Home » సినిమాల్లో అవకాశం కోసం ”సిద్దు జొన్నలగడ్డ”.. మొదట్లో ఇన్ని అవమానాలని ఎదుర్కోవాల్సి వచ్చిందని మీకు తెలుసా..?

సినిమాల్లో అవకాశం కోసం ”సిద్దు జొన్నలగడ్డ”.. మొదట్లో ఇన్ని అవమానాలని ఎదుర్కోవాల్సి వచ్చిందని మీకు తెలుసా..?

by Sravya
Ad

సిద్దు జొన్నలగడ్డ కి ఇప్పుడు ఫ్యాన్ ఫాలోయింగ్ కూడా విపరీతంగా పెరిగింది. డీజే టిల్లు సినిమాతో మంచి స్టార్ హీరోగా గుర్తింపు పొందాడు సిద్దు. ఈ సినిమా తర్వాత నుండి కూడా అవకాశాలు ఎక్కువగా వస్తున్నాయి. ఎప్పుడూ కూడా సిద్ధూ తన మ్యానరిజానికి తగ్గట్టుగా సినిమాలను ఎంపిక చేసుకుంటూ ఉంటాడు. ప్రస్తుతం టిల్లు స్క్వేర్ సినిమాలో నటిస్తున్నాడు. ఈ సినిమా కాకుండా మలయాళ రీమిక్ లో కూడా నటిస్తున్నాడు సిద్ధూ.

Advertisement

సోషల్ మీడియాలో కూడా ఎప్పుడు ట్రెండింగ్ గానే ఉంటాడు సిద్దు. తను నడవడికతో తన మాటలతో అందరినీ బాగా ఆకట్టుకుంటూ ఉంటాడు సిద్ధూ జొన్నలగడ్డ. ఇండస్ట్రీలోకి ఏ బ్యాగ్రౌండ్ లేకుండా రావడం చాలా కష్టం. వచ్చిన తర్వాత నిలబడడం మరింత కష్టం. కానీ ఏ బ్యాగ్రౌండ్ లేకుండా ఇండస్ట్రీలో రాణిస్తున్నాడు. జోష్ సినిమా తో క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా ఇండస్ట్రీకి వచ్చాడు తర్వాత ఆరెంజ్, భీమిలి కబడ్డీ జట్టు వంటి సినిమాల్లో కూడా నటించాడు. గుంటూరు టాకీస్ తో అందరికీ తెలిసాడు. గుంటూరు టాకీస్ సినిమాలో డైలాగ్ రైటర్ గా కూడా వ్యవహరించాడు.

Advertisement

డీజె టిల్లు తో తన దశే మారిపోయింది అయితే ఒక పొజిషన్ లోకి రావాలంటే ప్రతి ఒక్కరు కూడా జీవితంలో ఎన్నో కష్టాలని ఎదుర్కొంటూ ఉంటారు. సిద్దు కూడా అలానే ఎన్నో ఇబ్బందుల్ని ఎదుర్కొన్నాడు. కెరియర్ పరంగా ఎన్నో అవమానాలని ఎదుర్కొన్నాడు. నాలుగేళ్ల క్రితం తన మొఖమంతా మొటిమలు మచ్చలు ఉన్నాయి. గుంతలు కూడా ఉన్నాయి. సినిమా తీసే వారు ఇలాంటి ముఖము ఉంటే హీరో ఎలా అవుతావు అని తన ముఖం ముందే చెప్పేసేవారట. అది తట్టుకోలేక ఒక రోజు ఏడ్చేసాడట. కష్టపడితే సాధ్యం కానిది లేదు అని ప్రూవ్ చేశాడు. ఇలా ఆఖరికి ఇప్పుడు మంచి హీరోగా రాణిస్తున్నాడు.

Also read:

Balakrishna : ఎహె ఆపు.. లొడ లొడా వాగుతూనే ఉంటావా? సుమక్కపై ఫైర్ అయిన బాలయ్య.. వైరల్ అవుతున్న వీడియో!

జయసుధ చెల్లెలు కూతురు హీరోయిన్ అని మీకు తెలుసా..?

Visitors Are Also Reading