మెగాపవర్ స్టార్ రామ్ చరణ్, సమంత జంటగా నటించిన సినిమా రంగస్థలం. అయితే ఈ సినిమా విడుదల ఐన తర్వాత సూపర్ హిట్ అందుకొని 100 కోట్లకు పైగా కలెక్షన్స్ అనేవి సాధించింది. అలాగే అప్పటివరకు రామ్ చరణ్ నటన పై కామెంట్స్ చేసేవారు కూడా ఈ రంగస్థలం సినిమా తర్వాత చరణ్ యాక్టింగ్ కు ఫిదా అయ్యారు. అయితే ఈ సినిమా స్టార్ డైరెక్టర్ సుకుమార్ దర్శకత్వంలో వచ్చింది.
Advertisement
Also Read: రహస్యంగా రెండో పెళ్లి చేసుకున్న సమంత… ఫోటోలు వైరల్!
అయితే ఈ సినిమాలో అందరూ ఆయన్ని ప్రెసిడెంట్ గారు అనే పిలుస్తూ ఉంటారు అంతే తప్ప ఆయన పేరు ఏంటి అనేది ఎవరికీ తెలీదు. చిట్టిబాబు (రామ్ చరణ్), కుమార్ బాబు (ఆది) ఇద్దరు కలిసి ప్రెసిడెంట్ దగ్గరికి వెళ్లి మేము మీకు వ్యతిరేకంగా నామినేషన్ వేసాము అని చెప్పి తిరిగి వస్తుంటే రామ్ చరణ్ వెనక్కి తిరిగి వెళ్లి వస్తాం ఫణీంద్ర భూపతి గారు అంటారు. అయితే ఊరిలో ఉన్న ఎవ్వరికీ తెలియని ఆయన పేరు రామ్ చరణ్ కి ఎలా తెలిసింది అని, ఆ సినిమా చూసిన వాళ్లలో చాలామందికి డౌట్ ఉంది.
Advertisement
Also Read: RRR కి బదులు ఛెల్లో షో ని ఆస్కార్ కి పంపించి కేంద్రం తప్పు చేసిందా..? మరో అవార్డు గ్యారెంటీ..!
Advertisement
కానీ ఆ పేరు రామ్ చరణ్ కి ఎలా తెలిసిందంటే వీళ్లు నామినేషన్ వేయడానికి వెళ్ళినప్పుడు అక్కడ ఆఫీసులో ఇంతకుముందే నామినేషన్ వేసిన ప్రెసిడెంట్ గారి పేరు చూస్తారు. కాబట్టి చిట్టి బాబుకు ఆయన పేరు తెలుస్తుంది. చిట్టిబాబు ఆయన్ని పేరు పెట్టి పిలిచే సీన్ కి సినిమా చూస్తున్నప్పుడు నిజంగా బూస్ బంప్స్ వచ్చాయని చెప్పాలి. అలాగే ఈ సినిమా మొత్తాన్ని డైరెక్టర్ చాలా బాగా హ్యాండిల్ చేశాడనే చెప్పాలి. అటు రామ్ చరణ్ కెరియర్ లో అయినా, ఇటు సుకుమార్ కెరియర్ లో అయిన ది బెస్ట్ సినిమాగా ఈ సినిమా చరిత్రలో నిలిచిపోతుంది అని చెప్పడంలో ఎంత మాత్రం అతిశయోక్తి లేదు.