Home » ఆ సినిమా కోసం బాల‌కృష్ణ‌కు 3 కండీష‌న్స్ పెట్టిన NTR !

ఆ సినిమా కోసం బాల‌కృష్ణ‌కు 3 కండీష‌న్స్ పెట్టిన NTR !

by Azhar
Ad

మంగ‌మ్మ‌గారి మ‌న‌వ‌డు బాల‌కృష్ణ‌కు కెరీర్ ను టాప్ గేర్ లోకి తీసుకెళ్లిన సినిమా! భార‌తీ రాజా త‌మిళ్ లో తీసిన ‘మణ్ వాసనై చిత్రాన్ని తెలుగులో కోడి రామకృష్ణ డైరెక్ష‌న్ లో మంగ‌మ్మ‌గారి మ‌న‌వ‌డు పేరుతో రిమేక్ చేశారు. అయితే ఈ సినిమాకు కీలకమైన‌ మంగ‌మ్మ పాత్రను భానుమ‌తితో చేయించండి, ఒక‌వేళ ఆమె తిర‌స్క‌రిస్తే ఈ సినిమాను తీయ‌క‌పోవ‌డ‌మే మంచిద‌ని NTR ఖ‌రాఖండిగా చెప్పారు. అంతే కాదు ఆయ‌నే ఫోన్ చేసి
ఈ సినిమాలో న‌టించేందుకు భానుమ‌తిని ఒప్పించారు. భానుమ‌తి బహుముఖ ప్రజ్ఞాశాలి. నటి, నిర్మాత, దర్శకురాలు, స్టూడియో అధినేత్రి, రచయిత్రి, గాయని, సంగీత దర్శకురాలు అన్నింటికీ మించి మంచి విలువ‌లు క‌లిగి ఉన్న మ‌నిషి.

Also Read: కంప్యూటర్ పై పనిచేస్తున్నారా…అయితే కంటి చూపు కోసం ఈ జాగ్రత్తలు తీసుకోండి…!

Advertisement

Advertisement

సినిమా షూటింగ్ కు ముందు కాస్ట్ అండ్ క్రూ అంతా సెట్ అయ్యాక NTR బాల‌కృష్ణ‌ను పిలిచి 3 విష‌యాలు చెప్పారు. వీటిని ష‌ర‌తులుగా పాటించాల‌ని పేర్కొన్నారు. అవి ఏంటంటే…

1) భానుమ‌తి కంటే అర‌గంట ముందే షూటింగ్ వ‌ద్ద‌కు వెళ్లి రెడీగా ఉండాలి. ఏ ఒక్క రోజు కూడా నీ వ‌ల్ల ఆమె వెయిట్ చేయొద్దు.
2) ఆమె కార్ డోర్ నువ్వే తీయాలి
3) ఆమె కార్లోంచి దిగ‌గానే ఆమె కాళ్ల‌కు న‌మ‌స్క‌రించి ఆశీర్వాదం తీసుకోవాలి.

NTR పెట్టిన ఈ ష‌ర‌తుల‌ను బాల‌య్య ఒప్పుకోవ‌డమే కాకుండా షూటింగ్ జ‌రిగిన‌న్ని రోజులు పాటించాడు. సినిమా సూప‌ర్ స‌క్సెస్ అయ్యింది. ఆ మ‌ర్యాద సినిమా త‌ర్వాత కూడా కొన‌సాగింది.

Also Read: టాలీవుడ్ ప్రముఖులను వరించని పద్మా అవార్డులు….!

Visitors Are Also Reading