నందమూరి బాలకృష్ణ హీరోగా నటించిన మంగమ్మగారి మనమడు 1984లో వచ్చి సూపర్ హిట్ సాధించిన విషయం తెలిసిందే. అయితే ముఖ్యంగా బాలయ్య ఆ సినిమాతోనే మంచి జోష్‌లోకి వచ్చారు. భార్గవ్ ఆర్ట్స్ ప్రొడక్షన్ బ్యానర్‌లో వచ్చిన దాదాపు అన్ని సినిమాలు బ్లాక్ బస్టర్ అండ్ హిట్‌గా నిలిచాయి.
Advertisement
మంగమ్మగారి మనమడు, ముద్దుల కృష్ణయ్య, మువ్వగోపాలుడు, ముద్దుల మామయ్య, ముద్దుల మేనల్లుడు ఇలాంటి చిత్రాలు ఆ రోజుల్లో బాలయ్యబాబును తారా స్థాయికి తీసుకెళ్లాయి.
Also Read : Today rasi phalalu in telugu : ఆ రాశి వారికి ప్రయాణాల్లో జాగ్రత్త అవసరం
పీవీఆర్ ఆర్ట్స్ ప్రొడక్షన్ బ్యానర్‌లో ఎన్‌వీఆర్ నిర్మాణం కోడి రామకృష్ణ దర్శకత్వంలో బాలకృష్ణ సుహాసిని హీరో, హీరోయిన్లుగా బాలగోపాలుడు చిత్రం విడుదలయింది. పల్లెటూరి నేపథ్యంలో వచ్చిన ఈ చిత్రం బాక్సాపీస్ వద్ద మంచి విజయాన్ని సాధించింది. ఈ చిత్రంలో బాలకృష్ణకు ఒక అనాథ అమ్మాయిగా రాశి కనిపిస్తుంది. రాశి 1986లో మమతల కోవెల సినిమా ద్వారా తెలుగు తెరకు పరిచయమయ్యారు. ఆ తరువాత రావుగారి ఇల్లు, అంకురం, ఆదిత్యం 369 లాంటి చిత్రాల్లో బాలనటిగా నటించి ఆ తరువాత తమిళ చిత్రం ప్రియమ్‌లో రాశి హీరోయిన్‌గా కనిపించారు. ఆమె తండ్రి ప్రోద్భలంతో సినిమా రంగంలోకి అడుగు పెట్టారు. తన తండ్రి తరువాత తనకుసంబంధించిన విషయాలను అసిస్టెంట్ డైరెక్టర్ శ్రీనివాస్‌తో చెప్పుకునేది.
Advertisement
Also Read : Glenn Maxwell Marriage: భారతీయ మహిళతో మార్చి 27న మాక్స్‌వెల్ పెళ్లి
ఆయా విషయాలలో మంచిచెడుల గురించి దర్శకుడు శ్రీనివాస్ రాశికి వివరిస్తుండేవాడు. తనను ఎంతో మంది బిజినెస్‌మెన్ పెళ్లి చేసుకుంటానని వచ్చినా కూడా కాదని తన ఫ్యామిలి ఫ్రెండ్ అయిన అసిస్టెంట్ డైరెక్టర్ శ్రీనివాసును ఆమె పెళ్లి చేసున్నారు. 1997లో గుడ్ ఫిలింస్ నిర్మాణంలో భీమనేని శ్రీనివాస్ దర్శకత్వంలో వచ్చిన శుభాకాంక్షలు చిత్రంలో రాశి హీరోయిన్ గా తొలిసారి తెలుగు తెరపై కనిపించారు. ఆ తరువాత గోకులంలో సీత, గిల్లికజ్జాలు, పెళ్లి పందిరి, ప్రేయసిరావే..!నేటి గాందీ, పండుగ ఆ తరువాత తిరిగి 1999లో చంటిఅడ్డాల నిర్మాణంలో ముత్యాల సుబ్బయ్య దర్శకత్వంలో బాలకృష్ణ, మీన, రాశి హీరోయిన్‌గా కృష్ణబాబు చిత్రంలో నటించారు. అయితే రాశి బాలనటిగా బాలగోపాలుడు చిత్రంలో హీరోయిన్‌గా, కృష్ణబాబు చిత్రంలో బాలయ్య బాబుతో నటించారు.
Also Read : 15th feb 2022 Top 10 News : నేటి ముఖ్యమైన వార్తలు..!