Rangamarthanda Movie Review in Telugu: మానవ సంబంధాలు, అనుబంధాలు, తెలుగదనం ఉట్టి పడే విధంగా కథలను కృష్ణవంశీ ప్రేక్షకులు ముందుకు తీసుకొస్తారు. ప్రతీ చిత్రంలోనూ ప్రేక్షకులకు ఏదో ఒక సందేశం ఇవ్వడానికి ప్రయత్నిస్తుంటాడు. కృష్ణవంశీ నుంచి ఆయన స్థాయికి తగ్గ సినిమా రావడం లేదని అభిమానులు అసంతృప్తితో ఉన్నారు. అలాంటి తరుణంలో మరాఠీ సినిమా నటసామ్రాట్ తెలుగులో రీమేక్ చేశారు. బ్రహ్మనందం, ప్రకాశ్ రాజ్, రమ్యకృష్ణ, ప్రధాన పాత్రలలో నటించారు. ఉగాది సందర్భంగా ఈనెల 22న థియేటర్లలోకి వచ్చింది. విడుదలకు ముందే ప్రీమియర్లు వేశారు. ఈ చిత్రం చూసిన వారందరూ అద్భుతంగా ఉందని చెబుతున్నారు. కొందరూ కన్నీళ్లు పెట్టుకుంటారు. అసలు రంగమార్తాండ చిత్రం ఎలా ఉందో ఇప్పుడు మనం తెలుసుకుందాం.
Rangamarthanda Movie Cast, Crew, Story
Advertisement
నటీనటులు : ప్రకాష్ రాజ్, బ్రహ్మానందం, రమ్యకృష్ణ, అనసూయ, ఆదర్శ్ బాలకృష్ణ, శివాత్మికా రాజశేఖర్, రాహుల్ సిప్లిగంజ్, అలీ రెజా, సత్యానంద్ తదితరులు
మాటలు : ఆకెళ్ళ శ్రీనివాస్
ఛాయాగ్రహణం : రాజ్ కె. నల్లి
సంగీతం : ఇళయరాజా
నిర్మాతలు : ఎస్. వెంకట్ రెడ్డి, కాలిపు మధు
దర్శకత్వం : కృష్ణవంశీ
విడుదల తేదీ : మార్చి 22, 2023
కథ :
రంగస్థల కళాకారుడు రాఘవరావు (ప్రకాశ్ రాజ్) ప్రతిభ మెచ్చి ‘రంగమర్తాండ’ బిరుదు ప్రదానం చేస్తారు. ఆ సత్కార సభలో తన రిటైర్మెంట్ కూడా ప్రకటిస్తారు. తాను ఎంతో ఇష్టపడి కట్టుకున్న ఇంటిని కోడలు గీతా రంగారావు (అనసూయ) పేరు మీద రాసిస్తారు. అమ్మాయి శ్రీ (శివాత్మికా రాజశేఖర్)కు ఫిక్స్డ్ డిపాజిట్లు ఇవ్వడమే కాదు, ప్రేమించిన అబ్బాయి రాహుల్ (రాహుల్ సిప్లిగంజ్)కు ఇచ్చి పెళ్లి చేస్తారు. జీవితాన్ని సంతోషంగా గడుపుదామని అనుకుంటాడు. అందుకు భిన్నంగా జరుగుతుంది. మామగారు చేసే పనులు కోడలికి నచ్చవు. దీంతో శ్రీమతి రాజుగారు (రమ్యకృష్ణ) కోరిక మేరకు ఊరు వెళ్లాలని రాఘవరావు రెడీ అవుతాడు. అయితే ఆ విషయం తెలిసి తల్లిదండ్రులను తన ఇంటికి తీసుకెళ్తుంది కుమార్తె శ్రీ. ఇక ఆ తర్వాత ఏమైంది? ఆ అమ్మాయి ఇంట్లో ఏం జరిగింది? రాఘవరావు జీవితంలో ప్రాణ స్నేహితుడు చక్రి అలియాస్ చక్రవర్తి (బ్రహ్మానందం) పాత్ర ఏంటి? అసలు ఆయన ఏం చేశారు? అనేది తెలియాలంటే మాత్రం ఈ చిత్రాన్ని వెండితెరపై చూడాల్సిందే.
Advertisement
Also Read : సినిమా పోస్టరా షాపింగ్ మాల్ యాడ్ ఆ…మెగాస్టార్ శర్వణన్ ను మించిపోయాడుగా..!
