Home » రాజ‌మౌళి సినిమా పోస్టర్ల పై ఈ స్టాంప్ ఎందుకు వేసుకుంటారు..? దాని వెన‌క ఉన్న స్టోరీ ఇదే..?

రాజ‌మౌళి సినిమా పోస్టర్ల పై ఈ స్టాంప్ ఎందుకు వేసుకుంటారు..? దాని వెన‌క ఉన్న స్టోరీ ఇదే..?

by AJAY
Published: Last Updated on
Ad

తెలుగు సినిమా మాత్ర‌మే కాకుండా ఏకంగా ఇండియన్ సినిమా గ‌ర్వించద‌గిన ద‌ర్శ‌కుడు రాజ‌మౌళి. స్టూడెంట్ నంబ‌ర్ 1 సినిమాతో రాజ‌మౌళి ద‌ర్శ‌కుడిగా ప్ర‌స్తానాన్ని మొద‌లు పెట్టారు. అయితే అంత‌క‌ముందే జ‌క్క‌న్న శాంతి నివాసం సీరియ‌ల్ కు ద‌ర్శ‌కుడుగా వ్య‌వ‌హ‌రించారు. ఈ సీరియ‌ల్ కూడా స‌క్సెస్ అయ్యింది. అదేవిధంగా మొద‌టి సినిమా కూడా స‌క్సెస్ అయ్యింది. స్టూడెంట్ నంబ‌ర్ 1 సినిమా త‌ర‌వాత జ‌క్క‌న్న కెరీర్ లో వెనక్కి తిరిగి చూసుకోవాలేదు.

Advertisement

 

అయితే జ‌క్క‌న్న పేరు దేశ‌వ్యాప్తంగా వినిపించేలా చేసిన సినిమా మాత్రం మ‌గ‌ధీర‌. ఈ సినిమా త‌ర‌వాత బాలీవుడ్ ప్రేక్ష‌కులు సైతం జ‌క్క‌న్న టాలెంట్ కు ఫిదా అయ్యారు. ఇక బాహుబ‌లి తో జ‌క్కన్న సెన్సేష‌న్ క్రియేట్ చేశారు. రెండు పార్ట్ లుగా వ‌చ్చిన ఈ సినిమా పాన్ ఇండియా అంటూ కొత్త పేరును ప‌రిచ‌యం చేసింది. అలా జ‌క్క‌న్న సెట్ చేసిన ట్రెండ్ ను ఇప్పుడు అంద‌రు ద‌ర్శ‌కులు ఫాలో అవుతున్నారు.

Advertisement

ఇక ఆ త‌ర‌వాత ఆర్ఆర్ఆర్ తో జ‌క్క‌న్న మ‌రో వండ‌ర్ క్రియేట్ చేశాడు. ఈ సినిమాకు ఏకంగా ఆస్కార్ వ‌చ్చింది. అయితే జ‌క్క‌న్న అంటే బ్రాండ్ అన్న సంగ‌తి ప్ర‌త్యేకంగా చెప్పాల్సిన అవ‌స‌రం లేదు. ఇక జ‌క్క‌న్న ప్ర‌తి సినిమా పోస్ట‌ర్ కు రాజ‌మౌళి అంటూ బ్రాండ్ స్టాంప్ కూడా ఉంటుంది. అయితే జ‌క్క‌న్న మొద‌టి సినిమా నుండి పోస్ట‌ర్ పై అలా స్టాంప్ ఎందుకు వేసుకుంటారు అన్న విష‌యం చాలా మందికి తెలియ‌దు.

కాగా ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే లో ఈ విష‌యం పై క్లారిటీ ఇచ్చారు. మొద‌టి సినిమా స‌మయంలో త‌న‌కు ఇన్సెక్యురిటీ ఉండేద‌ని చెప్పారు. దర్శ‌కుడి పేరు ఎక్క‌డో కింద చిన్న‌గా ఉండ‌టం వ‌ల్ల క‌న‌ప‌డ‌ద‌ని దాంతో క్రెడిట్ వేరే వాళ్ల‌కు వెళ్లిపోతుందనే భ‌యంతో వేశాన‌ని అన్నారు. అంతే కాకుండా చ‌దువురాని వాళ్ల‌కు కూడా అది రాజ‌మౌళి అని తెలిసిపోతుంద‌ని చెప్పారు. ఇప్పుడు అదే బ్రాండ్ అయ్యింద‌ని జ‌క్క‌న్న అన్నారు.

Visitors Are Also Reading