Home » మొన్న కూతురు.. ఆ త‌రువాత తండ్రి మ‌ర‌ణం.. అయినా జ‌ట్టు వెంటే ఆ క్రికెట‌ర్‌..!

మొన్న కూతురు.. ఆ త‌రువాత తండ్రి మ‌ర‌ణం.. అయినా జ‌ట్టు వెంటే ఆ క్రికెట‌ర్‌..!

by Anji
Ad

ఓ వైపు క‌న్న కూతురు మ‌ర‌ణ‌.. మ‌రొక వైపు క‌న్న తండ్రి మ‌ర‌ణించ‌డంతో షాక్‌కు గుర‌య్యాడు క్రికెట‌ర్ విష్ణు సోలంకి. కానీ బ‌రోడా రంజీ జ‌ట్టులో కొన‌సాగాల‌ని, గ్రూపు ద‌శ‌లో మూడ‌వ మ్యాచ్ ఆడాల‌ని నిర్ణ‌యించుకున్నాడు. త‌న న‌వ‌జాత కుమార్తెను కోల్పోయిన కొద్ది రోజుల‌కే అనారోగ్యంతో అత‌ని తండ్రి కూడా మ‌ర‌ణించాడు. దీంతో ఈ బ‌రోడా ప్లేయ‌ర్‌కు గ‌త కొద్ది వారాలు క‌ఠినంగా ఉండ‌నున్నాయి. బ‌రోడా జ‌ట్టు రంజీ ట్రోఫీలో మార్చి 03 నుండి ఎలైట్ గ్రూపు బీ త‌మ చివ‌రి మ్యాచ్‌లో హైద‌రాబాద్‌తో త‌ల‌ప‌డుతుంది. ఈ 29 ఏళ్ల క్రికెట‌ర్ ఫిబ్ర‌వ‌రి 10న తండ్రి అయ్యాడు. 10న తండ్రి అయ్యాడు. అయితే అత‌ని కుమార్తె మ‌రుస‌టి రోజే మ‌ర‌ణించింది.

Also Read :  గ‌వ‌ర్న‌ర్ బిశ్వ‌భూషణ్‌తో సీఎం వైఎస్ జ‌గ‌న్ భేటీ..ఎందుకంటే..?

Advertisement

ఈ షాక్ నుంచి తిరిగి వ‌చ్చిన అత‌ను చండీగ‌ఢ్ పై 104 ప‌రుగుల ఇన్నింగ్స్ ఆడాడు. ఈ మ్యాచ్ చివ‌రి రోజునే అత‌నికి త‌న తండ్రి మ‌ర‌ణించాడ‌నే వార్త అందింది బ‌రోడా క్రికెట్ అసోసియేష‌న‌ఖ్ కార్య‌ద‌ర్శి అజిత్ లేలే పీటీఐతో మాట్లాడారు. విష్ణు చివ‌రి మ్యాచ్ ఆడ‌తాడు. మూడో మ్యాచ్ ఆడుతున్నాడు. టీమ్ తోనే ఉంటున్నాడు అని తెలిపాడు. బరోడా క్రికెట్ అసోసియేష‌న్ కు చెందిన మ‌రొక అధికారి మాట్లాడుతూ.. త‌న కూతురు చ‌నిపోవ‌డంతో మొద‌టి మ్యాచ్‌లో ఆడ‌లేక ఇంటికి వెళ్లాడు. ఎందుకంటే అత‌న మూడు రోజుల క్వారంటైన్ లో ఉండాల్సి వ‌చ్చింది. అయితే ఇప్పుడు మాత్రం జ‌ట్టులోనే ఉంటాడ‌ని తెలిపారు.

Advertisement

ముఖ్యంగా బ‌రోడా క్రికెట్ అసోసియేష‌న్ అత‌న్ని ఇంటికి వెళ్ల‌మ‌ని కోరింది. కానీ విష్ణు మాత్రం నిరాక‌రించాడు. చండీగ‌ఢ్‌తో జ‌రిగి మ్యాచ్‌లో విష్ణు ఫీల్డింగ్ చేస్తున్న‌ప్పుడు అత‌ని తండ్రి మ‌ర‌ణ‌వార్త వ‌చ్చింది. స‌మాచారం ఇవ్వ‌డానికి బ‌రోడా జ‌ట్టు మేనేజ‌ర్ అత‌న్న మైదానం నుంచి డ్రెస్సింగ్ రూమ్‌కు పిలిచారు. విష్ణు తండ్రి రెండు నెల‌లుగా అనారోగ్యంతో ఆసుప‌త్రిలో చేరాడు. తండ్రి మ‌ర‌ణ వార్త విన్న త‌రువాత మృత‌దేహాన్ని మార్చురీలో ఉంచ‌లేము అని అందుకే విష్ణు టీమ్‌తోనే క‌లిసి ఉండాల‌ని నిర్ణ‌యించుకున్నాడు. వీడియో కాల్‌లో తండ్రి అంత్య‌క్రియ‌ల‌ను విష్ణు సోలంకి వీక్షించాడు. ఇప్ప‌టివ‌ర‌కు 25 ఫ‌స్ట్ క్లాస్ మ్యాచ్‌లు ఆడి 41.97 స‌గ‌టుతో స‌గ‌టుతో 1679 ప‌రుగులు చేశాడు. అత‌ని పేరు మీద ఆరు సెంచ‌రీలున్నాయి. అత‌ను 39 లిస్ట్ ఏ మ్యాచ్‌ల‌లో 33.96 స‌గ‌టుతో 1019 ప‌రుగులు చేసాడు.

Also Read :  అణ్వ‌స్త్రాల‌ను ర‌ష్యా మోహ‌రించిందా..? పుతిన్ ప్ర‌క‌ట‌న ఆ దేశాల‌కోస‌మేనా..?

Visitors Are Also Reading