నటుడు మాధవన్ స్వీక దర్శకత్వంలో తెరకెక్కిన సినిమా రాకెట్రీ. నంబి నారాయణన్ బయోపిక్ గా రూపొందించిన ఈ మూవీ ఇటీవల విడుదలై సిద్ధమైన రాకెట్రీ విమర్శకుల ప్రశంసలను సైతం అందుకుంటుంది. తాజాగా ఈ మూవీని వీక్షించిన సూపర్‌స్టార్ రజనీకాంత్ నంబి నారాయణన్ జీవితాన్ని మరింత వాస్తవంగా తెరకెక్కించి మొదటి సినిమాతోనే గొప్ప దర్శకులతో సమానం అని మాధవన్ నిరూపించుకున్నారని పేర్కొన్నారు. ఇక చిత్ర బృందంపై ప్రశంసల వర్షం కురిపించారు.
Advertisement
ప్రతి ఒక్క భారతీయుడు ముఖ్యంగా యువత తప్పనిసరిగా చూడాల్సిన చిత్రం రాకెట్రీ. మనదేశ అంతరిక్ష పరిశోధన అభివృద్ధి కోసం పద్మభూషణ్ నంబినారాయణ్ ఎంతో కష్టపడ్డారు. ఆయన ఎన్నో త్యాగాలు చేశారు.. అనేది ఈ సినిమాలో అద్భుతంగా చూపించారు. ఈ సినిమాతో తొలి ప్రయత్నంలోనే తాను పేరు పొందిన దర్శకులతో సమానం అని మాధవన్ నిరూపించుకున్నారు.
Advertisement
ఇలాంటి అద్భుతమైన కథను రియలిస్టిక్‌గా చెప్పిన మాధవన్‌కు రజనికాంత్ ప్రత్యేకంగా అభినందనలు తెలిపారు. ఈ సినిమాలో అమెరికాలో ప్రఖ్యాత ప్రిన్స్‌టన్ విశ్వవిద్యాలయంలో నారాయణన్ చదువుకున్న రోజులు ప్రారంభించి రాకెట్ సైన్స్ కోసం ఆయన చేసిన కృషి, గూఢచారి కేసులో అరెస్టు కావడం, నిపరాధిగా బయటిఇ రావడం ఇలా ఎన్నో విషయాలను ఈ చిత్రంలో చూపించారు. జులై 01న ప్రేక్షకుల ముందుకొచ్చిన ఈ సినిమా విడుదలైన అన్ని చోట్ల పాజిటివ్ టాక్‌ను సొంతం చేసుకుని విజయవంతంగా దూసుకెళ్లుతుంది.
Also Read :
పూజా హెగ్డేకు షాక్ ఇస్తున్న నిర్మాతలు..!
2022లో విడుదలై కేవలం ఫస్ట్ హాఫ్ వల్ల సూపర్ హిట్ అయ్యిన 5 సినిమాలు ఇవే..!