Home » భారీ రేటుకు బ‌ల‌గం ఓటీటీ హ‌క్కులు..స్ట్రీమింగ్ ఎప్పుడంటే…?

భారీ రేటుకు బ‌ల‌గం ఓటీటీ హ‌క్కులు..స్ట్రీమింగ్ ఎప్పుడంటే…?

by AJAY
Ad

తెలంగాణ రాష్ట్రం ఏర్ప‌డిన త‌రవాత ఆ ప్రాంత యాస‌లో వ‌స్తున్న చాలా సినిమాల‌కు ఆద‌ర‌ణ ల‌భిస్తోంది. ఒక‌ప్పుడు తెలంగాన యాస‌ను కామెడీ కోసం సినిమాల‌లో వాడుకునేవాళ్లు కానీ ప్ర‌స్తుతం పూర్తి సినిమానే తెలంగాణ యాస‌లో తెర‌కెక్కించి హిట్ లు కొడుతున్నారు. పెళ్లి చూపులు, అర్జున్ రెడ్డి తో పాటూ చాలా సినిమాలు అలా వ‌చ్చి హిట్ అయ్యాయి.

ALSO READ :ఈ ఏడాది చ‌ర‌ణ్ దే…ఉపాస‌న ఆస‌క్తిక‌ర వ్యాఖ్య‌లు..!

Advertisement

ఇక తాజాగా మ‌రో తెలంగాణ చిత్రం థియేట‌ర్ ల‌లో కాసులు కురిపిస్తోంది. క‌మెడియ‌న్ వేణు టిల్లు ద‌ర్శ‌కుడుగా ప్రియ‌ద‌ర్శి హీరోగా తెర‌కెక్కిన సినిమా బ‌ల‌గం. ఈ సినిమాను పూర్తిగా తెలంగాణ విలేజ్ బ్యాక్ డ్రాప్ లో తెర‌కెక్కించారు.

ALSO READ : పుచ్చకాయను ఫ్రిజ్ లో పెట్టి తింటున్నారా… అయితే ఈ ప్రమాదంలో పడ్డట్టే!

Advertisement

ఈ నెల 3న సినిమాను విడుదల చేశారు.ఇక ఈసినిమాకు ప్రిమియ‌ర్ నుండే పాజిటివ్ టాక్ రావ‌డంతో క‌లెక్ష‌న్ లు కూడా భారీగానే వ‌స్తున్నాయి. అంతే కాకుండా ఈ సినిమా స్ట్రీమింగ్ రైట్స్ ను ప్ర‌ముఖ ఓటీటీ సంస్థ అమేజాన్ ప్రైమ్ ద‌క్కించుకుంది.

అయితే క‌చ్చితంగా ఎంత‌కు అమ్ముడుపోయిందా వెల్ల‌డికాలేదు కానీ టాక్ ప్ర‌కారం భారీ ద‌ర‌కే అమ్ముడు పోయింది. అంతే కాకుండా ఈ సినిమా ఎప్రిల్ 2వ వారంలో స్ట్రీమింగ్ కాబోతుంద‌ని టాక్ వినిపిస్తోంది. ఇక థియేట‌ర్ లో సినిమాను మిస్ అయినవాళ్లు మరియు ఓటీటీ ప్రియులు బ‌ల‌గం చూడాలంటే ఎప్రిల్ 2వ వారం వ‌ర‌కూ వెయిట్ చేయాల్సిందే.

ALSO READ :చిరంజీవికి అస్సలు అచ్చిరాని క్లాస్ సినిమాలు… ఎందుకు ఇలా!

Visitors Are Also Reading