Home » షోలే లో అమితాబ్ లాంటి పాత్ర అన్నారు…ద‌మ్ము సినిమాపై వేణుతొట్టెంపూడి సంచ‌ల‌న వ్యాఖ్య‌లు..!

షోలే లో అమితాబ్ లాంటి పాత్ర అన్నారు…ద‌మ్ము సినిమాపై వేణుతొట్టెంపూడి సంచ‌ల‌న వ్యాఖ్య‌లు..!

by AJAY

స్వయంవరం సినిమాతో టాలీవుడ్ కు పరిచయం అయిన హీరో తొట్టెంపూడి వేణు. ఈ సినిమా మంచి విజయం సాధించడంతో వేణు వరుస ఆఫర్లు అందుకున్నాడు. కమెడియన్ గా మంచి పేరు సంపాదించుకున్నాడు. అయితే కొన్ని సినిమాల తర్వాత వేణు అనుకోకుండా లాంగ్ గ్యాప్ తీసుకున్నాడు. ఆ తర్వాత దమ్ము సినిమాతో రీఎంట్రీ ఇచ్చాడు. ఇక దమ్ము సినిమా తర్వాత మళ్లీ వేణు కనిపించలేదు. అయితే తాజాగా దమ్ము సినిమా గురించి వేణు సంచలన వ్యాఖ్యలు చేశాడు.

బోయపాటి శ్రీను సినిమా అని చెప్పగానే వెంటనే కథ వినకుండా గుడ్డిగా చేశానని తెలిపాడు. అంతేకాకుండా సినిమాల్లో తన పాత్ర షోలే సినిమాలో అమితాబచ్చన్ మాదిరిగా ఉంటుందని చెప్పారని అన్నాడు. తీరా సినిమా వచ్చాక తన సీన్లని కట్ చేశారని ఆవేద‌న వ్యక్తం చేశాడు. షోలే సినిమాలో అమితాబచ్చన్ చనిపోతారని… ఇక్కడ తన పాత్ర చనిపోయిందని వేణు కామెంట్ చేశాడు.

venu thottempudi

venu thottempudi

వేణు చేసిన కామెంట్స్ చూస్తుంటే దమ్ము సినిమా విషయంలో అతడు అసంతృప్తి చెందినట్లు అర్థమవుతుంది. అంతేకాకుండా ఈ సినిమాలో నటించినందుకు తాను రెగ్రెట్ గా ఫీల్ అవడం లేదని… ఇదొక జర్నీ అని అన్నారు. జర్నీలో నన్ను వెతుక్కుంటూ వచ్చిన పాత్రలన్నింటినీ నేను గౌరవిస్తాను అని చెప్పారు. నచ్చిన పాత్ర రాలేదని జర్నీని అక్కడే ఆపలేను అంటూ కామెంట్ చేశాడు. ఇక తాజాగా వేణు రామారావు ఆన్ డ్యూటీ సినిమాతో మ‌ళ్లీ ప్రేక్ష‌కుల ముందుకు వచ్చారు. మ‌రి ఈ సినిమా తర్వాత వేణు కెరీర్ ఏ విధంగా ఉంటుందో చూడాలి.

ALSO READ :  నాగ‌చైత‌న్య‌తో క‌లిసి ఉన్న ఇంటిని డ‌బుల్ రేటుకు కొనుగోలు స‌మంత‌.. అస‌లు కార‌ణం అదేనా..?

Visitors Are Also Reading