ప్రస్తుతం స్టార్స్ సినిమాలతో పాటూ వెబ్ సిరీస్ లలోనూ నటిస్తున్నారు. పాన్ ఇండియా స్టార్స్ సైతం వెబ్ సిరీస్ లలో నటిస్తున్నారు అంటే వాటికి క్రేజ్ ఏ రేంజ్ లో ఉందో అర్థం చేసుకోవచ్చు. ఇక వెబ్ సిరీస్ లలో నటించేందుకు భారీ రెమ్యునరేషన్ లు కూడా అందుకుంటున్నారు. ఈ నేపథ్యంలోనే రానా మరియు వెంకటేష్ ప్రధాన పాత్రలో తెరకెక్కిన సిరీస్ రానా నాయుడు.
Advertisement
Read Also : Dasara : “దసరా” ట్రైలర్ విడుదల.. గత్తర్ లేపిన నాని
Advertisement
అయితే, ఫ్యామిలీ హీరోగా పేరు గాంచి వెంకీ ఇలాంటి సిరీస్ లో నటించడంతో ఫ్యాన్స్ జీర్ణించుకోలేకపోతున్నారు. సోషల్ మీడియా వేదికగా ఇప్పుడు ఇవే కామెంట్స్ వైరల్ అవుతున్నాయి. ఇదిలా ఉంటే ఈ వెబ్ సిరీస్ కోసం రానా, వెంకీ ఎంత రెమ్యూనరేషన్ తీసుకున్నారన్న అంశం ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. ఈ సిరీస్ లో నటించిన అందుకు వెంకటేష్ ఏకంగా రూ. 12 కోట్లు తీసుకున్నాడని సమాచారం. అలాగే రానా రూ.8 కోట్ల వరకు రెమ్యూనరేషన్ తీసుకున్నట్లు తెలుస్తోంది. సుందర్ ఆరోన్, లోకోమోటివ్ గ్లోబల్ నిర్మించిన ఈ వెబ్ సిరీస్ ఈ నెల 10వ తేదీ నుంచి స్ట్రీమింగ్ అవుతోంది.
ఇదిలా ఉంటే వాస్తవానికి ఈ వెబ్ సిరీస్ హిందీలో తెరకెక్కింది. ఈ వెబ్ సిరీస్ కరన్ అండ్ అన్షుమన్, సూపర్న్ ఎస్. వర్మ దర్శకత్వం వహించారు. ఇందులో వెంకటేష్ నాగానాయుడు (తండ్రి), రానా..రానా నాయుడు (కొడుకు) పాత్రలు పోషించారు. ఇక ఈ వెబ్ సిరీస్ పై జరుగుతున్న ప్రచారంపై రానా స్పందించిన విషయం తెలిసిందే. కుటుంబంతో కలిసి ఈ వెబ్ సిరీస్ చూడొద్దని రానా చెప్పారు. ఈ సిరీస్ ను అమెరికన్ టీవీ క్రైమ్ డ్రామా సిరీస్ ‘రే డోనోవన్’ రీమేక్ గా తెరకేక్కించిన విషయం తెలిసిందే.
Advertisement
Read Also : భూమా మౌనిక వీపుపై సీక్రెట్ టాటూ… మనోజ్ ఆగ్రహం ?