Home » కార్తీక దీపం సీరియల్ తో డాక్టర్ బాబు, వంటలక్క ఎంత సంపాదించారో తెలుసా ?

కార్తీక దీపం సీరియల్ తో డాక్టర్ బాబు, వంటలక్క ఎంత సంపాదించారో తెలుసా ?

by Anji
Ad

నిన్నటి వరకు స్టార్ మా లో ప్రసారమైన కార్తీకదీపం సీరియల్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరమే లేదు. 2017లో ప్రారంభమైన కార్తీకదీపం సీరియల్ సుదీర్ఘ కాలం పాటు బుల్లితెరపై నెంబర్ వన్ సీరియల్ గా  రికార్డును సొంతం చేసుకుంది. అలాంటి కార్తీకదీపం సీరియల్ ముగిసిపోయిందంటూ యూనిట్ సభ్యులు ప్రకటించిన సమయంలో ప్రేక్షకులందరూ ఒక్కసారిగా ఆశ్చర్యపోయారు.  ఈ సీరియల్ ని ఏదో ఒక విధంగా పొడిగిస్తూ ఉంటారని అందరూ భావించారు. కానీ ఇంకా ఈ సీరియల్ పొడగించడం సాధ్యం కావడం లేదని మేకర్స్ ప్రకటించేశారు. 

Advertisement

కార్తీకదీపం సీరియల్ లో డాక్టర్ బాబు అలియాస్ డాక్టర్ కార్తీక్ పాత్రను పోషించిన నిరూపమ్, వంటలక్క అలియాస్ దీప పాత్రను పోషించిన ప్రేమి విశ్వనాథ్ లు ఎంత సంపాదించారని అంటే..  చాలా మంది దగ్గర నుంచి సరైన సమాధానం ఉండదు. కానీ వారిద్దరూ కార్తిక దీపం సీరియల్ ద్వారా సంపాదించింది ఒక హీరో, హీరోయిన్ సంపాదించిన మొత్తానికి సమానం అంటూ బుల్లి తెర ట్రేడ్ వర్గాలు పేర్కొంటున్నాయి. ఇక ఇండస్ట్రీలో కార్తీకదీపం సీరియల్ స్టార్స్ కి ఉన్న పేరు గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరమే లేదు. వారికి స్టార్స్ రేంజ్ లో గుర్తింపు లభించింది. మరోవైపు వంటలక్కకి నాగచైతన్య హీరోగా నటించే సినిమాలో ఆఫర్ కూడా వచ్చింది. 

Advertisement

Also Read :   కమెడియన్ ఏవీఎస్ అల్లుడు కూడా నటుడు అనే విషయం మీకు తెలుసా..?

Manam News

కార్తీకదీపం సీరియల్ ద్వారా డాక్టర్ బాబు వంటలక్క కోట్ల రూపాయలు సంపాదించుకున్నారా అంటే.. అవుననే సమాధానమే  వినిపిస్తుంది. అదేవిధంగా లక్షలాది మంది అభిమానులను వారిద్దరూ సొంతం చేసుకున్నారనేది చాలా మంది చెబుతున్న మాట. బుల్లితెర ఇండస్ట్రీలో కార్తీక్ మరియు దీప కు ఉన్న క్రేజ్ గురించి అందరికీ తెలిసిందే. వారిద్దరూ కూడా సినిమాల్లో  సినిమాల్లో నటిస్తే వారికి రోజుకు ఐదు నుంచి ఏడు లక్షల వరకు రెమ్యూనరేషన్ ఇచ్చేందుకు ఫిలిం మేకర్స్ సిద్ధంగా ఉన్నారట. ఇంతటి ఇమేజ్ ని సంపాదించుకున్న వీరికి ఇంతకన్న ఏం కావాలి చెప్పండి. ముందు ముందు వీరిద్దరూ కలిసి నటించాలని ప్రతి ఒక్కరూ కోరుకుంటున్నారు. మరోవైపు కార్తీక దీపం 2 సీరియల్ త్వరలో ఉండబోతుందని సోషల్ మీడియాలో వార్తలు వినిపిస్తున్నాయి. దీనిపై యూనిట్ ఏవిధంగా స్పందిస్తుందో వేచి చూడాలి.  

Also Read :   పంజాబీ పెళ్లిలో బ్యాడ్ ప్లే చేసిన బ్రిటీషర్లు.. ఎక్కడో తెలుసా ?

Visitors Are Also Reading