Telugu News » రోజా ఉంటే సినిమా చెయ్యను : రామ్ చరణ్

రోజా ఉంటే సినిమా చెయ్యను : రామ్ చరణ్

by Bunty

టాలీవుడ్ ఇండస్ట్రీలో మెగా ఫ్యామిలీకి ఉన్న క్రేజ్ అంతా కాదు. మెగాస్టార్ చిరంజీవి ఎంతో కష్టపడి ఇండస్ట్రీలోకి వచ్చారు. మెగాస్టార్ చిరంజీవి సక్సెస్ కావడంతో.. ఆయన కుటుంబంలోని హీరోలు అందరూ ఇప్పుడు ఇండస్ట్రీని ఏళుతున్నారు. ఇందులో మెగాస్టార్ వారసుడు మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ గురించి ఎంత చెప్పినా తక్కువే అవుతుంది.

ram charan comments on roja

ram charan comments on roja

చిరుత సినిమాతో తెలుగు చిత్ర పరిశ్రమలో హీరోగా ఎంట్రీ ఇచ్చిన రామ్ చరణ్… ప్రస్తుతం ఇండస్ట్రీలో స్టార్ హీరోగా కొనసాగుతున్నాడు. ఇటీవల రాంచరణ్ నటించిన ఆర్ఆర్ఆర్ సినిమా బంపర్ విజయాన్ని అందుకున్న సంగతి మనందరికీ తెలిసిందే. అయితే రామ్ చరణ్ గురించి ఓ ఆసక్తికర విషయం ఇప్పుడు వెలుగులోకి వచ్చింది.

రామ్ చరణ్ హీరోగా చేసిన గోవిందుడు అందరివాడే సినిమాలో… జయసుధ పాత్రలో రోజా ను మొదట దర్శకుడు కృష్ణ వంశీ అనుకున్నారట. అంటే రామ్ చరణ్ కు అమ్మమ్మ పాత్రలో రోజాను అనుకున్నారన్నమాట. అయితే ఈ విషయం రామ్ చరణ్ కు తెలియడంతో… దీనికి అంగీకారం తెలుపలేదట. రోజా ఈ సినిమాలో నటిస్తే నేను సినిమా చేయనని రామ్ చరణ్ తేల్చి చెప్పాడట. తనకు అమ్మమ్మ పాత్ర రోజా చేయడం ఇష్టం లేక రామ్ చరణ్ ఇలా చెప్పినట్లు సమాచారం. రామ్ చరణ్ మొండి పట్టు పట్టడంతో చివరికి జయసుధను రంగంలోకి దింపారట కృష్ణవంశీ.

ఇవి కూడా చదవండి

Visitors Are Also Reading