Home » రవితేజ రావణాసురాలో సీతమ్మపై డైలాగ్.. తల్లిని అవమానిస్తారా అంటూ ట్రోల్స్..!!

రవితేజ రావణాసురాలో సీతమ్మపై డైలాగ్.. తల్లిని అవమానిస్తారా అంటూ ట్రోల్స్..!!

by Sravanthi
Ad

ప్రస్తుతం తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఉన్నటువంటి స్టార్ హీరోలందరిలో రవితేజ ఒకరు. ఎలాంటి సినీ బ్యాగ్రౌండ్ లేకుండా ఇండస్ట్రీలో ఎంట్రీ ఇచ్చిన రవితేజ ఇప్పటికీ సక్సెస్ఫుల్ హీరోగా దూసుకుపోతున్నారు.. అయితే తెలుగు సినిమా ఇండస్ట్రీలో కొంతమంది మాస్ హీరోలను దృష్టిలో పెట్టుకొని దర్శకులు డైలాగులు రాస్తూ ఉంటారు. అలాంటి వారిలో రవితేజ కూడా కూడా ఒకరు. ఈ మాస్ హీరోలు డైలాగ్ చెప్పారు అంటే తప్పనిసరిగా ఆడియన్స్ కు చేరుతుంది. దాన్ని వారు గుర్తుపెట్టుకుంటారు.

Advertisement

Also Read:ఇండస్ట్రీ హిట్ లాంటి ‘సమరసింహ రెడ్డి’ సినిమాలో ఒక్క సీన్ బాగోలేదని వదిలేసిన హీరోయిన్ ఎవరంటే ?

అయితే తాజాగా మాస్ మహారాజ రవితేజ హీరోగా వస్తున్న రావణాసుర సినిమా విడుదలకు సిద్ధంగా ఉంది. అయితే ఈ చిత్ర యూనిట్ సినిమాకు సంబంధించిన ఒక ట్రైలర్ ను విడుదల చేసింది. ఈ ట్రైలర్ కు మంచి ఆదరణ లభించింది.కానీ ఈ ట్రైలర్ కాస్త విమర్శల పాలైపోయింది. దీనికి ప్రధాన కారణం హిందువులు ఆరాధ్య దైవంగా భావించే సీతమ్మ వారిపై ఈ డైలాగు ఉండడం అందరు విమర్శిస్తున్నారు. ఈ చిత్రంలో “సీతను చేరుకోవాలంటే సముద్రాన్ని దాటితే సరిపోదు.. రావణాసురున్ని దాటాలి” అనే డైలాగ్ ఉంటుంది.

Advertisement

Also Read:ఈ చిన్నారి ప్రపంచంలోనే అత్యంత తెలివైన విద్యార్థిని.. వరల్డ్స్ స్మార్టెస్ట్ స్టూడెంట్ గా గుర్తింపు

ఈ డైలాగులు మాస్ మహారాజ రవితేజ చెబుతారు. ఈ డైలాగులు సీతమ్మ తల్లిని తక్కువ చేసి ఉండటంతో నెటీజన్లు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఈ మూవీ కోసం మహా తల్లి జీవితంలోని విషాద ఘట్టాన్ని వాడుకోవడం ఏంటని మండిపడుతున్నారు. రావణాసురుడి బలాన్ని చెప్పడం కోసం సీతమ్మను తక్కువ చేసి చూపాలా అంటూ ప్రశ్నిస్తున్నారు. ప్రస్తుతం దీనికి సంబంధించిన వీడియో పై సోషల్ మీడియాలో ట్రోల్స్ వైరల్ గా మారాయి.

Also Read:భారీ రేటుకు బ‌ల‌గం ఓటీటీ హ‌క్కులు..స్ట్రీమింగ్ ఎప్పుడంటే…?

Visitors Are Also Reading