Home » Balakrishna : ఎహె ఆపు.. లొడ లొడా వాగుతూనే ఉంటావా? సుమక్కపై ఫైర్ అయిన బాలయ్య.. వైరల్ అవుతున్న వీడియో!

Balakrishna : ఎహె ఆపు.. లొడ లొడా వాగుతూనే ఉంటావా? సుమక్కపై ఫైర్ అయిన బాలయ్య.. వైరల్ అవుతున్న వీడియో!

by Srilakshmi Bharathi
Published: Last Updated on
Ad

బాలయ్య బాబుది ఎంత మంచి మనసో మనందరికీ తెలిసిందే. అయితే.. మనసులో ఒకలాగా, బయట ఒకలాగా ఉండరు. ఈ విషయం మనకి చాల ఈవెంట్స్ లో అర్ధం అవుతూనే వచ్చింది. కొన్నిసార్లు ఆయన పబ్లిక్ గా రియాక్ట్ అయ్యే తీరు అందరిని ఆశ్చర్యపడేలా చేస్తుంది. అందుకు సంబంధించిన వీడియోలు కూడా నెట్టింట్లో తెగ వైరల్ అవుతూ ఉంటాయి. తాజాగా, ఇలాంటి ఘటనే ఒకటి చోటు చేసుకుంది. ఈ సారికి కౌంటర్ సుమక్కకి పడిందన్నమాట. ఇంతకీ ఏమి జరిగిందో ఇప్పుడు చూద్దాం.

Advertisement

జగపతి బాబు ప్రధాన పాత్ర పోషిస్తూ రూపొందించబడుతున్న సినిమా `రుద్రంగి`. ఈ సినిమాలో విమలా రామన్, మమతా మోహన్ దాస్ లు కీలక పాత్రలను పోషిస్తోన్నారు ఈ సినిమాకు అజయ్ సామ్రాట్ దర్శకత్వం వహిస్తున్నారు. జూలై 7న ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. ఈ క్రమంలో గురువారం హైదరాబాద్ లో ప్రీ రిలీజ్ ఈవెంట్ జరిగింది. ఈ వేడుకకు సుమక్క యాంకర్ గా చేసారు. బాలకృష్ణ ప్రధాన అతిధిగా హాజరు అయ్యారు.

Advertisement

ఈ సందర్భంగా ఒక్కొక్కరిని ఇంట్రడ్యూస్ చేసిన సుమ జగపతి బాబుని మాట్లాడాలని కోరింది. అయితే.. మైక్ ఇవ్వడానికి ముందు ఆయనను పొగడడం మొదలు పెట్టింది. అయితే.. జగపతి బాబుకు మైక్ ఇవ్వకుండా.. పొగుడుతూనే ఉండడంతో.. కొంత అసహనం ఫీల్ అయిన బాలయ్య “ఎహే ఆపు.. ఒకటే లొడలొడా వాగేస్తున్నావ్‌” అంటూ సరదాగా అన్నారు. దీనితో సుమక్క షాక్ అయితే.. అక్కడ ఉన్న వారంతా నవ్వారు. ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట్లో తెగ వైరల్ అవుతోంది. మీరు కూడా చూసేయండి మరి.

మరిన్ని ముఖ్య వార్తలు:

తెలుగు యాంకర్లను ట్రోల్ చేసిన టాలీవుడ్ కమెడియన్..TV9 దేవిని ఆడేసుకున్నాడుగా ?

Roja : రోజా కొడుకు ఫోటోలు వైరల్‌.. హీరోగా ఎంట్రీ ఇస్తారా?

సచిన్‌ను మోయడమా? ముసలోళ్లం.. మా వల్ల కాదన్నాం: వీరేంద్ర సెహ్వాగ్

Visitors Are Also Reading