Home » కేజీఎఫ్ సినిమాలోని కుర్రాడికి.. ప్రభాస్ సలార్ చిత్రానికి ఉన్న సంబంధం అదేనా..?

కేజీఎఫ్ సినిమాలోని కుర్రాడికి.. ప్రభాస్ సలార్ చిత్రానికి ఉన్న సంబంధం అదేనా..?

by Anji

రెబల్ స్టార్ ప్రభాస్ ఎప్పుడెప్పుడా అని ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న చిత్రం సలార్. కేజీఎఫ్ దర్శకుడు ప్రశాంత్ నీల్.. ప్రభాస్ కాంబినేషన్ లో రాబోతున్న ఈ సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి. ప్రస్తుతం ఈ సినిమా చిత్రీకరణ శరవేగంగా కొనసాగుతుంది. ఈ చిత్రం పై దేశవ్యాప్తంగా అభిమానులలో భారీ ఆశలు పెట్టుకున్నారు. ఈ చిత్రాన్ని హోంబలే ఫిలింస్ నిర్మిస్తుండగా.. ఇందులో ప్రభాస్ సరసన  శృతిహాసన్ కథానాయికగా నటిస్తున్నారు. కేజీఎఫ్ చిత్రానికి సంగీతమందించిన రవి బస్రూర్ సంగీతాన్ని సమకూర్చుతున్నారు.

ఇప్పటికే సలార్ సినిమా గురించి కొన్ని ఆసక్తికరమైన అప్డేట్స్ నెట్టింట వైరల్ అయ్యాయి. తాజాగా మరో ఆసక్తికరమైన న్యూస్ సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది.  తాజాగా వినిపిస్తున్న సమాచారం మేరకు.. సలార్ చిత్రానికి కేజీఎఫ్ సినిమాకి ఓ సంబంధం ఉందట. కేజీఎఫ్ చిత్రంలోని కుర్రాడికి.. ప్రభాస్ పాత్రకు లింక్ ఉన్నట్టు టాక్ నడుస్తుంది. కేజీఎఫ్ 2లో కుర్రాడు ఉన్నాడు గుర్తుందా..? తన తల్లికి ఇష్టం లేకపోయినా కేజీఎఫ్ కి కాపలా కాసే టీమ్ లో చేరుతాడు. 

Also Read :  అజ్ఞాతంలోకి మెగాడాటర్ నిహారిక…కారణం అదేనా …,?

అధీర ముఠా దాడిలో ఈ కుర్రాడు మరణిస్తాడు. అతని శవాన్ని చూసి ఆ తల్లి బోరున విలపిస్తుంది. ఆ కుర్రాడు చనిపోలేదని.. అతడే సలార్ గా మారుతాడనే చర్చ జరుగుతుంది. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన ట్వీట్స్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఈ వార్తలో వాస్తవం లేదంటున్నారు ప్రభాస్ అభిమానులు. ఈ చిత్రంలో రాకింగ్ స్టార్ యశ్ అతిథి పాత్ర పోషిస్తున్నారు. మరోవైపు యష్ సలార్ సినిమాలో నటించడం లేదని.. గతంలో హోంబలే నిర్మాత క్లారిటీ ఇచ్చారు. కేజీఎఫ్ చిత్రంలోని కుర్రాడికి ప్రభాస్ పాత్రకు లింక్ ఉన్నట్టు వస్తున్నట్టు వార్తల్లో వాస్తవం లేదనేది మాత్రం తెలియాల్సి ఉంది. 

Also Read :  2008లోనే తెలుగు సినిమాలో హీరోయిన్ గా నటించిన హనీరోజ్…ఆ సినిమా ఏదంటే…?

Visitors Are Also Reading