Home » జ‌య‌ల‌లిత పెళ్లి చేసుకోమ‌ని అడిగితే శోభ‌న్ బాబు స‌మాధానం ఇదేన‌ట‌..? అలా ఎందుకు చెప్పారంటే..?

జ‌య‌ల‌లిత పెళ్లి చేసుకోమ‌ని అడిగితే శోభ‌న్ బాబు స‌మాధానం ఇదేన‌ట‌..? అలా ఎందుకు చెప్పారంటే..?

by AJAY
Ad

ఇప్పుడంటే ఎక్కువగా హీరోలు ద‌ర్శ‌క‌ నిర్మాతల కుమారులే హీరోలుగా ఎంట్రీ ఇస్తున్నారు కానీ ఒక‌ప్పుడు చాలా మంది మ‌ధ్య‌త‌ర‌గ‌తి కుటుంబాల నుండి వ‌చ్చి హీరోలుగా స‌క్సెస్ అయ్యిన‌వారే. సోగ్గాడు శోభ‌న్ బాబు కూడా సాధార‌ణ మ‌ధ్య త‌ర‌గ‌తి కుటుంబం నుండే వ‌చ్చి స్టార్ హీరోగా ఎదిగారు. కెరీర్ ప్రారంభంలో శోభ‌న్ బాబు ఏఎన్ఆర్, ఎన్టీఆర్ లాంటి స్టార్ హీరోల సినిమాల‌లో చిన్న చిన్నపాత్ర‌లు చేసి మెప్పించారు. ఆ త‌ర‌వాత హీరోగా అవ‌కాశాల‌ను అందుకున్నారు. మ‌హిళా ప్రేక్ష‌కుల‌లో శోభ‌న్ బాబుకు ఎక్కువ క్రేజ్ ఉండ‌టంతో ఆయ‌న‌ను సోగ్గాడు అని పిలిచేవారు.

Advertisement

కృష్ణా జిల్లా నందిగామ‌లో పుట్టిన శోభ‌న్ బాబు సినిమాల్లో స‌క్సెస్ అవ్వ‌డానికి ఎంతో క‌ష్ట‌ప‌డ్డారు. కాలేజి రోజుల్లో శోభ‌న్ బాబు నాట‌కాలు వేసేవారు. డిగ్రీ చ‌దివేందుకు మ‌ద్రాసుకు వెళ్లిన శోభ‌న్ బాబు న‌ట‌న పై ఉన్న ఆసక్తితో అక్క‌డే సినిమాల అవ‌కాశాల కోసం ప్ర‌య‌త్నించారు. మొద‌ట శోభ‌న్ బాబుకు న‌టుడిగా గుర్తింపు తెచ్చిపెట్టిన సినిమా భ‌క్త శ‌భ‌రి…ఈ సినిమా త‌ర‌వాత‌నే ఆయ‌న వ‌రుస ఆఫ‌ర్ లు అందుకున్నారు. వీరాభిమ‌న్యు సినిమాలో మొద‌టి సారి హీరోగా న‌టించారు.

Advertisement

ఆ త‌ర‌వాత హీరోగానే అవ‌కాశాల‌ను అందుకున్నారు. ఇక శోభ‌న్ బాబు త‌న గురువు కుమార్తె అయిన కాంతాకుమారిని వివాహం చేసుకున‌నారు. వీరికి ఒక కుమారుడు ముగ్గురు కూతుళ్లు ఉన్నారు. శోభ‌న్ బాబు చాలా క్ర‌మ‌శిక్ష‌ణ క‌లిగిన వ్య‌క్తి…ఎంజాయ్ ల‌కు దూరంగా ఉండేవారు. శోభ‌న్ బాబు జీవితంలో జ‌య‌ల‌లిత పేరు ఎక్కువ‌గా వినిపిస్తుంది. జ‌య‌ల‌లిత‌కు శోభ‌న్ బాబు అంటే చాలా ఇష్టం ఉండేది.

వీరిద్ద‌రూ మొద‌టిసారి డాక్ట‌ర్ బాబు సినిమాలో క‌లిసి న‌టించారు. ఈ సినిమా మంచి విజయం సాధించింది. ఇక ఈ సినిమాకు కొద్ది రోజుల ముందు జ‌య‌లలిత త‌ల్లి మ‌ర‌ణించగా శోభన్ బాబు ఆమెను ఓదార్చేవార‌ట‌. ఈ క్ర‌మంలో ఇద్ద‌రి మ‌ధ్య ప్రేమ ఏర్ప‌డింది. శోభ‌న్ బాబును జ‌య‌ల‌లిత పెళ్లి చేసుకోవాల‌ని అనుకున్నార‌ట‌. కానీ అప్ప‌టికే పెళ్లైన శోభ‌న్ బాబు పెళ్లికి నిరాక‌రించారు అని అప్ప‌ట్లో ఓ టాక్ ఉండేది.

Visitors Are Also Reading