పట్టుదలతో ఉంటే ఏదైనా కచ్చితంగా సాధించవచ్చని విసయం ప్రతీ ఒక్కరికీ తెలిసిందే. అయితే పనినైనా ఆచరణలో పెట్టడానికి కొంత సమయం పడుతుంది. కానీ ఒకసారి ఆచరణలో పెట్టారంటే పట్టుదలతో ఎంత కష్టమైనా సరే సాధించి తీరుతారు. సరిగ్గా ఇలాంటి క్లిష్టమైన పరిస్థితిని ప్రముఖ నిర్మాత డాక్టర్ డి.రామానాయుడు ఎదుర్కోవాల్సి వచ్చింది. అది కూడా ఎన్టీఆర్ అన్న ఒక్క మాటతో ఇల్లు నిర్మించడానికి ఏమాత్రం పనికిరాని కొండలు గుట్టలు ఉన్న ప్రదేశంలో కష్టపడి చాకచక్యంతో ఒక స్టూడియోను నిర్మించారు దగ్గుబాటి రామానాయుడు.
Advertisement
తెలుగు సినీ పరిశ్రమ మద్రాస్ నుంచి హైదరాబాద్‌కు తరలించే పనిలో పనులు శరవేగంగా జరుగుతున్నాయి. ఇదే సమయంలో బంజారాహిల్స్‌లో అప్పటి సీఎం జలగం వెంగళరావు అక్కినేని నాగేశ్వరరావు కొంచెం స్థలం కేటాయించారు. అదే సమయంలో రామానాయుడుని కూడా స్థలం కావాలా అని అడిగాడట. అయితే రామానాయుడు వద్దు అని చెప్పాడు. ఇందుకు గల కారణం ఏమిటంటే హైదరాబాద్ వచ్చే ఆలోచన లేదు. ఎందుకంటే ఇప్పటివరకు రామానాయుడు విజయ ప్రొడక్షన్ అధినేతల్లో ఒకరైన నాగిరెడ్డి పిల్లలతో కలిసి ఉండటం వల్ల వాహిని స్టూడియో ను తన స్టూడియోగా భావించి సినిమాలు తీస్తూ రావడం జరిగింది.
Also Read : అది కాఫీ మీటింగే..మంచు విష్ణు గాలి తీసిన మంత్రి..!
Advertisement
1976లో వాహిని స్టూడియోస్ బ్యానర్‌పై రామానాయుడు సెక్రటరీ అనే తొలి సినిమాను నిర్మించాడు. ఈ సినిమాను అన్నపూర్ణ స్టూడియోలో తీశారు. అన్నపూర్ణ స్టూడియోలో షూటింగ్ జరిగిన తొలి సినిమా కూడా ఇదే కావడం గమనార్హం. దీని ప్రారంభోత్సవానికి వచ్చిన నాగిరెడ్డి అక్కడ ఉన్న ప్రాంతాన్ని చూసి ఇక్కడ ఒక స్టూడియో నిర్మిస్తే బాగుంటుందని, రామానాయుడు చెప్పడంతో అలా రామానాయుడు హైదరాబాద్‌లో స్టూడియో నిర్మించాలని అనుకున్నాడు. ఆ తరువాత ఏపీ ముఖ్యమంత్రి భవనం వెంకట్రామ్ సీఎంగా ఉన్నప్పుడు రామానాయుడుకు అలాగే సూపర్ స్టార్ కృష్ణకు ఫిలింనగర్‌లో స్థలాలు కేటాయించడం జరిగింది.
ఇక రామానాయుడికి సీఎం ఇచ్చిన స్థలాన్ని చూసి ఎన్టీఆర్ఖ ఈ రాళ్లతో ఏమి స్టూడియో కడతావు అన్నారట. రామానాయుడు వ్యూ బాగుందని అన్నారట. అందుకే ఎన్టీఆర్ వ్యూ చూసుకుంటూ కూర్చుంటావా..? లేక వ్యాపారం చేస్తావా.జ.? ఏదైనా మంచి స్థలం చూసుకోరాదు అని అన్నారట. కానీ రామానాయుడు అవన్నీ ఏమి పట్టించుకోకుండా పనులను ప్రారంభించారట. అక్కడ ఒక రాయిని పగుల గొట్టడానికి సుమారు 6నెలల సమయం పట్టింది. రామానాయుడు నిరాశ ఏర్పడింది. కానీ అప్పుడప్పుడే సురేష్ నిర్మాతగా ఎదగడం, వెంకటేష్ హీరోగా ఎంట్రీ ఇవ్వడం వంటి వాటిని చూసి మళ్లీ ఆశ కలిగింది. అలా పట్టుదలతో, కృషితో సినిమాకు సంబంధించిన అన్ని సౌకర్యాలు ఒకే స్టూడియోలో ఉండాలని నిర్ణయించుకుని రామానాయుడు స్టూడియోను ఏర్పాటు చేశాడు. ఏకంగా ఎన్టీఆర్ ప్రశంసలు అందుకోవడం విశేషం.
Also Read : బాలయ్య ఎంత కట్నం తీసుకున్నారు? వసుంధర ఎవరి కూతురు?