Home » చర్మ క్యాన్సర్ ఎక్కువగా ఎవరికి వచ్చే అవకాశం ఉందో తెలుసా ? 

చర్మ క్యాన్సర్ ఎక్కువగా ఎవరికి వచ్చే అవకాశం ఉందో తెలుసా ? 

by Anji
Ad

చర్మ క్యాన్సర్ లో రెండు ప్రధాన కారణాలు ఉంటాయి. నాన్-మెలనోమా చర్మ క్యాన్సర్, ప్రాణాంతక మెలనోమా ఈ రెండు రకాల క్యాన్సర్లలో పలు దేశాలు విపరీతంగా పెరుగుతున్నాయి. ప్రపంచ ఆరోగ్య సంస్థ గ్లోబల్ క్యాన్సర్ అబ్జర్వేటరీ 2020-2040 మధ్య కాలంలో స్కిన్ క్యాన్సర్ కేసులు విపరీతంగా పెరగవచ్చని అంచనా వేసింది. ముఖ్యంగా చర్మ క్యాన్సర్ యొక్క రేటు పెరగడానికి కచ్చితమైన కారణం ఏంటో అనేది చెప్పడం చాలా కష్టం. 

Advertisement

కానీ పెరుగుతున్న ప్రపంచ ఉష్ణోగ్రతలు కొంత వరకు కారణం అని పరిశోధకులు వెల్లడిస్తున్నారు. సూర్యుడి నుంచి వచ్చే అతినీలలోహిత కిరణాలు చాలా ప్రమాకరమని శాస్త్రవేత్తలు తేల్చేశారు. భూమధ్య రేఖకు సమీపంలో లేదా భూమధ్య రేఖకు దక్షిణంగా ఉండే వారిలో చర్మ క్యాన్సర్ ప్రమాదం ఎక్కువగా ఉంటుందని పలు అధ్యయనాలు పేర్కొంటున్నాయి. ప్రపంచంలో ఎక్కడ నివసిస్తున్నారనే దానిపై స్కిన్ క్యాన్సర్ ప్రమాదం ఆధారపడి ఉంటుందని పరిశోధకులు వెల్లడిస్తున్నారు. 

Advertisement

Also Read :  పంత్ కారుకు ప్రమాదం.. విలువైన వస్తువులు, నగలు దొంగిలించిన జనాలు !

Manam News

ఐరోపా, ఉత్తర అమెరికా, ఆస్ట్రేలియాలోని ఉత్తర, దక్షిణ ప్రాంతాల్లో స్కిన్ క్యాన్సర్ కేసులు చాలా ఎక్కువగా నమోదవుతున్నాయని శాస్త్రవేత్తలు ఓ అంచనా వేస్తున్నారు. ఆప్రికా, ఆసియాలో చర్మ క్యాన్సర్లు చాలా అరుదుగా ఉంటాయి. 2022తో పోల్చినట్టయితే 2040 నాటికి ఆఫ్రికన్ దేశాలు కొత్త కేసులలో 96 శాతానికి పైగా పెరుగుదల ఉంటుందని గ్లోబల్ క్యాన్సర్ అబ్జర్వేటరీ డేటాను బట్టి తెలుస్తుంది. ఆసియాలో 59 శాతం, లాటిన్ అమెరికా, కరేబియన్ లో 67 వాతం వరకు పెరుగుదల ఉంటుందని తాజాగా వెల్లడించిన లెక్కలు చెబుతున్నాయి. అందుకే స్కిన్ పరంగా మనం కూడా జాగ్రత్తగా ఉండడం చాలా బెటర్. 

Also Read :  కారు యాక్సిడెంట్‌లో టీమిండియా క్రికెటర్ రిషబ్‌ పంత్‌కు గాయాలు

Visitors Are Also Reading