Home » ఆ సినిమాని శ్రీలీల రిజెక్ట్ చేయడం వల్లే.. రష్మిక హిట్ కొట్టేసింది..!

ఆ సినిమాని శ్రీలీల రిజెక్ట్ చేయడం వల్లే.. రష్మిక హిట్ కొట్టేసింది..!

by Sravya
Ad

తెలుగు ఇండస్ట్రీలో ఇప్పుడు శ్రీలీల హవా నడుస్తోంది. శ్రీలీలే టాలీవుడ్ ఇండస్ట్రీలో ఎంగేజ్ బ్యూటీగా పాపులారిటీని విపరీతంగా సంపాదించేస్తోంది. వరుస సినిమాలతో ఫుల్ బిజీగా ఉంటోంది. పైగా తనకి పోటీ ఎవరూ లేనట్లుగా.. తనకి తానె సాటి అన్నట్టుగా ఇప్పుడు ఆఫర్లు వస్తున్నాయి. పైగా డ్యాన్స్ తో నటన తో విపరీతంగా పిచ్చెక్కిచ్చేస్తోంది. పది సినిమాలని ఒప్పేసుకుని ఇంకో ఐదు సినిమాలనే హోల్డ్ లో పెట్టేసుకుని అందరికీ శ్రీలీల షాక్ ఇచ్చేస్తోంది.

Advertisement

అయితే ఈ బ్యూటీ ఒక సినిమాని మిస్ చేసుకుంది. ఆ సినిమా తో రష్మిక బ్లాక్ బస్టర్ హిట్ ని కొట్టేసింది. ఆ సినిమా ఏంటో మరి మీకు తెలుసా… ఈ విషయం నాగశౌర్య బయట పెట్టారు రీసెంట్ గా మీడియా తో నాగ శౌర్య మాట్లాడుతూ ఇన్ డైరెక్ట్ గా ఈ విషయాన్ని చెప్పారు. వెంకీ కుడుముల దర్శకత్వంలో ఛలో సినిమా వచ్చిన విషయం తెలిసిందే.

Sreeleela

Advertisement

ఈ సినిమాకి హీరోయిన్ గా మొదట శ్రీ లీలని అనుకున్నారు కానీ శ్రీలీల మాత్రం ఆ సినిమాని ఒప్పుకోలేదు. ఆమె ఒప్పుకోక పోవడంతో ఆ ఆఫర్ రష్మిక చేతి కి చిక్కింది. ఇలా శ్రీ లీల ఈ మూవీ రిజెక్ట్ చేయడంతోనే రష్మిక ని తీసుకున్నట్లు నాగ శౌర్య చెప్పారు. ఏవో కారణాల వలన ఈ అమ్మడు మంచి హిట్ ని మిస్ చేసుకుంది. ఏది ఏమైనా మంచి టాప్ హీరోయిన్ గా ఇప్పుడు చక్కటి ఆఫర్ల ని పొందుతోంది. ఇలా ఈ కన్నడ బ్యూటీ తెలుగు సినిమాలతో విపరీతమైన పాపులారిటీని పొందుతోంది.

Also read:

బ్రహ్మనందం కోసం మహేష్‌ తీసుకున్న ఈ నిర్ణయం గురించి తెలుసా? దాదాపు 8 సంవత్సరాల తర్వాత?

సినిమాల్లో అవకాశం కోసం ”సిద్దు జొన్నలగడ్డ”.. మొదట్లో ఇన్ని అవమానాలని ఎదుర్కోవాల్సి వచ్చిందని మీకు తెలుసా..?

Balakrishna : ఎహె ఆపు.. లొడ లొడా వాగుతూనే ఉంటావా? సుమక్కపై ఫైర్ అయిన బాలయ్య.. వైరల్ అవుతున్న వీడియో!

Visitors Are Also Reading