Home » Ram Charan : ముంబైలో ఫ్లాట్‌ కొనుగోలు చేయనున్న రామ్ చ‌ర‌ణ్ దంప‌తులు !

Ram Charan : ముంబైలో ఫ్లాట్‌ కొనుగోలు చేయనున్న రామ్ చ‌ర‌ణ్ దంప‌తులు !

by Bunty
Ad

మెగాస్టార్ చిరంజీవి వారసుడు, మెగా పవర్‌ స్టార్‌ రామ్ చరణ్ ఈ పేరుకు పెద్దగా పరిచయం అవసరం లేదు. మెగాస్టార్ చిరంజీవి వారసుడిగా సినిమాలోకి ఎంట్రీ ఇచ్చి తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపును సంపాదించుకున్నాడు. అతి చిన్న వయసులోనే సినిమాల్లో హీరోగా నటించి ఎంతోమంది అభిమానులను సంపాదించుకున్నాడు. ఆర్ఆర్ఆర్ సినిమా అనంతరం పాన్ ఇండియన్ స్టార్ హీరోగా మారాడు. ఎప్పటికప్పుడు వరుస సినిమాలతో ఫుల్ బిజీగా ఉంటాడు రామ్ చరణ్.

ramcharan

Advertisement

తన అభిమానుల కోసం వరుసగా సినిమాలు చేసుకుంటూ ప్రేక్షకులను అలరిస్తుంటాడు. చరణ్ తన పర్సనల్ లైఫ్ లో కూడా చాలా సంతోషంగా ఉన్నాడు. రామ్ చరణ్ సినిమాల్లో రాణిస్తున్న సమయంలోనే ఉపాసనని ప్రేమించి వివాహం చేసుకున్న సంగతి అందరికీ తెలిసిందే. వీరికి 12 ఏళ్ల తర్వాత ఓ పాప జన్మించింది. పాప జన్మించిన అనంతరం రామ్ చరణ్, ఉపాసన చాలా సంతోషంగా ఉన్నారు. అంతేకాకుండా వీరిద్దరూ వరల్డ్ టాప్ మ్యాగ్జిన్ పై కనిపించారు. చరణ్ ఉపాసన, దంపతులు హైదరాబాదును వీడి ముంబైకి మకాం మార్చే ఆలోచనలో ఉన్నారంటూ ఓ వార్త తెగ వైరల్ అవుతుంది.

Ramcharan and upasana

వివరాల్లోకి వెళితే….పాన్ ఇండియన్ హీరో అయిన తర్వాత రామ్ చరణ్ పలు ఈవెంట్లు, ప్రోగ్రామ్ లతో ఫుల్ బిజీగా ఉంటున్నారట. ఇందులో ఎక్కువ శాతం ముంబైలోనే ఏదో ఒక పనితో ఉండాల్సి వస్తుందట. ప్రతిసారి ముంబైకి వెళ్ళినప్పుడు ఏదో ఒక హోటల్లో ఉండడం, రూమ్ రెంటుకు తీసుకోవడం వంటివి చేస్తున్నారట. అలా ఉండడం వల్ల వారికి చాలా ఇబ్బందిగా అనిపిస్తుందట. దీంతో రామ్ చరణ్ ముంబైలో ఓ ఇల్లును కొనుగోలు చేయాలనే ఆలోచనలో ఉన్నారట.

Advertisement

మరిన్ని తెలుగు సినిమా వార్తల కోసం ఇవి చూడండి! తెలుగు న్యూస్ కోసం వీటిని చూడండి!

Visitors Are Also Reading