Telugu News » Blog » Samantha : రహస్యంగా రెండో పెళ్లి చేసుకున్న సమంత… ఫోటోలు వైరల్!

Samantha : రహస్యంగా రెండో పెళ్లి చేసుకున్న సమంత… ఫోటోలు వైరల్!

by Bunty
Published: Last Updated on
Ads

కొన్నాళ్లుగా సమంత వ్యక్తిగతంగా కఠిన సవాళ్లు ఎదుర్కొంటున్న విషయం తెలిసిందే. కానీ, తనకి ఎదురైన ప్రతి సమస్యను అంతే దీటుగా ఎదుర్కొంటూ అందరికీ స్ఫూర్తిగా నిలుస్తోంది సామ్. అయితే ఈ ప్రయాణంలో ఆధ్యాత్మికత చింతన ద్వారా ఆమె మానసిక దృఢత్వాన్ని ప్రశాంతతను పొందుతున్నట్లు సోషల్ మీడియాలో తన పోస్టులను బట్టి అర్థం అవుతుంది.

Advertisement

READ ALSO : కూతురిని హెలికాప్టర్ లో అత్తారింటికి సాగనంపిన తండ్రి..వీడియో వైరల్ !

కాగా సమంత రహస్యంగా రెండో పెళ్లి చేసుకుందని ఇప్పుడు వార్తలు వస్తున్నాయి. అసలు విషయానికి వస్తే సమంత మెడలో తాళిబొట్టు మరియు నల్లపూసల దండ లేటెస్ట్ ఫోటోలలో ఉండడం చూసి ఒక్కసారిగా అందరూ షాక్ కి గురయ్యారు. దీంతో రహస్యంగా రెండవ పెళ్లి చేసుకుందని అంటున్నారు. కాగా రీసెంట్ గానే విజయ్ దేవరకొండ హీరోగా నటిస్తున్న ‘ఖుషి’ మూవీ షూటింగ్ సెట్స్ లోకి అడుగు పెట్టింది సమంత.

Advertisement

READ ALSO : Shakib Al Hasan : అభిమానిని దారుణంగా కొట్టిన బంగ్లాదేశ్‌ క్రికెటర్‌ షకీబ్‌ అల్‌ హసన్‌

ఈ సందర్భంగా ఆమెకు సంబంధించిన కొన్ని ఫోటోలు షూటింగ్ సెట్స్ నుండి లీక్ అయ్యాయి? ప్రస్తుతం సమంత మరియు విజయ్ దేవరకొండ మీద పెళ్లి సన్నివేశాలను తెరకెక్కిస్తున్నారు. అందుచేతనే ఆమె మెడలో పసుపు తాడుతో కూడిన తాళిబొట్టుని ధరించిందే తప్ప నిజంగా పెళ్లి చేసుకోలేదు అంటూ క్లారిటీ ఇచ్చారు సమంత సన్నిహిత వర్గాలు. ఈ సినిమాతో పాటుగా ఆమె పలు వెబ్ సిరీస్ లలో కూడా నటిస్తోంది. అమెజాన్ ప్రైమ్ సంస్థ తెరకెక్కిస్తున్న ‘సిటాడెల్’ లో ఆమె ఒక పవర్ఫుల్ రోల్ చేస్తుంది.

Advertisement

READ ALSO : రాజమౌళిని డైరెక్టర్ గా కాకుండా హీరో చేయాలని అనుకున్నారా? దీని వెనుక ఉంది ఎవరు?