Home » రమ్యకృష్ణ రెమ్యూనరేషన్ హీరోయిన్ కు తక్కువేం కాదు.. తెలుసా..?

రమ్యకృష్ణ రెమ్యూనరేషన్ హీరోయిన్ కు తక్కువేం కాదు.. తెలుసా..?

by Azhar
Ad
రమ్యకృష్ణ.. ప్రస్తుతం ఈ పేరు తెలియని వారు ఎవరు ఉండరు. దేశవ్యాప్తంగా రమ్యకృష్ణకు ఆ క్రేజ్ అనేది తీసుకొని వచ్చింది బాహుబలి సినిమా. ఆమె మొదట్లో హీరోయిన్ గా నటించిన దానికంటే బాహుబలి సినిమాతో బాగా పేరు తెచ్చుకుంది. అయితే రమ్యకృష్ణ.. సినిమా ఇండస్ట్రీలో తన కెరియర్ ను హీరోయిన్ మొదలు పెటింది. అప్పుడు చిరంజీవి, నాగార్జున, వెంకటేష్, బాలకృష్ణ ఇలా అందరూ టాప్ హీరోలతో నటించింది. కేవలం హీరోయిన్ గానే కాకుండా లేడి ఓరియెంటెడ్ సినిమాలో కూడా నటించింది. అలాగే దేవత పాత్రలో కూడా మెప్పించింది.
అలా తన మొదటి కెరియర్ ను సూపర్ హిట్ గా కొనసాగించిన రమ్యకృష్ణ… ఆ తర్వాత డైరెక్టర్ కృష్ణ వంశీని పెళ్లి చేసుకుంది. ఇప్పుడు వీరికి ఒక్క కొడుకు ఉన్నాడు. అయితే హీరోయిన్ గా తన అవకాశాలు అనేవి ముగిసిన తర్వాత కొంత గ్యాప్ ఇచ్చి.. ఇప్పుడు సెకండ్ ఇన్నింగ్స్ అనేది నడిపిస్తుంది రమ్యకృష్ణ. తల్లిగా, అత్తగా ఇంకా వేరే పాత్రలో నటిస్తుంది. ఇక ఈ మధ్యే రమ్యకృష్ణ నటించిన బంగార్రాజు అనే సినిమా విడుదల అయ్యి మంచి విజయం అందుకుంది. అలాగే ఇంకా చాలా సినిమాలో కూడా రమ్యకృష్ణ  నటిస్తుంది.
అయితే సెకండ్ ఇన్నింగ్స్ లో రమ్యకృష్ణకు బాహుబలి సినిమా చాలా పెద్ద హిట్ ఇవ్వడంతో అవకాశాలు బాగా వస్తున్నాయి. ఆ క్రమంలో రెమ్యునరేషన్ అనేది రమ్యకృష్ణ  భారీగా తీసుకుంటున్నట్లు తెలుస్తుంది. మాములుగా ఇప్పుడు రమ్యకృష్ణ ఒక్క రోజుకు 10 లక్షల చొప్పున రెమ్యునరేషన్ అనేది డిమాండ్ చేస్తున్నట్లు తెలుస్తుంది. దాంతో అది ఒక్క హీరోయిన్ రెమ్యునరేషన్ కు తక్కువేం కాదు జనాలు. మాములుగా హీరోయిన్స్ కు ఒక్క సినిమాకు 1 నుండి 2 కోట్లు అందుతాయి. ఇక అదే సినిమాలో రమ్యకృష్ణ 20 రోజులు షూటింగ్ లో పాల్గొంటే ఆమెకు కూడా ఆంతే వస్తుంది. ఇప్పుడు ఈ విషయమే సోషల్ మీడియాలో తెగ చెక్కర్లు కొడుతుంది.

Advertisement

Visitors Are Also Reading