ఈటీవీలో జబర్దస్త్ కార్యక్రమం ప్రారంభమై దాదాపు పదేళ్లు కావస్తుంది. ఈ కార్యక్రమాన్ని తొలుత 13 ఎపిసోడ్లు చేయాలని భావించి ఒప్పందం చేసుకున్నారు. అప్పుడు ఉన్న టీమ్ లీడర్లతో రూ.25,000 నుంచి రూ.50,000 వరకు రెమ్యునరేషన్ మాట్లాడుకుని మల్లెమాల వారు కార్యక్రమాన్ని రూపొందించారు. అది ప్రారంభమైన రెండు, మూడు నెలలకే ఊహించని రెస్పాన్స్ రావడంతో టీమ్ లీడర్ల యొక్క రెమ్యూనరేషన్ కూడా పెంచేశారు.
Advertisement
చమ్మక్ చంద్ర కారణంగా జబర్దస్త్ క్రేజ్ విపరీతంగా పెరిగిపోయింది. ఆయనకు అప్పట్లోనే దాదాపు లక్షన్నర రెమ్యునరేషన్ ఇచ్చేవారట. ఆ స్థాయిలో సుడిగాలి సుధీర్, హైపర్ ఆది టీమ్ లకు మల్లెమాల వారు రెమ్యునరేషన్ ఇస్తూ వచ్చారు. ప్రస్తుతం హైపర్ ఆది జబర్దస్త్ కి దూరమయ్యాడు. అతను జబర్దస్త్ కి దూరమైన సమయంలో తీసుకున్న రెమ్యునరేషన్ ఒక్కొక్క ఎపిసోడ్ కి లక్షన్నర రూపాయలు గతంతో పోల్చితే కాస్త తక్కువే అయినప్పటికీ ఇతర కార్యక్రమాలలో వరుసగా ఆయన చేస్తున్నాడు కాబట్టి ఆయనకి లక్షన్నర ఇచ్చి ఆయన టీమ్ లో నటీనటులకు అదనంగా రెమ్యునరేషన్ ఇచ్చేవారట. హైపర్ ఆది వెళ్లి పోవడంతో ఆయన స్థానంలో సద్దాం టీమ్ లోకి బరిలోకి దిగింది. ప్రస్తుతం సద్దాంకి కూడా ఏ మాత్రం తక్కువ కాకుండా రూ.లక్ష రెమ్యునరేషన్ దక్కుతున్నట్టు తెలుస్తోంది.
Advertisement
Also Read : ఆకులో ఈకగాడు అంటూ హైపర్ ఆది పై ఓ రేంజ్ లో ఫైర్ అయిన శ్రీ రెడ్డి…. ఎందుకంటే?
కేవలం టీమ్ లీడర్ కి మాత్రమే లక్ష రూపాయిలు ఇచ్చి మిగతా కంటెస్టెంట్ కి మల్లెమాల వారు రెమ్యునరేషన్ ఇవ్వడం లేదట. సద్దాం తన టీమ్ లోని వారికి ఆ లక్ష రూపాయల నుంచి చెల్లించాల్సి వస్తుందట. విశ్వసనీయ వర్గాల సమాచారం ప్రకారం.. సద్దాం రూ.30వేలు తీసుకొని యాదమ రాజు రూ.25వేలు తీసుకొని మిగతా వారికి బ్యాలెన్స్ అమౌంట్ పంచుతున్నట్టు సమాచారం. మొత్తానికి హైపర్ ఆది స్థానంలో వచ్చిన సద్దాం రెమ్యునరేషన్ పర్వాలేదు అన్నట్టుగా ఉందని బుల్లి తెర వర్గాల వారు పేర్కొంటున్నారు.
Also Read : టాలీవుడ్ లోకి అమీర్ ఖాన్ ఎంట్రీ.. ఎన్టీఆర్ తో తలపడనున్నాడా..?