Manam News : బ్రేకింగ్ న్యూస్ తెలుగు » షూటింగ్ లో చరణ్ ఎన్టీఆర్ మ‌ధ్య గొడ‌వ‌లు… 25 రోజులు వృధా అయ్యాయి..రాజ‌మౌళి షాకింగ్ కామెంట్స్..!

షూటింగ్ లో చరణ్ ఎన్టీఆర్ మ‌ధ్య గొడ‌వ‌లు… 25 రోజులు వృధా అయ్యాయి..రాజ‌మౌళి షాకింగ్ కామెంట్స్..!

by AJAY
Ads

ఆర్ఆర్ఆర్ సినిమా షూటింగ్ పూర్తి చేసుకుని విడుదలకు రెడీ అవ్వడంతో చిత్ర‌యూనిట్ ప్రమోషన్స్ లో ఫుల్ బిజీగా ఉంది. ఇప్పటికే చిత్ర బృందం ముంబైలో మీడియా సమావేశం ఏర్పాటు చేసిన సంగతి తెలిసిందే. అంతేకాకుండా ఈ రోజు హైదరాబాద్ లో ప్రెస్ మీట్ ఏర్పాటు చేస్తోంది. ఈ సందర్భంగా రాజమౌళి ఎన్టీఆర్ చరణ్ లకు గొడవలు జరిగినట్టు చెప్పాడు. అయితే అవి సీరియస్ గొడవలు కాదని సిల్లీ గొడవలు అని రాజమౌళి చెప్పిన తర్వాత అర్థం అయ్యింది. రాజమౌళి ప్రెస్ మీట్ లో మాట్లాడుతున్న సమయంలో జూనియర్ ఎన్టీఆర్ గట్టిగా గిల్లారు. దాంతో రాజమౌళి ఒక్కసారిగా ఎగిరి పడ్డారు. వెంటనే నవ్వుతూ ఆయన లేచి నిలబడ్డారు.

Advertisement

rajamouli comments at rrr pressmeet

rajamouli comments at rrr pressmeet

షూటింగ్ లో ఎన్టీఆర్ రామ్ చరణ్ తో చాలా ప్రాబ్లమ్స్ ఎదురయ్యాయని రాజమౌళి వెల్లడించారు. ఈ సినిమా షూటింగ్ దాదాపు 300 రోజులు జరిగిందని అన్నారు. అయితే వీరిద్దరి మూలంగా అందులో 25 రోజులు వృధా అయ్యాయని రాజమౌళి చెప్పుకొచ్చారు. ఇద్దరికీ 30 ఏళ్లకు పైగా వయసు వచ్చింది… ఇద్దరికి పెళ్లిళ్లు జరిగాయి. చాలా ఫ్యాన్ ఫాలోయింగ్ కూడా ఉంది. అన్నా నీ కోసం చచ్చిపోతాం అభిమానులు ఉన్నారు. కానీ వీళ్లు మాత్రం ఇద్దరూ గొడవ పడేవారు అంటూ రాజమౌళి వెల్లడించారు.

Ad

also read :ఆర్ఆర్ఆర్ త‌ర‌వాత క‌న్న‌డ న‌టీన‌టుల‌తో సినిమా చేస్తా : రాజ‌మౌళి

ఎన్టీఆర్ నా దగ్గరికి వచ్చే వాడు ..చరణ్ నన్ను గిల్లాడు అని చెప్పేవాడు ..చరణ్ ని అడిగితే అమాయకంగా మొహం పెట్టి నేను స్క్రిప్ట్ లోని లైన్ చదువుకుంటున్నా అని చెప్పేవాడు. ఇద్దరూ సెట్ లో సరదాగా ఉండేవారు అంటూ రాజమౌళి ఫన్నీ మూమెంట్ లు షేర్ చేసుకున్నారు. ఇక రాజమౌళి షూటింగ్ ఆసమయంలో జరిగిన విషయాలను చెబుతుండగా చరణ్ ఆ విషయాలు చెప్పకూడదని కోరారు..అయినప్పటికీ జక్కన్న నవ్వుతూ అన్నీ చెప్పారు.

Visitors Are Also Reading