Home » టాస్ సమయంలో రవిశాస్త్రి ఆగం..!

టాస్ సమయంలో రవిశాస్త్రి ఆగం..!

by Azhar
Ad

ఈరోజు ఆసియా కప్ లోని సూపర్ 4 లో భాగంగా ఇండియా, పాకిస్థాన్ జట్లు తలపడుతున్న విషయం తెలిసిందే. అయితే ఈ రెండు దేశాల మధ్య మ్యాచ్ అంటేనే అడిల్లీ ఏంటో ఒత్తిడిని కలిగిస్తుంది. అయితే ఈ ఒత్తిడి కేవలం ఆటగాళ్లకు మాత్రమే కాకుండా అక్కడ ఉన్న ఫ్యాన్స్ కు అలాగే కామెంట్రీ చెప్పేవాలకు కూడా ఉంటుంది అనే విషయం ఈరోజు భారత మాజీ హెడ్ కోచ్ రవిశాస్త్రి నిరూపించాడు.

Advertisement

ఈరోజు మ్యాచ్ టాస్ సమయంలో ఆ ఒత్తిడి వల్లే అతను ఆగం కావడమే కాకుండా అందర్నీ ఆగం చేసాడు రవిశాస్త్రి. అయితే ఈ మ్యాచ్ టాస్ సమయంలో అక్కడ ప్రజెంటర్ గా ఉన్నాడు రవిశాస్త్రి. ఇక రోహిత్ టాస్ కాయిన్ ను గాల్లోకి వెళ్లగా.. పాక్ కెప్టెన్ బాబర్ టెయిల్స్ అని చెప్పాడు. కానీ రవిశాస్త్రి మాత్రం గట్టిగ మైక్ లో హెడ్స్ అని చెప్పాడు. కానీ తర్వాత టాస్ టెయిల్స్ పడింది.

Advertisement

దాంతో అక్కడ కాసేపు టెన్షన్ అనేది నెలకొంది. బాబర్ టెయిల్స్ అని చెప్పిన దానిని మైక్ లో చెప్పకపోవడంతో అది ఎవరికీ వినపడలేదు. కానీ రవిశాస్త్రి మైక్ లో హెడ్స్ అని గట్టిగ చెప్పాడు. దాంతో అందరూ హెడ్స్ అని అనుకున్నారు. కానీ తర్వాత ఈ విషయంలో కొంత చర్చ అనేది జరిగిన తర్వాత.. బాబర్ టెయిల్స్ చెప్పాడు అని నిర్ధారించుకొని.. టాస్ పాకిస్థాన్ గెలిచినట్లు నిర్ధారించారు. అయితే ఇప్పుడు రవిశాస్త్రి చేసిన ఆగం వీడియో ట్విటర్ లో ట్రెండ్ అవుతుంది.

ఇవి కూడా చదవండి :

విరాట్ వన్డేలకు సరిపోతాడు.. టీ20లకు వేస్ట్..!

ఫ్యాన్స్ కు దాదా షాక్.. అందులోనుండి తప్పుకుంటున్నాను అని..?

Visitors Are Also Reading