Home » Rana Naidu : ‘రానా నాయుడు’ తెలుగు రివ్యూ… దుమ్ము లేపిన రానా, వెంకీ

Rana Naidu : ‘రానా నాయుడు’ తెలుగు రివ్యూ… దుమ్ము లేపిన రానా, వెంకీ

by Bunty
Ad

Rana Naidu Web Series Review : మల్టీస్టారర్ సినిమా అనగానే ముందుగా గుర్తొచ్చే హీరో వెంకటేష్. తోటి హీరోతో స్థిర పంచుకోవడానికి ఎప్పుడూ ముందుండే ఈ సీనియర్ హీరో ఇప్పుడు దగ్గుబాటి రానాతో జత కట్టారు. రానా నాయుడు రూపంలో సరికొత్త అడుగు వేశారు. బాబాయి అబ్బాయిలైనా వెంకటేష్, రానాలు తొలిసారి ఓ వెబ్ సిరీస్ లో కలిసి పూర్తిస్థాయిలో నటించారు. నేటి నుంచి ఈ సినిమా ప్రముఖ ఓటీటీ వేదిక నెట్ ఫ్లిక్స్ లో ప్రసారం అవుతోంది.

Rana Naidu Web Series Review

READ ALSO : పారాసిటమాల్ వాడుతున్నారా? వీటి వల్ల గుండెపోటు వస్తుందా!

Advertisement

Rana Naidu Web Series Review

Rana Naidu Web Series Review

Rana Naidu Webseries కథ మరియు వివరణ

రానా నాయుడు (రానా) బాలీవుడ్ లో వచ్చే ఎలాంటి స్కాండిల్ ని అయినా చాలా ఈజీగా ఫిక్స్ చేస్తుంటాడు. సెలబ్రిటీలు అతనికి పెద్ద పెద్ద ఎమౌంట్స్ ఇచ్చి పోషిస్తుంటారు. అతని క్లైయింట్స్ ని సేవ్ చేయడానికి ఎంత దూరమైనా వెళ్తాడు. ఎలాంటి పనికైనా ఒడిగడతాడు. అయితే ఎంత పెద్ద సమస్యను అయినా చిటికెలో పరిష్కరించగలిగే అతనికి తన తండ్రి నాగ నాయుడు (వెంకటేష్) పెద్ద సమస్యగా మారతాడు. హైదరాబాద్ చంచల్ గుడా జైలు నుంచి ఐదేళ్లు ముందే బయటకు వచ్చి ముంబైలో వెలిగిపోతున్న తన కొడుకు రానా దగ్గరకు వస్తాడు. అయితే ఇక్కడ ట్విస్ట్ ఏమిటంటే నాగ ను జైలుకు పంపింది అతని కొడుకే. గతంలో ఒక అమ్మాయిని హ** చేసినట్లు తండ్రిపై తప్పుడు కేసు పెట్టి ఇరికించి జైలుకు పంపుతాడు.

Advertisement

READ ALSO : Naveen Case: దొరికే ఛాన్స్ లేదని అనుకున్నాం… నిహారిక సంచలన వ్యాఖ్యలు!

వాస్తవానికి ఇది బాలీవుడ్ స్టార్ ప్రిన్స్ (అనూజ్ కురానా) యాక్సిడెంట్ గా చేసిన హ** . ఈ విషయం తెలిసిన నాగ తన కొడుకుని ఎలా డీల్ చేస్తాడు. అసలు రానాకు తన తండ్రిని జైలుకు పంపాల్సిన అవసరం ఏమొచ్చింది.తన ఫ్యామిలీ విషయంలో చాలా ప్రేమగా ఉండే రానా తన తండ్రి విషయంలో ఎందుకు అంత కఠినంగా వ్యవహరించాడు వంటి విషయాలు తెలియాలంటే సిరీస్ చూడాల్సిందే. రానా నాయుడు వెబ్ సిరీస్ 2013 లో వచ్చిన అమెరికన్ టెలివిజన్ సిరీస్ Ray Donovan కు రీమేక్ గా వచ్చింది. స్కండీల్స్, సెకండ్ థాట్ లేకుండా పేలే గన్స్ తో, కుప్పల తెప్పలుగా ఉండే డబ్బు చుట్టూ ఈ సిరీస్ అనర్గళంగా సాగుతుంది. దాన్నే ఇండియన్ వెర్షన్ గా మార్చి చేశారు. న్యూయార్క్ కాస్త ఇక్కడ ముంబైగా రూపొందింది.

ప్లస్ పాయింట్స్:

రానా
వెంకటేష్ పెర్ఫార్మేన్స్
కొత్తగా అనిపించే ప్లాట్

మైనస్ పాయింట్స్:

స్లో నరేషన్
చాలా చోట్ల వినిపించే బూతులు
రెగ్యులర్ వ్యూయర్స్ కు డైజెస్ట్ కాని కథ

రేటింగ్-2.75/5

READ ALSO :  ఈ 3 లక్షణాలు మీలో ఉన్నాయా… అయితే గుండెపోటు వచ్చే ప్రమాదం పక్కా!

Visitors Are Also Reading