Telugu News » Blog » డైరెక్టర్ తేజ కొడుకు చైల్డ్ ఆర్టిస్ట్ గా ఈ సినిమాలలో నటించారని మీకు తెలుసా ?

డైరెక్టర్ తేజ కొడుకు చైల్డ్ ఆర్టిస్ట్ గా ఈ సినిమాలలో నటించారని మీకు తెలుసా ?

by Anji
Ads

ద‌ర్శ‌కుడు తేజ గురించి ఇక ప్ర‌త్యేకంగా చెప్పాల్సిన అవ‌స‌ర‌మే లేదు. ఎందుకంటే అత‌ని గురించి మ‌నంద‌రికీ తెలిసిందే. ఆయ‌న చిన్న వ‌య‌స్సులోనే త‌ల్లిని కోల్పోయి.. ఇంట్లో నుంచి పారిపోయి చెన్నైలో ఎన్నో క‌ష్టాల‌కు ఓర్చుకుని ఈ స్థాయికి చేరుకున్నారు. త‌న పిల్ల‌ల‌కు సైతం ఎలాంటి ఆస్తులు ఇవ్వ‌న‌ని వారంత‌టా వాళ్లే.. వారికి ఏమి కావాలో వాళ్లే సంపాదించుకోవాల‌ని తేజ చెబుతుంటారు.

Also Read :  ఆ వైర‌స్ సోకి ఆసుప‌త్రిలో చేరిన డాక్ట‌ర్ బాబు భార్య మంజుల‌..!


తేజ‌కు భార్య శ్రీ‌వ‌ల్లి, ఇద్ద‌రు పిల్ల‌లు క‌ల‌రు. కొడుకు అమితవ్ తేజ, ఐలా తేజ కూతురు ప్ర‌స్తుతం అమెరికాలో చ‌దువుతుంది. కూతుర అమెరికాలో చ‌దువుతోంది. కానీ కుమారుడు సినిమాల్లో హీరోగా సిద్ధ‌మ‌వుతున్నాడు. 1995లో ముంబ‌యిలో అమిత‌వ్ జ‌న్మించాడు. ఆ స‌మ‌యంలో రామ్‌గోపాల్ వ‌ర్మ‌, ఇంకా పెద్ద పెద్ద డైరెక్ట‌ర్ల వ‌ద్ద తేజ సినిమాటోగ్రాఫ‌ర్ గా ప‌ని చేస్తూ చాలా బిజీగా గ‌డిపాడు. ఆ త‌రువాత హైద‌రాబాద్‌కు మ‌కాం మార్చి అనుకోకుండా చిత్రం సినిమా ద్వారా ద‌ర్శ‌కుడిగా మారాడు.


తేజ ద‌ర్శ‌క‌త్వం వ‌హించిన తొలి సినిమాలో ఓ సాంగ్‌లో అమిత‌వ్ తేజ అలా వ‌చ్చి ఇలా వెళ్లిపోయాడు. అమిత‌వ్‌కు ఇదే మొద‌టి సినిమా. చ‌దువుకుంటూనే బాక్సింగ్ నేర్చుకుంటున్న అమిత‌వ్‌, మ‌హేష్ బాబు హీరోగా న‌టించిన నిజం సినిమాకు వాయిస్ ఓవ‌ర్ ఇచ్చాడు. అదేవిధంగా కృష్ణ‌వంశీ ద‌ర్శ‌క‌త్వంలో వ‌చ్చిన గోవిందుడు అంద‌రి వాడులే సినిమాకు అసిస్టెంట్ డైరెక్ట‌ర్‌గా కూడా ప‌ని చేశాడు. సినిమాల పూర్తి గ్రిప్ సంపాదించుకోవాల‌ని అమిత‌వ్ కాలిఫోర్నియాలో ఫిల్మ్ అండ్ టెలివిజ‌న్ ప్రోగ్రామ్‌లో జాయిన్ అయ్యాడు. మొద‌టి సెమిస్ట‌ర్ త‌రువాత డ్రాప్ అయి న్యూయార్క్‌లో లీ స్ట్రాస్ బెర్గ్ థియేట‌ర్ అండ్ ఫిల్మ్ ఇన్‌స్టిట్యూట్‌లో జాయిన్ అయ్యాడు.


ఈ మ‌ధ్య ఒక షార్ట్ ఫిల్మ్ కూడా డైరెక్ట‌ర్ చేసాడు. ప్ర‌స్తుతం మోష‌న్ పిక్చ‌ర్ ఎగ్జిబిష‌న్ కంపెనీ, జ‌యం మూవీస్ ప్ర‌యివేటు లిమిటెడ్‌, చిత్రం మూవీస్ సంస్థ‌ల‌కు సీఈఓగా వ్య‌వ‌హ‌రిస్తున్నాడు. కొద్ది రోజుల క్రితం కేతిరెడ్డి జ‌గ‌దీశ్వ‌ర్‌రెడ్డి, అమిత‌వ్‌తో సినిమా చేయ‌బోతున్న‌ట్టు అనౌన్స్ చేశారు. ఆ ప్రాజెక్ట్ ప‌ట్టాలెక్క‌లేదు. అమిత‌వ్ తేజ మంచి క‌థ దొరికితే హీరోగా ప‌రిచ‌యం అవ్వాల‌ని చూస్తున్నారు. చైల్డ్ ఆర్టిస్ట్‌గా వాయిస్ ఓవ‌ర్ ఆర్టిస్ట్‌గా, అసిస్టెంట్ డైరెక్ట‌ర్‌గా, షార్ట్ ఫిల్మ్ డైరెక్ట‌ర్‌గా చేసిన అమిత‌వ్, న‌టుడిగా కూడా చేయాల‌ని ప్ర‌య‌త్నిస్తున్నారు. మొత్తానికి తండ్రి మాదిరిగానే కొడుకు కూడా మ‌ల్టీటాలెండెండ్ అనిపించుకున్నాడు.

Also Read :  ఈ 7గురు సెల‌బ్రెటీలకు త‌ల్లులు వేరు కానీ తండ్రి ఒక్క‌రే అన్న సంగ‌తి తెలుసా..!


You may also like