Home » రాజమౌళి అమ్మ గారు చిరంజీవికి బంధువని తెలుసా ? ఎలాగంటే ?

రాజమౌళి అమ్మ గారు చిరంజీవికి బంధువని తెలుసా ? ఎలాగంటే ?

by AJAY
Published: Last Updated on
Ad

ఇండియాలో స్టార్ డైరెక్ట‌ర్ ఎవ‌రని అడిగితే ఆలోచించ‌కుండా చెప్పే పేరు రాజ‌మౌళి. ఎన్నో బ్లాక్ బ‌స్ట‌ర్ సినిమాల‌తో రాజమౌళి స్టార్ డైరెక్ట‌ర్ గా ఎదిగారు. ఆయన స్టార్ డైరెక్ట‌ర్ గా ఎద‌గ‌ట‌మే కాకుండా తెలుగు హీరోల‌ను పాన్ ఇండియాకు ప‌రిచ‌యం చేశారు….చేస్తున్నారు. అంతే కాకుండా తెలుగు సినిమా సత్తాను అన్ని భాష‌ల వారికి చూపిస్తున్నారు. నిజానికి ఒక‌ప్పుడు బాలీవుడ్ లో సినిమా చేయాల‌ని అనుకునేవారు.

Advertisement

టాలీవుడ్ స‌క్సెస్ అయ్యి ఆ త‌రవాత హీరోయిన్ లు బాలీవుడ్ వైపుకు అడుగులు వేసేవారు. ఇక హీరోల‌కు అయితే బాలీవుడ్ అనేది అంద‌ని ద్రాక్ష వంటిదే. అయితే ఇప్పుడు బాలీవుడ్ హీరోలే రాజ‌మౌళితో సినిమా చేయాల‌ని కోరుకుంటున్నారంటే ఆయ‌న‌కు ఉన్న క్రేజ్ ను అర్థం చేసుకోవ‌చ్చు. అంతే కాకుండా బాలీవుడ్ హీరోయిన్ లు కూడా టాలీవుడ్ హీరోల ప‌క్క‌న సినిమాలు చేస్తామంటూ ఓపెన్ గా చెబుతున్నారు.

Advertisement

అయితే రాజ‌మౌళి ఈ స్థాయికి చేరుకోవ‌డం వెన‌క ఆయ‌న తండ్రి విజ‌యేంద్ర‌ప్ర‌సాద్ కృషి కూడా ఎంతో ఉంది. విజ‌యేంద్ర ప్ర‌సాద్ క‌థ‌ల‌తోనే రాజ‌మౌళి సినిమాలు చేసి స‌క్సెస్ అయ్యారు. అయితే రాజ‌మౌళి తండ్రి గురించి అంద‌రికీ తెలుసు కానీ రాజ‌మౌళి త‌ల్లి గురించి ఎవ‌రికీ తెలియ‌దు. కాగా ఆర్ఆర్ఆర్ సినిమా ప్ర‌మోష‌న్స్ లో భాగంగా విజయేంద్ర‌ప్రసాద్ త‌న భార్య గురించి చెప్పారు. యంక‌ర్ విజ‌యేంద్ర‌ప్ర‌సాద్ ను చ‌ర‌ణ్-ఎన్టీఆర్ ల‌తో సినిమా అంటే కాపు, క‌మ్మ రిజ‌ర్వేష‌న్లు అడ్డు పెట్టుకుని భ‌విష్యత్లో రాజ‌కీయాల్లోకి వ‌చ్చే అవ‌కాశం ఉందా అంటూ ప్ర‌శ్నించారు.

also read : డైరెక్టర్ తేజ కొడుకు చైల్డ్ ఆర్టిస్ట్ గా ఈ సినిమాలలో నటించారని మీకు తెలుసా ?

దానికి విజ‌యేంద్ర‌ప్ర‌సాద్ మాట్లాడుతూ…త‌నది క‌మ్మ కులం అని 1966లో త‌మ వివాహం జ‌రిగింద‌ని అయితే త‌న భార్య‌ది ఏ కుల‌మో కూడా తెలియ‌ద‌ని చెప్పారు. ఖైధీ సినిమా విడుద‌లైన‌ప్పుడు సినిమాకు వెళ్ల‌గా చిరంజీవి మావాళ్లే….మా బంధువే అంటూ తన భార్య చెప్పింద‌ని అన్నారు. అంతే కాకుండా త‌మ కుటుంబంలో చాలా మంది కులాంత‌ర వివాహాలు చేసుకున్నార‌ని రాజ‌మౌళి తెలిపారు. త‌మ కుటుంబంలోని అమ్మాయిలు…కాపు, ప‌ద్మ‌శాలి ఇత‌ర కులాల‌కు చెందిన వారిని పెళ్లి చేసుకున్నార‌ని కులాల ప‌ట్టింపులు లేవ‌ని అన్నారు.

Also Read: మెగాస్టార్ చిరంజీవి ఆ స‌మ‌యంలో కీల‌క నిర్ణ‌యం తీసుకున్నార‌ట‌..!

Visitors Are Also Reading