Home » రాకేష్ మాస్టర్ నటించిన ఆఖరి సినిమా ఇదే.. దర్శకుడు కి ఆయన నటన బాగా నచ్చిందట..!

రాకేష్ మాస్టర్ నటించిన ఆఖరి సినిమా ఇదే.. దర్శకుడు కి ఆయన నటన బాగా నచ్చిందట..!

by Sravya
Ad

రాకేష్ మాస్టర్ గురించి కొత్తగా పరిచయం చేయక్కర్లేదు ఈయన ఇండస్ట్రీ నుండి దూరం అయ్యాక యూట్యూబ్ ఛానల్స్ లో ఇంటర్వ్యూ ఇస్తూ పాపులర్ అయిపోయారు. ఇప్పుడు ఇండస్ట్రీలో రాణిస్తున్న స్టార్ కొరియోగ్రాఫర్లు ఆయన శిష్యులే. మద్యానికి బానిసైన రాకేష్ మాస్టర్ గత ఏడాది చనిపోయిన విషయం తెలిసిందే రాకేష్ మాస్టర్ కి అంతగా పేరు రావడానికి కారణం యూట్యూబ్ ఇంటర్వ్యూలు. ఇంటర్వ్యూలు చేయడంతో రాకేష్ మాస్టర్ కి మంచి పేరు వచ్చింది. జబర్దస్త్ లాంటి షో లోని కూడా కనిపించారు రాకేష్ మాస్టర్.

rakesh 1

Advertisement

యూట్యూబ్ వేదికగా రాకేష్ మాస్టర్ అనేక వివాదాస్పద ఇంటర్వ్యూలు ఇచ్చారు. విశాఖలో జరిగిన ఒక ఈవెంట్ లో పాల్గొని హైదరాబాద్ తిరిగి వచ్చిన తర్వాత అస్వస్థకి 2023 జూన్ 18న హైదరాబాదులో గాంధీ హాస్పిటల్ లో అడ్మిట్ అయ్యారు. డయాబెటిస్ ఉండడంతో సివియర్ మెటాబాలిక్ ఎసిడిసిస్ కావడం వలన మల్టీ ఆర్గాన్ ఫెయిల్యూర్ అయింది. దీంతో పరిస్థితి విషమించింది రాకేష్ మాస్టర్ కన్ను మూసారు. ఆయన నటించిన చివరి సినిమా హనుమాన్. అయిన నటించిన హనుమాన్ సినిమా జనవరి 12న రిలీజ్ కాబోతోంది.

Advertisement

ప్రశాంత్ వర్మ దర్శకత్వంలో తేజా సజ్జా హీరోగా నటిస్తున్నారు హనుమాన్ మూవీలో రాకేష్ మాస్టర్ ఒక ఆసక్తికరమైన పాత్ర పోషించారు. రాకేష్ మాస్టర్ నటించిన ఆఖరి సినిమా ఇదే ఈ సినిమాలో ఆయన ఒక చక్కని పాత్ర పోషించారని ప్రశాంత్ వర్మ చెప్పారు. ఆయన నటన చూసి రాబోయే రోజుల్లో మంచి ఆఫర్లు వస్తాయి అని అనుకున్నాను కానీ ఇంతలో అయినా కన్నుమూశారు అని ప్రశాంత్ వర్మ చెప్పారు. హనుమాన్ సినిమా మీద ప్రేక్షకులు భారీ ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకున్నారు. ఇప్పటికే ఈ సినిమాకి సంబంధించిన అప్డేట్స్ రావడం అలానే మొన్న ఫ్రీ రిలీజ్ ఈవెంట్ జరగడం మనం చూసాము. మరి సంక్రాంతి బరిలోకి వస్తున్న హనుమాన్ సినిమా ప్రేక్షకుల్ని ఎంతవరకు ఆకట్టుకుంటుంది అనేది చూడాలి.

తెలుగు సినిమా వార్తల కోసం వీటిని చూడండి! తెలుగు న్యూస్ కోసం ఇవి చూడండి!

Visitors Are Also Reading