Telugu News » Blog » Glenn Maxwell Marriage: భార‌తీయ‌ మ‌హిళ‌తో మార్చి 27న మాక్స్‌వెల్ పెళ్లి

Glenn Maxwell Marriage: భార‌తీయ‌ మ‌హిళ‌తో మార్చి 27న మాక్స్‌వెల్ పెళ్లి

by Anji
Ads

ఆస్ట్రేలియా విధ్వంస‌క‌ర బ్యాట్స్‌మెన్ గ్లెన్ మ్యాక్స్‌వెల్ ఓ ఇంటివాడు కాబోతున్నారు. త‌న చిర‌కాల గ‌ర్ల్‌ఫ్రెండ్ అయిన‌టువంటి భార‌తీయ మ‌హిళ‌, ఎన్ఆర్ఐ విని రామ‌న్ మెడ‌లో భార‌త సాంప్ర‌దాయం ప్ర‌కారం.. మూడు ముళ్లువేసి ఏడు అడుగులు న‌డిచేందుకు సిద్ధం అవుతున్నాడు మ్యాక్స్‌వెల్‌. 2022 మార్చి 27న మెల్‌బోర్న్‌లో మాక్స్‌వెల్‌, వినిరామన్‌లో వివాహం జ‌రుగ‌నుంది. వీరి పెళ్లి పూర్తిగా హిందూ సాంప్ర‌దాయ ప‌ద్ద‌తిలో నిర్వ‌హించ‌నున్నారు.

Advertisement

Also Read :  దైవ ద‌ర్శ‌నానికి ఎదురొచ్చిన పెద్ద‌పులి.. ఆ త‌రువాత ఏమైందంటే..?

Advertisement

ఈ మేర‌కు త‌మిళంలో ప్రింట్ చేయించిన వెడ్డింగ్ కార్డు ప్ర‌స్తుతం సోష‌ల్ మీడియాలో వైర‌ల్ అవుతుంది.గ్లెన్ మాక్స్‌వెల్ భార‌త్‌కు చెందిన విని రామ‌న్ తో ప్రేమ‌లో ప‌డ్డారు. వినిరామ్ త‌ల్లిదండ్రులు చాలా సంవ‌త్స‌రాల క్రిత‌మే ఆస్ట్రేలియాలో సెటిల్ అయ్యారు. విని కూడా అక్క‌డే పుట్టి పెరిగింది. వృత్తి రిత్యా ఆమె ఫార్మసిస్ట్ గా పని చేస్తున్నారు. గ్లెన్ మాక్స్‌వెల్ ఒత్తిడికి లోనైన స‌మ‌యంలో ప‌లుమార్లు అతనికి విని రామన్ అండగా నిలిచారు. అప్పుడే వారిద్ద‌రి మధ్య ప్రేమ చిగురించింది.

 

మాక్స్‌వెల్ ఎన్నారై యువతి విని రామ‌న్‌తో ఎప్పుడో ప్రేమ‌లో పడ్డారు. చాలా కాలంగా వీరు ప్రేమ‌లో మునిగి తేలుతున్నారు. ఈ తరుణంలోనే వీరిద్దరికీ 2020లో ఎంగేజ్మెంట్ కూడా జరిగినది. రెండేళ్ల తర్వాత వీరు పెళ్లి చేసుకోవాలని నిర్ణయించుకున్నారు. తమిళ, వైష్ణవ సాంప్రదాయ పద్ధతిలో వీరి పెళ్లిజ‌రుగ‌నుంది. ఇరు కుటుంబాలు ఇందుకు అంగీకరించాయి. దీంతో 2022 మార్చి 27న మెల్‌బోర్న్‌లో వీరి వివాహం వైభ‌వంగా జ‌రిపించ‌నున్నారు.

Advertisement

Also Read :  Today rasi phalalu in telugu : ఆ రాశి వారికి ప్ర‌యాణాల్లో జాగ్ర‌త్త అవ‌స‌రం

You may also like