విశ్లేషణ :
మరాఠీలో క్లాసిక్ అనిపించుకున్నటువంటి నట సామ్రాట్ చిత్రానికి తెలుగు రీమేక్ రంగమార్తాండ. ఈ కథను ముట్టుకోవడం పెద్ద సాహసమనే చెప్పాలి. ఈ చిత్రంలో కథ, కథనం కంటే నటన చాలా బాగుంటుంది. నట సామ్రాట్ చిత్రాన్ని రీమేక్ చేసి 100 శాతం విజయం సాధించాడు దర్శకుడు కృష్ణవంశీ. నటసామ్రాట్ సోల్ మిస్ అవ్వకుండా తెలుగు ప్రేక్షకులకు తగినట్టుగా మార్పులు చేసి అందరినీ మెప్పించాడు. తెలుగు నాటకాలు.. పద్యాలతో ప్రతి సన్నివేశాన్ని చాలా భావోద్వేకంగా రాసుకున్నాడు. కథ ప్రారంభం కాస్త నెమ్మదిగా అనిపించినా.. రాఘవరావు రంగస్థలం నాటకాలకు రిటైర్ మెంట్ ప్రకటించి జీవితం అనే నాటకంలోకి ఎంట్రీ ఇచ్చినప్పటి నుంచి ప్రతీ సీన్ చాలా ఎమోషనల్ గా, ఆసక్తికరంగా సాగుతుంది. ఇంటర్వెల్ ముందు వచ్చే సన్నివేశం కంటతడి పెట్టిస్తుంది. భార్యను ప్రేమగా రాజుగారు అని పిలుస్తూ సేవలు చేసే సీన్లు ఆకట్టుకుంటాయి.
ఆనందం, రెండు విషాదాల మధ్య విరామం అంటూ ఇంటర్వెట్ బోర్డు పడడంతో ప్రేక్షకులు బరువెక్కిన హృదయాలతో సీట్ల నుంచి లేస్తారు. సెకండాఫ్ లో వచ్చే ప్రతి సన్నివేశం కూడా అద్బుతంగా ఉంటుంది. కూతురు దగ్గరకు వెళ్లిన రాఘవరావు దంపతులకు ఎదురైన అవమానాలు.. స్నేహితుడు చక్రి జీవితంలో చోటు చేసుకున్న విషాదాలతో సెకండాఫ్ మొత్తం చాలా ఎమోషన్ గా సాగుతుంది. ఆసుపత్రిలో ఉన్న చక్రి ముక్తిని ఇవ్వరా అంటూ స్నేహితుడిని వేడుకోవడం.. మన ఇంటికి మనం వెళ్లిపోదామయ్యా అంటూ రాఘవరావు భార్య అడగడం ఇవన్ని గుండెను బరువెక్కిస్తాయి. క్లైమాక్స్ సీన్ చూసి భారమైన మనసుతో, బరువెక్కిన గుండెతో ప్రేక్షకుడు బయటికి వస్తాడు. భార్య, భర్తల అనుబంధం, స్నేహబంధాన్ని తెరపై ఆవిష్కరించిన తీరు చాలా అద్భుతంగా ఉంది.
ఎవరెలా చేశారంటే..?
ప్రకాశ్ రాజ్ అద్భుతమైన నటన కనబరిచారు. ఈ చిత్రానికి బ్రహ్మానందం ఓ సర్ ప్రైజింగ్ ఫ్యాకేజ్ అనే చెప్పాలి. ప్రధానంగా ఆసుపత్రి సీన్ లో ప్రకాశ్ రాజ్ ని డామినేట్ చేశాడు బ్రహ్మానందం. రమ్యకృష్ణ నటన కూడా చాలా అద్భుతమనే చెప్పాలి. శివాత్మిక రాజశేఖర్, రాహుల్ సిప్లిగంజ్, అనసూయ, ఆదర్శ్ తదితరులు పాత్ర పరిధి మేరకు నటించారు. ఈ చిత్రానికి మరో ప్రధాన బలం ఇళయరాజా సంగీతం. అద్భుతమైన సంగీతం అందించాడు ఇళయరాజా. ప్రతీ ఒక్కరూ చూడాల్సిన సినిమా రంగమార్తాండ.
Also Read : మెగాస్టార్ బోళా శంకర్ రిలీజ్ ఎప్పుడో తెలుసా ?