Home » Bigg Boss 7 నుంచి రతిక ఔట్‌.. అయినా గట్టిగా రెమ్యునరేషన్‌.. ఎన్ని లక్షలు అంటే ?

Bigg Boss 7 నుంచి రతిక ఔట్‌.. అయినా గట్టిగా రెమ్యునరేషన్‌.. ఎన్ని లక్షలు అంటే ?

by Bunty

బిగ్ బాస్ సీజన్ 7 ప్రారంభమై నాలుగు వారాలు పూర్తయింది. 14 మందితో ప్రారంభమైన ఈ షోలో ఇప్పటికే నలుగురు ఎలిమినేట్ అయ్యారు. ఇక నాలుగోవారం రతిక ఎలిమినేట్ అయిన సంగతి ప్రతి ఒక్కరికి తెలిసిందే. రతిక ఎలిమినేట్ అవ్వడంతో అందరూ ఒక్కసారిగా షాక్ కు గురయ్యారు. సాధారణంగా రతిక ఇంకా కొన్ని వారాలు ఉంటుందని అందరు భావించారు. కానీ తన ప్రవర్తన వల్లనే ఓట్స్ చాలా తక్కువగా వచ్చాయని అందుకే రతిక ఎలిమినేట్ అయిందని ప్రతి ఒక్కరూ అనుకుంటున్నారు.

Rathika Eliminated From Bigg Boss Telugu 7

Rathika Eliminated From Bigg Boss Telugu 7

ఇక నాగార్జున రతిక ఎలిమినేట్ అని చెప్పగానే తాను ఒక్కసారిగా కన్నీళ్లు పెట్టుకుంది. నేను ఎలిమినేట్ అవ్వడం చాలా షాకింగ్ గా ఉంది. ఇక రతిక బిగ్ బాస్ హౌస్ లో పార్టిసిపేట్ చేస్తున్నందుకు భారీగానే రెమ్యూనరేషన్ తీసుకుంటుంది. ఒక్క రోజుకిగాను 28 వేల రూపాయలను తీసుకుంటుంది. ఒక వారానికి కలిపి రెండు లక్షల రూపాయలను తీసుకుంటుంది. ఇక రతిక రోజ్ బిగ్ బాస్ హౌస్ లోకి ఎంట్రీ ఇచ్చిన కొత్తలోనే ప్రతి ఒక్కరి చూపును తన వైపుకు తిప్పుకునేలా చేసింది.

కానీ తన ప్రవర్తన వల్లనే ఎలిమినేట్ అవ్వాల్సి వచ్చింది. అంతేకాకుండా తన గ్లామర్ తో కూడా చాలామంది ఆడియన్స్ ను తన వైపుకు తిప్పుకుంది. ఇక తాను బిగ్ బాస్ హౌస్ లో చాలామంది అబ్బాయిలతో క్లోజ్ గా మాట్లాడి ప్రేమగా నటించింది. కానీ అదంతా ఆటలో ఒక భాగమేనంటూ చాలా తొందరగా ప్రతి ఒక్కరికి తెలిసిపోయింది. ఇక రతికకి ఓటింగ్ చాలా తక్కువగా రావడంతో ఈ వారం ఎలిమినేట్ అయ్యి బయటకు వచ్చింది.

ఇవి కూడా చదవండి

Visitors Are Also Reading