Home » బ్రహ్మనందం కోసం మహేష్‌ తీసుకున్న ఈ నిర్ణయం గురించి తెలుసా? దాదాపు 8 సంవత్సరాల తర్వాత?

బ్రహ్మనందం కోసం మహేష్‌ తీసుకున్న ఈ నిర్ణయం గురించి తెలుసా? దాదాపు 8 సంవత్సరాల తర్వాత?

by Srilakshmi Bharathi
Published: Last Updated on
Ad

సాధారణంగా ఒక సినిమాకి హీరో, హీరోయిన్ ఎంత ముఖ్యమో కమెడీయన్ కూడా అంతే ముఖ్యం. టాలీవుడ్ కమెడీయన్స్ లో పేరు ప్రఖ్యాతలు సంపాదించుకున్న వారిలో బ్రహ్మనందం ఒకరు. వందలాది సినిమాల్లో కమెడియన్ గా నటించిన బ్రహ్మనందం గురించి ఎంత చెప్పినా తక్కువే అని చెప్పాలి. ఇలా సినిమాల పరంగా మంచి పేరు ప్రఖ్యాతలు సంపాదించుకున్న బ్రహ్మానందం గతంతో పోలిస్తే ఇటీవల సినిమాలు తగ్గించారని చెప్పచ్చు.

Advertisement

హీరో, డైరెక్టర్ కాంబినేషన్లు హిట్ అయినట్లే.. డైరెక్టర్-కమెడియన్ కాంబోలు కూడా కొన్ని ఉన్నాయి. అలాంటి కాంబినేషనల్లో బ్రహ్మానందం-దర్శకుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ కాంబో మొదట ఉంటుంది. అసలు బ్రహ్మి స్క్రీన్ పై కనిపిస్తేనే మనకి నవ్వు వచ్చేస్తుంది. ఆయన సినిమాలో నటిస్తే హిట్ అయ్యిన సినిమాల లిస్ట్ చాలా పెద్దదే అని చెప్పొచ్చు. ఇప్పటివరకు చాలా త్రివిక్రమ్ సినిమాల్లో బ్రహ్మి నటించారు. అయితే గత కొంతకాలంగా అ ఆ, అరవింద సామెత, అజ్ఞాతవాసి సినిమాల్లో ఎక్కడా బ్రహ్మి కనిపించలేదు.

Advertisement

Mahesh Babu trivikram movie

ఇప్పుడు రాబోయే త్రివిక్రమ్ సినిమాలో బ్రహ్మి నటించే అవకాశం ఉందని తెలుస్తోంది. దీని వెనుక కారణం కూడా మహేష్ బాబేనట. ఈ సినిమాకు సంబంధించిన స్క్రిప్ట్ వర్క్ అంతా పూర్తి చేసి మహేష్ బాబు కు వివరించగా.. ఇందులో కొన్ని మార్పులు చేసి బ్రహ్మానందం ఉండేలా చూడాలని మహేష్ త్రివిక్రమ్ ని కోరారట. అందుకు త్రివిక్రమ్ కూడా సిగ్నల్ ఇచ్చేశారట. ఇక బ్రహ్మి కూడా ఒప్పుకుంటే.. దాదాపు ఎనిమిది సంవత్సరాల తర్వాత బ్రహ్మానందం-దర్శకుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ కాంబో తెరపై సందడి చేస్తుందన్నమాట.

మరిన్ని ముఖ్య వార్తలు:

BRO: బ్రో టీజర్ లో ఇంత మాటర్ ఉందా? ఈ విషయాలను నోటిస్ చేశారా?

సోంపు గింజలు తీసుకోవడం వలన ఎన్ని లాభాలో తెలిస్తే.. రోజూ తింటారు..!

ఇక కృష్ణ పని అయిపోయిందన్న టైంలో.. చిరు, నాగ్ లకి పెద్ద షాక్..!

Visitors Are Also Reading