Home » Bhola Shankar: చిరంజీవి ‘భోళా శంకర్’ పోస్టర్ చూడగనే మీకు అదే డౌట్ వచ్చిందా ? ఇది కూడా కాపీ చేసారా ?

Bhola Shankar: చిరంజీవి ‘భోళా శంకర్’ పోస్టర్ చూడగనే మీకు అదే డౌట్ వచ్చిందా ? ఇది కూడా కాపీ చేసారా ?

by AJAY
Ad

Bhola Shankar: మెగాస్టార్ చిరంజీవి రీఎంట్రీ త‌ర‌వాత వ‌రుస సినిమాలతో ఫుల్ బిజీగా ఉంటున్నాడు. అయితే చిరు సినిమా అంటే ఒక‌ప్పుడు క్రేజ్ మామూలుగా ఉండేది కాదు. కానీ చిరు గ్యాప్ తీసుకోవ‌డం వ‌ల్ల ఆయ‌న సినిమాల‌కు కూడా క్రేజ్ త‌గ్గిపోయింద‌నే చెప్పాలి. అంతే కాకుండా రీ ఎంట్రీ త‌ర‌వాత ఆయ‌న స్థాయికి త‌గిన హిట్ కూడా ప‌డలేదు. ఇక రీసెంట్ గా వ‌చ్చిన వాల్తేరు వీర‌య్య సినిమాతోనే ఆయ‌న ట్రాక్ పైకి వ‌చ్చారు.

Advertisement

 

ఇదిలా ఉంటే చిరంజీవి రాబోయే సినిమా భోళాశంక‌ర్. ఈ సినిమాకు మెహ‌ర్ ర‌మేష్ ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తున్నారు. అయితే మెహ‌ర్ దర్శ‌క‌త్వం అన‌గానే ఫ్యాన్స్ భ‌య‌ప‌డిపోతున్నారు. దానికి కార‌ణం ఆయ‌న కెరీర్ లో భారీ డిజాస్ట‌ర్ లు ఉండ‌ట‌మే. ఇక డిజాస్ట‌ర్ లు ఉన్న‌ప్ప‌టికీ చిరంజీవి పిలిచి మ‌రీ అవ‌కాశం ఇచ్చాడు.

Advertisement

ప్ర‌స్తుతం ఈ సినిమా కూడా ఎండింగ్ ద‌శ‌కు చేరుకుంది. అంతే కాకుండా తాజాగా ఈ సినిమా నుండి పోస్ట‌ర్ ను విడుద‌ల చేశారు. పోస్ట‌ర్ లో చిరుప‌క్క‌న కీర్తిసురేష్ మ‌రియు త‌మ‌న్నాలు క‌నిపిస్తున్నారు. ఇక మ‌ధ్య‌లో చిరంజీవి క‌నిపిస్తున్నారు. కాగా ఈ పోస్టర్ పై నెట్టింట ట్రోల్స్ వ‌స్తున్నాయి. అయ్యో ఇది సినిమా పోస్ట‌రా….బ‌ట్ట‌ల షాప్ యాడ్ అనుకున్నామే అంటూ నెటిజ‌న్ లు ట్రోల్ చేస్తున్నారు.

అంతే కాకుండా మ‌రికొంద‌రు అయితే అచ్చం శ‌ర‌వ‌న‌న్ షాపింగ్ మాల్ పోస్టర్ లా ఉందంటూ కామెంట్స్ పెడుతున్నారు. అంతే కాకుండా శ‌ర‌వ‌ణ‌న్ షాపింగ్ మాల్స్ పోస్ట‌ర్ ల‌ను భోళా శంక‌ర్ సినిమా పోస్ట‌ర్ ల ప‌క్క‌న ఎడిట్ చేసి ట్రోల్స్ చేస్తున్నారు. అయితే ఈ ట్రోల్స్ కు మెహ‌ర్ ర‌మేష్ ఏ విధంగా రిప్లై ఇస్తారో చూడాలంటే సినిమా విడుద‌ల‌య్యే వ‌రకూ వెయిట్ చేయాల్సిందే.

Visitors Are Also Reading