Home » అట్ట‌ర్ ఫ్లాప్ సినిమా కోసం బ్లాక్ బ‌స్ట‌ర్ ను రిజెక్ట్ చేసిన రామ్ పోతినేని…! ఆ సినిమా ఏదంటే..?

అట్ట‌ర్ ఫ్లాప్ సినిమా కోసం బ్లాక్ బ‌స్ట‌ర్ ను రిజెక్ట్ చేసిన రామ్ పోతినేని…! ఆ సినిమా ఏదంటే..?

by AJAY
Ad

కొన్నిసార్లు హీరోలు సూపర్ హిట్ అవ్వాల్సిన సినిమా కథలను రిజెక్ట్ చేసి ఫ్లాప్ కథలను ఎంచుకుంటారు. అలా ప్రతి ఒక్క హీరో కెరీర్ లో ఎప్పుడో ఒకప్పుడు కచ్చితంగా జరుగుతుంది. హీరో రామ్ పోతినేని కెరీర్ లోనూ అలాంటిదే జరిగింది.

Advertisement

ఇటీవల జూలై 14న రామ్ హీరోగా ది వారియర్ సినిమా ప్రేక్షకుల ముందు వచ్చిన సంగ‌తి తెలిసిందే. ఈ సినిమాకు త‌మిళ‌ దర్శకుడు లింగస్వామి దర్శకత్వం వహించారు.

ఈ చిత్రాన్ని తెలుగుతోపాటు తమిళంలోనూ తెర‌కెక్కించారు. రెండు భాషల్లోనూ ఈ సినిమాను విడుదల చేయగా అట్ట‌ర్ ఫ్లాప్ టాక్ ను మూట‌కట్టుకుంది. ఈ సినిమాలో రామ్ పోతినేని పోలీస్ పాత్రలో తొలిసారిగా నటించాడు. కాగా ఈ సినిమా ఫంక్షన్ లో రామ్ పోతినేని మాట్లాడుతూ…. తన వద్దకు చాలా నాలుగైదు పోలీస్ క‌థ‌లు వచ్చాయని చెప్పాడు.

Advertisement

కానీ ఆ నాలుగైదు కథలను రిజెక్ట్ చేసిన త‌న‌కు లింగు స్వామి చెప్పిన కథ బాగా నచ్చిందని అన్నారు. ఈ సినిమా మంచి విజయం సాధిస్తుందని దీమా వ్యక్తం చేసాడు. అయితే రామ్ రిజెక్ట్ చేసిన కథలలో ఓ బ్లాక్ బస్టర్ సినిమా కూడా ఉంది. గోపీచంద్ మలినేని దర్శకత్వంలో రవితేజ హీరోగా వచ్చిన క్రాక్ సినిమా బ్లాక్ బస్టర్ అయిన‌ సంగతి తెలిసిందే.

Krack

Krack

అయితే ఈ సినిమా కథను మొదట గోపీచంద్ మ‌లినేని రామ్ పోతినేనికి వినిపించారట. కానీ రామ్ ఈ సినిమాను రిజెక్ట్ చేశాడు. దాంతో అదే కథను గోపీచంద్ రవితేజకు వినిపించగా అతడు గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు. ఇక అలా వీరిద్దరి కాంబినేషన్ వచ్చిన క్రాక్ వసూళ్ల వర్షం కురిపించింది. అలా రామ్ సూపర్ హిట్ సినిమా క్రాన్ ను మిస్ చేసుకుని అట్టర్ ఫ్లాప్ సినిమా దివారియ‌ర్ తో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు

ALSO READ :  షోలే లో అమితాబ్ లాంటి పాత్ర అన్నారు…ద‌మ్ము సినిమాపై వేణుతొట్టెంపూడి సంచ‌ల‌న వ్యాఖ్య‌లు..!

Visitors Are Also Reading