Home » అమెజాన్‌లో దూసుకెళ్లుతున్న ‘రామ్-అసుర్’

అమెజాన్‌లో దూసుకెళ్లుతున్న ‘రామ్-అసుర్’

by Anji
Ad

అభిన‌వ్ స‌ర్దార్‌, చాంద‌నీ, రామ్‌కార్తీక్‌, షెర్రీ అగ‌ర్వాల్ లీడ్ రోల్స్‌గా న‌టించిన చిత్రం రామ్‌-అసుర్. వెంకటేష్ త్రిప‌ర్ణ ద‌ర్శ‌క‌త్వం వ‌హించిన ఈ చిత్రం ప్ర‌స్తుతం అమెజాన్ ప్రైమ్‌లో స్ట్రీమింగ్ అవుతోంది. ఈ సినిమా థియేట‌ర్ల‌లో విడుద‌లైన‌ప్ప‌టికీ క‌రోనా కార‌ణంగా అంత‌గా ప్రేక్ష‌కాద‌ర‌ణకు నోచుకోలేదు. కానీ అమెజాన్‌లో మాత్రం ఈ చిత్రానికి మంచి రెస్పాన్స్ వ‌స్తోంది.

Ram Asur Movie Hero Abhinav Sardar Heroine Chandini different promotion for Ram  Asur Movie: పబ్లిక్ ఏరియాల్లో వాల్ పోస్టర్స్ అంటించిన హీరో, హీరోయిన్ |  వినోదం News in Telugu

Advertisement

Advertisement

కృతిమ వ‌జ్రం త‌యారీపై తెరకెక్కించిన ఈ చిత్రం పిరియాడిక్ ల‌వ్‌స్టోరీతో పాటు, కాంటెంప‌ర‌రీ ప్రేమ‌క‌థ కూడా ఉండ‌టంతో ప్రేక్ష‌కులు ఫిదా అవుతున్నారు. భీమ్ సిసిరోలియో స్వ‌రాలు ఆబాల‌గోపాలాన్నీ ఆక‌ట్టుకున్నాయి. ఏమి చేసావో ఏమో మాయ పాట యూత్ కాల‌ర్ ట్యూన్‌గా మారిపోయింది. ఇక ప్రేమ‌, భావోద్వేగం, యాక్ష‌న్, ఎంట‌ర్‌టైన్‌మెంట్ మ‌ళిత‌మైన రామ్ అసుర్ ఈ సంక్రాంతి పండుగ సంద‌ర్భంలో కుటుంబంతో క‌లిసి చూడ‌డానికి మంచి టైమ్ పాస్ సినిమా అన‌డంలో ఎలాంటి సందేహం లేదు.

Visitors Are Also Reading