Home » కార్తీక దీపం సీరియల్ లో నటించిన పిల్లల రెమ్యూనరేషన్ ఎంతో తెలిస్తే ఆశ్చర్యపోవాల్సిందే..!

కార్తీక దీపం సీరియల్ లో నటించిన పిల్లల రెమ్యూనరేషన్ ఎంతో తెలిస్తే ఆశ్చర్యపోవాల్సిందే..!

by Anji
Ad

తెలుగు సీరియల్ అనగానే ఠక్కున గుర్తుకొచ్చే పేరు కార్తీక దీపం. ఈ సీరియల్ 2017 నుంచి జనవరి 23, 2023 వరకు స్టార్ మా లో ప్రసారమైంది. ముఖ్యంగా ఈ సీరియల్ లో డాక్టర్ బాబుగా కనిపించిన నిరూపమ్, వంటలక్కగా కనిపించినటువంటి ప్రేమి విశ్వనాథ్ హీరో, హీరోయిన్ స్థాయిలో గుర్తింపును దక్కించుకున్నారనే విషయం విధితమే. ఇప్పటికే పలు సినిమాల్లో నటించేందుకు కూడా ఆఫర్లు వస్తున్నాయి. మరోవైపు ప్రేమి విశ్వనాథ్ నాగచైతన్య నటించే ఓ సినిమాలో కీలక పాత్రలో నటిస్తున్నారు. 

Advertisement

డాక్టర్ బాబు, వంటలక్క కూతుర్లుగా నటించిన శౌర్య, హిమలు కూా సినిమాల ద్వారా దక్కించుకునే గుర్తింపు కన్నా ఎక్కువగా పాపులారిటీ సంపాదించుకున్నారు. వారి అసలు పేర్ల కంటే కూడా హిమా, శౌర్య పేర్లతోనే ఎక్కువగా పాపులారీటీ సొంతం చేసుకున్నారు. సోషల్ మీడియాలో వీరిద్దరూ హిమా, శౌర్య పేరుతోనే చర్చల్లో ఉంటారు. వీరిద్దరూ చాలా చిన్న వయస్సు నుంచి సీరియల్స్ లో నటించడం ప్రారంభించారు. అప్పటి నుంచి ఇప్పటివరకు వీరికి దక్కిన రెమ్యూనరేషన్ పరిశీలించినట్టయితే.. ఓ యంగ్ హీరోకి దక్కినంతగా రెమ్యూనరేషన్ దక్కిందంటూ.. బుల్లితెర వర్గాల వారు చర్చించుకుంటున్నారు. డాక్టర్ బాబు, వంటలక్క పాత్రల తరువాత అత్యధిక రెమ్యూనరేషన్ తీసుకున్న పాత్రలుగా వీరి పాత్రలు నిలుస్తాయి. సీరియల్ లో వీరిద్దరి పాత్రలు అద్భుతంగా ఉండడం వల్లనే ఈ సీరియల్ సూపర్ హిట్ అయిందనడంలో ఎలాంటి సందేహం లేదు. అందుకే వారికి సీరియల్ మేకర్స్ సముచిత న్యాయం కలిగించే విధంగా భారీ రెమ్యూనరేషన్ ఇచ్చారనేది టాక్ వినిపిస్తోంది. 

Advertisement

Also Read :   కార్తీక దీపం సీరియల్ తో డాక్టర్ బాబు, వంటలక్క ఎంత సంపాదించారో తెలుసా ?

Karthika Deepam preview: Karthik to take Deepa and the kids home? - Times  of India

కార్తీకదీపం సీరియల్ తో ఎంతో పాపులారిటీని సంపాదించుకున్నారు. వీరు ఇతర సీరియల్స్ తో కూడా బిజీ అవ్వబోతున్నారు. కార్తీకదీపం సీరియల్ ఇటీవలే ముగిసిన విషయం తెలిసిందే. దీంతో వీరిద్దరూ నటించబోయే కొత్త సీరియల్ ఏంటి ? ఎప్పుడు ప్రారంభమవుతుంది అనే దానిపై అందరూ ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. కార్తీక దీపం సీరియల్ వీరిద్దరూ లేకుండా కేవలం కొన్ని వారాల పాటు మాత్రమే కొనసాగింది. అప్పుడు రేటింగ్ చాలా దారుణంగా పడిపోయింది. అందుకే మళ్లీ వారిని తీసుకొచ్చారు. వీరు లేకుండా సీరియల్ కి రేటింగ్ ఉండదని అందరికీ అర్థం అయిపోయింది. ముఖ్యంగా వారికి పారితోషికం భారీగానే ఇచ్చారు అనడంతో ఎలాంటి సందేహం లేదు. త్వరలోనే కార్తీక దీపం సీరియల్ 2 రాబోతున్నట్టు సోషల్ మీడియాలో వార్తలు వినిపిస్తున్నాయి. అందులో వాస్తవం ఉందో లేదో తెలియాలంటే మాత్రం కొద్ది రోజులు వేచి చూడాల్సిందే. 

Also Read :  కేజీఎఫ్ సినిమాలోని కుర్రాడికి.. ప్రభాస్ సలార్ చిత్రానికి ఉన్న సంబంధం అదేనా..?

Visitors Are Also Reading