Home » వీర‌య్య రొటీన్ క‌థ అంటూ అంచ‌నాలు త‌గ్గించిన మెగాస్టార్…అస‌లు కార‌ణం అదేనా..?

వీర‌య్య రొటీన్ క‌థ అంటూ అంచ‌నాలు త‌గ్గించిన మెగాస్టార్…అస‌లు కార‌ణం అదేనా..?

by AJAY
Published: Last Updated on
Ad

సాధార‌ణంగా ఓ సినిమా విడుద‌ల‌కు రెడీ అవుతుందంటే ఆ సినిమా పై భారీ అంచ‌నాల‌ను పెంచేస్తారు. సినిమా ఆడియో ఫంక్ష‌న్ లు ప్ర‌మోష‌న్ కార్య‌క్ర‌మాల‌లో సినిమాను ఆకాశానికి ఎత్తేస్తారు. సినిమా తోపు సినిమా అవుతుంది.ఈ సినిమాలో హైలైట్స్ అవే…ద‌ర్శ‌కుడి టాలెంట్ సూప‌ర్ క‌థ నెవ్వ‌ర్ బిఫోర్ ఇలా చాలా చెప్తారు.

Also Read:  స‌మంత‌కు బిగ్ షాక్…ఏం మాయ చేశావే సినిమాలో చైతూకు జోడీగా ఆ స్టార్ హీరోయిన్.?

Advertisement

కానీ మా సినిమాలోని మైన‌స్ ల‌ను మాత్రం అస్స‌లు చెప్పరు. అయితే చిరంజీవి మాత్రం విడుద‌ల‌కు సిద్దంగా ఉన్న వాల్తేరు వీర‌య్య సినిమా గురించి నెగిటివ్ గా చెప్ప‌డం ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. ఈ ఏడాది సంక్రాంతికి చిరంజీవి హీరోగా న‌టించిన వాల్తేరు వీర‌య్య సినిమా విడుద‌ల కాబోతుంది. ఈ సినిమాలో శృతి హాస‌న్ హీరోయిన్ గా న‌టించింది. ఈ సినిమాకు బాబి ద‌ర్శ‌క‌త్వం వ‌హించారు.

Advertisement

కాగా ఈ సినిమా ప్ర‌మోష‌న్స్ లో మెగాస్టార్ చిరంజీవి సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశారు. వాల్తేరు వీర‌య్య సినిమా ప్రెస్ మీట్ ను అల్యూమీనియం ఫ్యాక్ట‌రీలో ప‌డ‌వ సెట్ వేసి డిఫ‌రెంట్ గా నిర్వ‌హించారు. ఇక సినిమా గురించి రిపోర్ట‌ర్ రొటీన్ మాస్ క‌థ‌ల‌కు ఆధ‌రణ త‌గ్గుతున్న క్ర‌మంలో వాల్తేరు వీర‌య్య ఎలా ఉండ‌బోతుంని ప్ర‌శ్నించారు. దానికి చిరంజీవి స‌మాధాన‌మిస్తూ రొటీన్ గానే ఉండ‌బోతుంద‌ని అన్నారు.

అలా చెబుతూనే రాసిపెట్టుకోండి లోప‌ల మాత్రం షాక్ తినేంత‌ వైవిధ్య‌మైన ఎమోష‌న్ ఉంటుంద‌ని చెప్పారు. అయితే చిరంజీవి ఇలా చెప్ప‌డానికి కొన్ని కార‌ణాలు ఉన్నాయ‌న విశ్లేషుకులు అభిప్రాయ‌ప‌డుతున్నారు. చిరంజీవి లాస్ట్ సినిమా ఆచార్య పై విడుద‌ల‌కు ముందు భారీ అంచ‌నాలు పెంచేశారు. కానీ సినిమా తేలిపోయింది. ఈ నేప‌థ్యంలోనే వాల్తేరు వీర‌య్య సినిమా పై చిరు అంచ‌నాల‌ను త‌గ్గించార‌ని విశ్లేష‌కులు అభిప్రాయ‌ప‌డుతున్నారు.

Also Read: దిల్ రాజును కోలుకోలేని దెబ్బ‌కొట్టిన రెండు సినిమాలు ఏవో తెలుసా..?

Visitors Are Also Reading