Telugu News » ఎన్టీఆర్ కు వ‌డ్డే న‌వీన్ భావే..కానీ నంద‌మూరి కుటుంబానికి అందుకే దూర‌మ‌య్యారు..!

ఎన్టీఆర్ కు వ‌డ్డే న‌వీన్ భావే..కానీ నంద‌మూరి కుటుంబానికి అందుకే దూర‌మ‌య్యారు..!

by AJAY MADDIBOINA

టాలీవుడ్ లో ఒక‌ప్పుడు వెలుగు వెలిగిన హీరోల‌లో వ‌డ్డే న‌వీన్ కూడా ఒక‌రు. కెరీర్ బిగినింగ్ లో న‌వీన్ వ‌రుస హిట్లు అందుకుని ల‌వ‌ర్ బాయ్ గా పేరుతెచ్చుకున్నారు. ఆ త‌ర‌వాత న‌వీన్ ఫ్యామిలీ హీరోగా ఇమేజ్ తెచ్చుకున్నారు. 1997లో కోరుకున్న ప్రియుడు సినిమాతో న‌వీన్ ఇండ‌స్ట్రీకి ప‌రిచ‌యం అయ్యాడు. ఈ సినిమా మంచి విజ‌యం సాధించ‌డంతో పాటు అదే యేడాది ప్రేక్ష‌కుల ముందుకు వ‌చ్చిన పెళ్లి సినిమా కూడా సూప‌ర్ హిట్ గా నిలిచింది. ఇక ఈ సినిమా త‌ర‌వాత వ‌డ్డే న‌వీన్ కు ఆఫ‌ర్లు క్యూ క‌ట్టాయి. వ‌డ్డే న‌వీన్ ఇండ‌స్ట్రీ లోకి రావ‌డానికి ఆద‌ర్శం ఎవ‌రోకాదు.

Ads
VADDE NAVEEN JR NTR

VADDE NAVEEN JR NTR

న‌వీన్ తండ్రి వ‌డ్డే రమేష్ సీనియ‌ర్ నిర్మాత కావ‌డం వ‌ల్ల న‌వీన్ కు సినిమాల‌పై ఆసక్తి ఏర్ప‌డింది. ఇక ప్ర‌స్తుతం మాత్రం న‌వీన్ ఇండస్ట్రీకి పూర్తిగా దూర‌మైన సంగతి తెలిసిందే. ఇదిలా ఉంటే వ‌డ్డే న‌వీన్ నంద‌మూరి కుటుంబానికి అల్లుడు అన్న సంగ‌తి మాత్రం అతికొద్ది మందికి మాత్ర‌మే తెలుసు. ఎన్టీరామారావు కుమారుల‌లో ఒక‌రు అయిన నంద‌మూరి రామ‌క్రిష్ణ కూతురును వ‌డ్డే న‌వీన్ వివాహం చేసుకున్నారు. అంతే కాకుండా ఈ సంబంధాన్ని ఎన్టీఆర్ కుదిర్చార‌ని..ఎన్టీఆర్ కు వ‌డ్డే న‌వీన్ మంచి స్నేహితుడు అని కూడా అప్ప‌ట్లో గుస‌గుస‌లు వినిపించాయి.

ALSO READ :షూటింగ్ లో చరణ్ ఎన్టీఆర్ మ‌ధ్య గొడ‌వ‌లు… 25 రోజులు వృధా అయ్యాయి..రాజ‌మౌళి షాకింగ్ కామెంట్స్..!

మ‌రోవైపు పెళ్లికి ముందే వ‌డ్డే ఆమెతో ప్రేమ‌లో ఉన్నార‌ని ఆ త‌ర‌వాత ఎన్టీఆర్ వ‌ల్ల సంబంధం కుదిరింద‌ని టాక్ వినింపించింది. అలా మొత్తానికి సంబంధం కుదిరి న‌వీన్ నంద‌మూరి కుటుంబానికి అల్లుడు అయ్యాడు. అంతే కాకుండా జూనియ‌ర్ ఎన్టీఆర్ కు భావ అయ్యాడు. అయితే ఏం జ‌రిగిందో ఏమోగానీ వ‌డ్డే న‌వీన్ త‌న మొద‌టి భార్య‌కు విడాకులు ఇచ్చారు. అనంత‌రం మ‌ళ్లీ పెళ్లి చేసుకున్నారు. ఇక నంద‌మూరి కుటుంబంతో బంధుత్వం తెంచుకున్నా కూడా న‌వీన్ ఎన్టీఆర్ మ‌రియు ఇత‌ర నంద‌మూరి హీరోల‌తో స్నేహంగానే ఉంటార‌ట‌.


You may also like