Home » సమంత పర్సనల్ లైఫ్ పై లేడీ డైరెక్టర్ ఆసక్తికర వ్యాఖ్యలు…!

సమంత పర్సనల్ లైఫ్ పై లేడీ డైరెక్టర్ ఆసక్తికర వ్యాఖ్యలు…!

by AJAY
Published: Last Updated on
Ad

టాలీవుడ్ స్టార్ హీరోయిన్ సమంత హీరో నాగ చైతన్య గత ఏడాది డిసెంబర్ లో విడాకులు తీసుకున్న సంగతి తెలిసిందే. అయితే వీరి విడాకుల గురించి ఇప్పటికీ రకరకాల వార్తలు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతూనే ఉంటాయి. అంతేకాకుండా వీరికి సన్నిహితులు, స్నేహితులు ఇద్దరి గురించి చెప్పిన మాటలు కూడా సోషల్ మీడియాలో వైరల్ అవుతునే ఉంటాయి. అయితే తాజాగా సమంత స్నేహితురాలు నందిని రెడ్డి కూడా ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.

Advertisement

నందినిరెడ్డి సమంతతో జబర్దస్త్ అనే సినిమా చేశారు. ఈ సినిమా అనుకున్నమేర విజయం సాధించలేదు. ఆ తర్వాత వీరిద్దరి కాంబినేషన్ లో ఓ బేబీ అనే సినిమా వచ్చింది. ఈ సినిమా మంచి విజయం సాధించింది. కాగా తాజాగా ఓ ఇంటర్వ్యూలో సమంత పర్సనల్ లైఫ్ గురించి యాంకర్ ప్రశ్నించగా నందినీ రెడ్డి మాట్లాడుతూ…. తన కెరీర్ సమంత కెరీర్ దాదాపు ఒకే సమయంలో ప్రారంభమయ్యాయని తెలిపింది.

Advertisement

జబర్దస్త్ సినిమా చేసే సమయంలో సమంతకు ఆరోగ్యం బాగా లేకపోవడం అప్పుడే ఆమె వ్యక్తిగత జీవితంలో ఒడిదుడుకులు రావడం జరిగిందని తెలిపింది. ఆ సమయంలో తాను సమంత పక్కన ఉన్నానని చెప్పింది. అదే సమయంలో సమంత సన్నిహితులు గా మారిపోయాను అని తెలిపింది.

కానీ ఎంత సున్నితంగా ఉన్నా తమ వ్యక్తిగత విషయాల్లో జోక్యం చేసుకోలేదు అని చెప్పింది. ఏం జరిగిందో తెలుసుకోకుండా తాను ఆసక్తి చూపించని …నిజానికి సెలబ్రిటీల గురించి ఎంత తక్కువ తెలుసుకుంటే అంత మంచిదని వ్యాఖ్యానించింది. భార్యాభర్తల మధ్య ఎన్నో విషయాలు ఉంటాయని అవి వారిద్దరికి మాత్రమే తెలుస్తాయని నందినీరెడ్డి చెప్పుకొచ్చింది.

Also read :

 

బ్రతికుండగానే ఆ సూపర్ హిట్ సినిమాకు సీక్వెల్ కథ రాసుకున్న ఈవివి సత్యనారాయణ..!

Visitors Are Also Reading