Home » 15th feb 2022 Top 10 News : నేటి ముఖ్యమైన వార్తలు..!

15th feb 2022 Top 10 News : నేటి ముఖ్యమైన వార్తలు..!

by AJAY
Ad
INDIA CORONA UPDATE

INDIA CORONA UPDATE

దేశంలో క‌రోనా కేసుల సంఖ్య భారీగా త‌గ్గింది. దేశంలో గ‌డిచిన 24గంట‌ల్లో కేవ‌లం 27409 క‌రోనా కొత్త కేసులు మాత్రమే న‌మోద‌య్యాయి.

Ap cm jagan

Ap cm jagan

ఏపీ స‌ర్కార్ కీల‌క నిర్ణ‌యం తీసుకుంది. రోడ్డు ప్ర‌మాద భాదితుల‌కు న‌గ‌దు ర‌హిత చికిత్సను అందించాల‌ని సీఎం జ‌గ‌న్ నిర్ణ‌యించారు. అంతే కాకుండా రోడ్డు ప‌క్క‌న దాబాల్లో మ‌ద్యం సేవించ‌కుండా క‌ఠిన చ‌ర్య‌లు తీసుకోవాల‌ని నిర్ణ‌యం తీసుకున్నారు.

Advertisement

తెలంగాణ‌ రాష్ట్రంలో ప్రభుత్వ భూముల క్రమబద్ధీకరణకు స‌ర్కార్ మరో అవకాశం క‌ల్పించింది. ఈ నెల 21 నుంచి దరఖాస్తుల స్వీకరణ జ‌రుగుతుండ‌గా… జీవో 58,59లను మరోసారి ప్రభుత్వం పొడిగించింది.

హైద‌ర‌బాద్ లోని ముచ్చింత‌ల్ లో రామానుజ‌చార్య సహ‌స్రాభివృద్ది వేడుకులు ముగిసిపోయాయి. 12 రోజులుగా ఘ‌నంగా వేడుక‌లు జ‌రిగాయి.

Advertisement

క‌రోనా క‌థ ముగిసింద‌ని లాన్సెట్ మెడిక‌ల్ జ‌ర్న‌ల్ అభిప్రాయం వ్య‌క్తం చేసింది. వైద్య‌రంగానికి చెందిన ఈ ప‌త్రిక‌ను ఎక్కువ‌గా విశ్వ‌సిస్తూ ఉంటారు. కాగా ఈ జ‌ర్న‌ల్ సంపాద‌కీయంలో క‌రోనా ఇక‌పై స్వ‌ల్ప అనారోగ్యానికి గురిచేసే వైర‌స్ గా మాత్ర‌మే ఉంటుంద‌ని గుడ్ న్యూస్ చెప్పింది.

సీఎం జ‌గ‌న్ ముఖ్య‌కార్య‌ద‌ర్శి ప్ర‌వీణ్ ప్ర‌కాష్ బ‌దిలీ అయ్యారు. ఢిల్లీలోని ఏపీ భ‌వ‌న్ ప్రిన్సిప‌ల్ రెసిడెంట్ క‌మిష‌న‌ర్ గా ఆయ‌న నియామ‌కం అయ్యారు.

ఉత్త‌రాఖండ్,యూపీ,గోవాలో పోలింగ్ ముగిసింది. గోవాలో 78.31 శాతం, యూపీలో 61.33 శాతం, ఉత్తరాఖండ్‌లో 59.51 శాతం పోలింగ్‌ నమోదయ్యింది.

క‌రోనా కార‌ణంగా హైద‌రాబాద్ లోని నాంప‌ల్లి ఎగ్జిబిష‌న్ ను నిలిపివేసిన సంగ‌తి తెలిసిందే. అయితే ప్ర‌స్తుతం కేసులు త‌గ్గ‌ముఖం ప‌డుతున్న నేప‌థ్యంలో ఈ నెల 25 నుండి తిరిగి ఎగ్జిబిష‌న్ ను ప్రారంభిస్తున్నారు.

రాజస్థాన్ లో దారుణం చోటు చేసుకుంది. 16 మంది మాన‌వ మృగాళ్లు మైన‌ర్ బాలిక‌పై అత్యాచారం చేశారు.

కోల్ కతా నలినీ సెత్ రోడ్డులోని ఓ కార్యాలయం పై కస్టమ్స్ అధికారులు దాడులు చేశారు. 51 లక్షల విలువ చేసే 1040 గ్రాముల బంగారంను అధికారులు సీజ్ చేశారు. బంగ్లాదేశ్ నుంచి బంగారాన్ని అక్రమంగా తరలిస్తున్నట్టు అనుమానం వ్య‌క్తం చేస్తున్నారు.

Visitors Are Also Reading