటి బ్యాక్టిరియల్, యాంటి ఆక్సిడెంట్ లక్షణాలు కూడా సపోటా పండులో ఎక్కువ కనిపిస్తాయి. ఈ పండు తినడం వల్ల వివాహ, శుభకార్యాలలో ఎదురయ్యే చికాకులు కూడా తొలగిపోతాయి. సంబంధాలు కూడా ఖాయమవుతాయి. 

కమలం పండు : 

Manam News

కమలం పండులో క్యాల్షియం అధికంగా ఉండటం వల్ల ఎముకలు చాలా దృఢంగా  మారుతాయి. ఇందులో విటమిన్ సి అధికంగా ఉంటుంది. ఈ విటమిన్ సి అనేది రోగ నిరోధకశక్తిని పెంచుతుంది. వీటిని తీసుకోవడం వల్ల చిరకాలంగా నిలిచిపోయిన పనులు నెరవేరుతాయి. మీకు నమ్మకమైన వ్యక్తులు ముందుకు వచ్చి సహాయపడతారు. 

మామిడి పండు : 

Manam News

Advertisement

 

మామిడి పండును పండ్లకే రారాజు గా పిలుస్తారు. ఇందులో ఉండే పొటాషియం, మెగ్నీషియం, అధిక రక్తపోటు వంటి సమస్యను నివారిస్తుంది. విటమిన్ సి, ఫైబర్ శరీరంలో హాని కలిగించే కొలెస్ట్రాల్ ని తగ్గిస్తుంది. మామిడి పండు నైవేద్యంగా పెట్టడం వల్ల ప్రభుత్వం నుంచి రావాల్సిన నగదు ఎలాంటి సమస్యలు లేకుండా వస్తుంది. గణపతికి మామిడిపండును సమర్పించినట్టయితే  గృహ నిర్మాణ వంటి సమస్యలు తీరుతాయి. బకాయిలు చెల్లించడానికి సకాలంలో సొమ్ము వచ్చి చేరుతుంది. గణపతి హోమం చేసి మామిడిపండును పూర్ణహుతి చేస్తే చిట్టీల వ్యవహారాలు చక్కబడుతాయి. అష్టదైవానికి తేనే, మామిడి రసం నైవేద్యంగా సమర్పిస్తే మోసం చేసిన వారిలో కూడా మార్పు వస్తుంది. 

అంజూర పండు : 

Manam News

కొంచెం వగరు, కొంచెం తీపి, కొంచెం పులుపుగా ఉండే అంజూర పండు ఆరోగ్యానికి మేలు చేస్తుంది. దీంతో పలు అనారోగ్య సమస్యలు తీరుతాయి. స్వల్ప రక్తపోటు ఉన్న వారికి ఇది చాలా మంచిది. కాళ్ల నొప్పులు తగ్గుతాయి. రోగ నివారక సంకల్పాన్ని చెప్పుకొని సుమంగలీలకు తాంబూలంలో అంజూర పండు ఇస్తే చాలా మంచిది. సంకల్పం ఎవరి పేరున చెబుతామో వారు మాత్రం తినకూడదు.

Also Read :  మీ కంటి చూపు సరిగ్గా కనిపిస్తుందా? అయితే ఈ ఫోటోలో దాగి ఉన్న కుందేలును గుర్తించండి ?

నేరేడు పండు : 

Manam News

నోట్లో వేసుకోగానే ఇలాగే కరిగిపోయి పండు నేరేగుడపండు. ఇందులో పోషకాలు పుష్కలంగా ఉంటాయి. ఈ పండుకి చాలా ఏళ్ల చరిత్ర ఉంది. ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది. పేగులలో సైతం చుట్టుకుపోయిన వెంట్రుకలను కూడా కోసి బయటికి పంపించేంత శక్తి నేరేడు పండ్లకు ఉంది. నైవేద్యాన్ని ప్రసాదంగా స్వీకరిస్తే.. నీరసం, నిస్సత్తువ తగ్గుముఖం పడతాయి. శనీశ్వరుడి ప్రసాదంగా స్వీకరిస్తే వెన్ను నొప్పి, నడుము నొప్పి, మోకాళ్ల నొప్పులు నయమవుతాయి. బిచ్చగాళ్లకు దానం చేస్తే దరిద్రం దరి చేరదు. పనులు నిరాటంకంగా సాగుతాయి. భోజనంతో పాటు నేరేడు పండును వడ్డిస్తే అన్నపానీయాలకు లోటు ఉండదు. రోజు నేరేడు పండును తింటే ఎలాంటి ఆరోగ్య సమస్యలు ఉండవు. 

పనస పండు 

Manam News

పనస పండును షుగర్ వ్యాధి ఉన్న వారు తీసుకోవడం వల్ల మంచి ఫలితం ఉంటుంది. శత్రు జయం కలుగుతుంది. రోగ నివారణతో పాటు కష్టాలు కూడా తొలగిపోతాయి.

Also Read :  మిరియాలలో ఇన్ని పోషకాలుంటాయా..? వాటి గురించి తెలిస్తే ఆశ్చర్యపోవడం పక్కా..!

ద్రాక్ష పండు :  

Manam News

ద్రాక్ష పండ్లు రకరకాలుగా ఉంటాయి. ముఖ్యంగా ఆకుపచ్చ, నలుపు, ఎరుపు రంగులలో కనిపిస్తాయి. ఈ పండ్లు ఆరోగ్యానికి చాలా మేలు చేస్తాయి. ద్రాక్ష పండ్లను దానం చేస్తే పక్షవాత రోగాలు కూడా త్వరగా నయం అవుతాయి. దేవుడిని ప్రసాదంగా పంచితే సుఖ, సంతోషాలు కలుగుతాయి.  

Also Read :  చర్మ క్యాన్సర్ ఎక్కువగా ఎవరికి వచ్చే అవకాశం ఉందో తెలుసా ? 

జామ పండు 

Manam News

జామ పండ్లు కొన్ని తెల్లగా, మరికొన్ని ఎరుపు, గులాబీ రంగులో ఉంటాయి. తినడానికి తియ్యగా ఉంటాయి. వీటిలో విటమిన్ ఏ, విటమిన్ సి అధికంగా ఉంటుంది. ఈ పండును నైవేద్యంగా పెడితే సమాజంలో పలుకుబడి పెరుగుతుంది. గణపతికి నైవేద్యంగా పెడితే గ్యాస్టిక్, ఉదర సంబంధిత వ్యాధులు నయమవుతాయి. దేవీ నైవేద్యంగా పంచినట్టయితే చక్కర వ్యాధి నుంచి ఉపశమనం కలుగుతుంది. దాంపత్య కలహాలు తొలగుతాయి. పెళ్లి కానీ యువతులతో ముత్తయిదువలకు పంచితే వివాహ ఆటంకాలు సమిసిపోతాయి. జామ పండ్లు, కమల పండ్ల రసంతో రుద్రాభిషేకం చేస్తే పనులు చురుకుగా ఉంటాయి. గణపతికి పంచామృత అభిషేకం చేసి, జామ పండ్లను నైవేద్యంగా పెడితే వ్యాపారం లాభసాటిగా సాగుతుంది. 

Also Read :  ఈ పండు తింటే మధుమేహం అదుపులో ఉండడం పక్కా..!

 

Visitors Are Also Reading