Home » టాలీవుడ్ లోకి అమీర్ ఖాన్ ఎంట్రీ.. ఎన్టీఆర్ తో తలపడనున్నాడా..?

టాలీవుడ్ లోకి అమీర్ ఖాన్ ఎంట్రీ.. ఎన్టీఆర్ తో తలపడనున్నాడా..?

by Anji
Ad

ఆర్ఆర్ఆర్ సినిమాతో పాన్ ఇండియా స్టార్ గా మారారు జూనియర్ ఎన్టీఆర్. ఎన్టీఆర్, ప్రశాంత్ నీల్ కాంబోలో తెరకెక్కే సినిమాకి తాత్కాలికంగా ఎన్టీఆర్ 31 అనే టైటిల్ పెట్టారు. ఎన్టీఆర్ తో పోరాడేందుకు అమీర్ ఖాన్ ని పరిశీలిస్తున్నారట మూవీ మేకర్స్. ఈ చిత్రంలో త్వరలోనే సెట్స్ పైకి వెళ్లే అవకాశం కనిపిస్తోంది. 

Advertisement

గత కొంతకాలంగా దక్షిణాది, బాలీవుడ్ సినిమాల మధ్య సరిహద్దులు చెరిగిపోతున్నాయి. టాలీవుడ్ నుంచి మాత్రమే కాదు.. దక్షిణాదిలోని చాలా మంది నటులు పాన్ ఇండియా ప్రాజెక్ట్ లలో నటిస్తున్నారు. ఉత్తరాది సినీ ప్రేక్షకులను తమ నటనతో ఆకట్టుకుంటున్నారు. మరోవైపు చాలా మంది బీ టౌన్ స్టార్ హీరోలు సైతం.. దక్షిణాది సినిమాలలో కనిపించడానికి ఎంతో ఆసక్తిని చూపిస్తున్నారు. ఇటీవల ఆర్ఆర్ఆర్ చిత్రంతో బాలీవుడ్ ప్రేక్సకులను ఆకట్టుకున్నాడు ఎన్టీఆర్. ఎన్టీఆర్ కేజీఎఫ్ ఫేమ్ దర్శకుడు ప్రశాంత్ నీల్ తో తెరకెక్కించే చిత్రంతో అమీర్ ఖాన్ స్క్రీన్ పంచుకోనున్నాడట. ఇదే విషయంపై అమీర్ ఖాన్ సంప్రదించగా.. ఎప్పటి నుంచో ఓ తెలుగు సినిమా చేసేందుకు చూస్తున్న అమీర్ ఈ చిత్రం ఛాన్స్ రాగానే ఓకే చెప్పినట్టు వార్తలు వినిపిస్తున్నాయి.  

Advertisement

Also Read :  ఆకులో ఈకగాడు అంటూ హైపర్ ఆది పై ఓ రేంజ్ లో ఫైర్ అయిన శ్రీ రెడ్డి…. ఎందుకంటే?

ఇప్పటివరకు సినిమా సినిమాకు మధ్య ఎక్కువ సమయం ఇవ్వని ఎన్టీఆర్.. ఆర్ఆర్ఆర్ తరువాత మాత్రం షూటింగ్ కి ఎక్కువ గ్యాప్ ఇచ్చేశాడు. ప్రీ ప్రొడక్షన్ పనే కారణం అంటూ.. తనకు రెస్ట్ కావాలని ఫిక్స్ అయ్యారో తెలియదు. కొరటాల సినిమా షూటింగ్ ని నెలలకు నెలలే పక్కకు పెట్టేశారు. తన ఫ్యామిలీతో ఫారెన్ లో చక్కర్లు కొడుతూ ఆ ఫోటోలతో సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతున్నారు. తన సినిమా అప్ డేట్ కావాలని బెట్ చేస్తున్న ఫ్యాన్స్ కి మాత్రం తాజాగా స్వీట్ సర్ ప్రైజ్ ఇచ్చేసారు. కొరటాతో ఎన్టీఆర్ చేయబోయే సినిమా షూటింగ్ ఫిబ్రవరి ఫస్ట్ వీక్ ప్రారంభించనున్నట్టు అనౌన్స్ మెంట్ ఇప్పించారు. ఈ అనౌన్స్ మెంట్ వార్త విన్న ఎన్టీఆర్ అభిమానులు ఖుసీ అవుతుండగానే.. ఎన్టీఆర్ 31లో అమీర్ ఖాన్ నటిస్తున్నట్టు టాక్ రావడంతో ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. 

Also Read : విలన్ తో తమన్నా డేటింగ్.. వీడియో లీక్ !

Visitors Are Also Reading