Home » ఎన్టీఆర్ కెరీర్ ను మ‌లుపుతిప్పిన 5 సినిమాలు…అవి క్రియేట్ చేసిన రికార్డులు ఇవే..!

ఎన్టీఆర్ కెరీర్ ను మ‌లుపుతిప్పిన 5 సినిమాలు…అవి క్రియేట్ చేసిన రికార్డులు ఇవే..!

by AJAY
Ad

తెలుగు చిత్ర‌సీమ గ‌ర్వించ‌ద‌గ్గ న‌టుల‌లో ఎన్టీరామారావు కూడా ఒక‌రు. ఎన్టీఆర్ సాధార‌ణ మధ్య త‌ర‌గ‌తి కుటుంబం నుండి వ‌చ్చి సినిమాల్లో చెర‌గ‌ని ముద్ర వేసుకున్నారు. త‌న‌దైన స్టైల్ లో న‌టించి అభిమానుల‌ను సంపాదించుకున్నారు. కేవ‌లం ఒకేర‌క‌మైన పాత్ర‌లో కాకుండా జాన‌ప‌ద‌,పౌరాణిక చిత్రాల‌లో న‌టించి తెలుగు ప్రేక్ష‌కుల హృద‌యాల‌లో నిలిచిపోయారు. ఆయ‌న కెరీర్ లో ఎన్నో బ్లాక్ బ‌స్ట‌ర్ సినిమాలు ఉన్నాయి.

Advertisement

అంతే కాకుండా ఎన్టీఆర్ కెరీర్ ను కొన్ని సినిమాలు మ‌లుపు తిప్పాయి ఆ సినిమాలు ఏవో ఇప్పుడు చూద్దాం….కొత్త హీరోలు ముందుకు వ‌స్తున్నార‌ని ఎన్టీఆర్ లాంటి సీనియ‌ర్ ల ప‌ని అయిపోయింది అనుకునే టైంలో ఎన్టీఆర్ అడ‌విరాముడు సినిమాతో వ‌చ్చి త‌న ఫామ్ ను నిరూపించుకున్నారు. క‌మ‌ర్షియ‌ల్ సినిమాల‌కు అడ‌విరాముడు కొత్త అర్థాన్ని చెప్పింది. ఎన్టీఆర్ కెరీర్ లో మ‌రో చెప్పుకోదగ్గ సినిమా వేట‌గాడు ఈ సినిమా కూడా విమ‌ర్శ‌కుల ప్ర‌శంస‌లు అందుకుంది. ఈ సినిమాతో ఎన్టీఆర్ క్రేజ్ మ‌రింత పెర‌గ‌టంతో ఆయ‌న రెమ్యున‌రేషన్ ప‌దిల‌క్ష‌ల‌కు పెరిగింది.

Advertisement

ఈ సినిమాలోని పాట‌లు ఎన్టీఆర్ వేసిన స్టెప్పుల‌తో టాప్ లేచిపోయింది. అదే విధంగా ఎన్టీఆర్ కెరీర్ లోని మ‌రో బ్లాక్ బ‌స్ట‌ర్ సినిమా స‌ర్దార్ పాపారాయుడు. ఈ సినిమా కూడా బ్లాక్ బ‌స్ట‌ర్ అయ్యింది. దాస‌రి నారాయ‌ణ‌రావు ఈ సినిమా కు ద‌ర్శ‌క‌త్వం వ‌హించారు. ఈ సినిమాను బాలీవుడ్ లో రీమేక్ చేయ‌గా అక్క‌డ కూడా బ్లాక్ బ‌స్ట‌ర్ అయ్యింది. ఈ సినిమాలతో పాటూ ఎన్టీఆర్ కెరీర్ లో మ‌రో చెప్పుకోదగ్గ సినిమా బెబ్బులి పులి.

ఈ సినిమా కూడా సూప‌ర్ హిట్ గా నిలిచింది. బెబ్బులి పులి వంద‌కు పైగా థియేట‌ర్ ల‌లో విడుద‌లై రికార్డులు క్రియేట్ చేసింది. ఈ సినిమాలో రాజ‌కీయాలు ఉండ‌టంతో సెన్సార్ అడ్డుప‌డింది. కానీ ఆ త‌ర‌వాత మ‌ళ్లీ అనుమ‌తులు వ‌చ్చాయి. అదే విధంగా ఎన్టీఆర్ కెరీర్ లో వ‌చ్చిన కొండ‌వీటి సింహం సినిమా కూడా ఎన్టీఆర్ కెరీర్ ను మ‌లుపుతిప్పిన సినిమాల‌లో ఒక‌టిగా నిలిచింది.

Visitors Are Also Reading