ప్రస్తుతం ఇండియా వ్యాప్తంగా ఎక్కడ చూసినా ఆర్ఆర్ఆర్ సినిమా గురించే మాట్లాడుకుంటున్నారు. దానికి కారణం ఈ సినిమాకు ఆస్కార్ రావడమే. ఈ సినిమాలోని నాటు నాటు పాటకు ఒరిజిల్ సాంగ్ క్యాటగిరిలో ఆస్కార్ అవార్డు వరించింది. ఇక ఈ అవార్డు తీసుకోవడానికి ఆర్ఆర్ఆర్ టీమ్ మొత్తం అవార్డుల ఫంక్షన్ కు అమెరికాకు వెళ్లిన సంగతి తెలిసిందే.
Advertisement
ALSO READ : Samantha : రహస్యంగా రెండో పెళ్లి చేసుకున్న సమంత… ఫోటోలు వైరల్!
అవార్డుల ఫంక్షన్ లో సినిమా దర్శకుడు రాజమౌళి మరియు సంగీత దర్శకుడు కీరవాణి మరియు రచయిత చంద్రబోస్ తో పాటూ ఎన్టీఆర్ మరియు రామ్ చరణ్ సహా మరికొందరు మెరిసారు. ఇక అవార్డు అందుకునే ముందు ఆర్ఆర్ఆర్ పాటను వేశారు.
Advertisement
ఆ తరవాత అవార్డు అందుకునేందుకు ఆహ్వానించగా చంద్రబోస్ మరియు కీరవాణి స్టేజి పైకి వెళ్లి అవార్డును అంకున్నారు. ఈ అవార్డుల ఫంక్షన్ ను తెలుగు వారితో పాటూ దేశవ్యాప్తంగా సినిమా ప్రియులు మరియు ఇతర దేశాలకు చెందినవారు సైతం టీవీలో వీక్షించారు. ఇక టీవీలో చూస్తున్న ప్రేక్షకుల ఆనందానికే అవదులు లేకుండా పోయాయి.
అలాంటిది అక్కడే ఉండి పాటలో స్టెప్పులు వేసిన రామ్ చరణ్ ఎన్టీఆర్ ల రియాక్షన్ ఎలా ఉంటుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఆర్ఆర్ఆర్ కు అవార్డును అనౌన్స్ చేసిన వెంటనే రామ్ చరణ్ ఎన్టీఆర్ ల ముఖాలు ఆనందంతో వెలిగిపోయాయి. అంతే కాకుండా ఇద్దరూ పైకి లేచి నిలబడి హగ్ చేసుకున్నారు. అలా ఇద్దరు హీరోలు హగ్ చేసుకోవడంతో ఫ్యాన్స్ ఆనందానికి కూడా అవదులు లేకుండా పోయాయి.
Advertisement
ALSO READ : రంగస్థలం సినిమాలో చిట్టిబాబుకు ఆయన పేరు ఎలా తెలిసిందంటే ?