Home » రిటైర్మెంట్ తర్వాత మరో రంగంలోకి వెళ్లిన 5 క్రికెటర్లు వీరే…!

రిటైర్మెంట్ తర్వాత మరో రంగంలోకి వెళ్లిన 5 క్రికెటర్లు వీరే…!

by Azhar
Ad

క్రికెట్ ప్రపంచంలోకి అడుగుపెట్టి చాలామంది తమకంటూ సొంత గుర్తింపు కావాలని కోరుకుంటారు. అందుకు తగిన ప్రదర్శనలు కూడా చేస్తారు. అలా కొంతకాలం ఆ క్రికెట్ ప్రపంచంలో వెలిగే ఆటగాళ్ళు ఏదో ఒక సమయంలో రిటైర్మెంట్ ప్రకటించాల్సినదే. అలా ఆటకు రిటైర్మెంట్ ఇచ్చిన తర్వాత కూడా అదే ప్రపంచంలో వుంటారు చాలామంది. అందులోనే క్రికెట్ కోచ్ గా లేదా వ్యాఖ్యాతగా వ్యవహరిస్తూ ఉంటారు. కానీ అలా కాకుండా క్రికెట్ ప్రపంచంలో ప్రత్యేక గుర్తింపు తెచ్చుకొని రిటైర్మెంట్ తర్వాత వేరే రంగంలోకి ప్రవేశించిన ఐదుగురు ఆటగాళ్ల గురించి మనం ఇప్పుడు తెలుసుకుందాం.

సాలిల్ అంకోలా : క్రికెట్ దేవుడు సచిన్ టెండూల్కర్‌తో కలిసి అరంగేట్రం చేసిన అంకోలా… తన మీడియం-పేస్ బౌలింగ్‌తో మంచి పేరును సంపాదించుకున్నాడు. కానీ జట్టులో మాత్రం తన స్థానాన్ని ఫిక్స్ చేసుకోలేకపోయాడు. అందువలన క్రికెట్ కు వీడ్కోలు పలికి… సినిమా రంగంలోకి వెళ్లాలని నిర్ణయించుకున్నాడు. ఆ తర్వాత అతను చాలా టీవీ షోలు మరియు సినిమాలలో నటించాడు.

Advertisement

నాథన్ ఆస్టిల్ : న్యూజిలాండ్ జట్టులో 2000వ దశకం ప్రారంభంలో మంచి ఆల్ రౌండర్ గా… జట్టు మూలస్తంభంగా ఉన్నాడు. కానీ రిటైర్మెంట్ తర్వాత ఆటో రేసింగ్ రంగంలోకి అడుగుపెట్టాడు. 2010లో, అతను సౌత్ ఐలాండ్ స్ప్రింట్ కార్ ఛాంపియన్‌షిప్‌లో మూడవ స్థానంలో నిలిచాడు. ఇది డ్రైవర్‌గా అతని నైపుణ్యాలకు నిదర్శనం.

Advertisement

హెన్రీ ఒలోంగా : మంచి వేగంతో మరియు దూకుడుగా ఉండే ఒలోంగా.. అగ్రశ్రేణి జట్లపై అద్భుతమైన ప్రదర్శనలు చేసిన కొద్దిమంది జింబాబ్వే ఆటగాళ్ళలో ఒక్కడు. కానీ రిటైర్మెంట్ తర్వాత సంగీత ప్రపంచంలోకి వెళ్లి 2006లో ఆరేలియా అనే ఆల్బమ్‌ను విడుదల చేశాడు, ఇది సంగీతం పట్ల అతనికి ఉన్న ప్రేమకు భారీ సూచన.

కర్ట్‌లీ ఆంబ్రోస్ : విండీస్‌ యొక్క ఈ పొడవైన పేస్ బౌలర్ 90లలో బ్యాట్స్‌మెన్‌లకు పీడకల లాంటి వాడు. కానీ తన క్రికెట్ కెరీర్‌కు వీడ్కోలు తీసిన తర్వాత… ఆంబ్రోస్ గిటార్ ప్లేయర్‌గా తన అదృష్టాన్ని పరీక్షించుకోవాలని నిర్ణయించుకున్నాడు. బిగ్ బ్యాడ్ డ్రెడ్ మరియు బాల్డ్‌హెడ్ అనే బ్యాండ్‌లో వాయించాడు.

ఆండ్రూ ఫ్లింటాఫ్ : 2000లలో ఇంగ్లాండ్‌ సాధించిన అనేక విజయాలలో ఫ్లింటాఫ్ ముఖ్య పాత్ర పోషించాడు. కానీ క్రికెట్ కి విరమణ ప్రకటించిన తర్వాత ఊహించని విధంగా బాక్సింగ్‌లోకి అడుగుపెట్టాడు ఫ్లింటాఫ్. 2012లో రిచర్డ్ డాసన్‌పై అతని ప్రసిద్ధ విజయం బాక్సింగ్ ప్రేమికులు మరియు క్రికెట్ అభిమానుల మనస్సులలో ఎప్పటికీ నిలిచిపోయింది.

Visitors Are Also Reading