Telugu News » Blog » పూజా హెగ్డేకు షాక్ ఇస్తున్న నిర్మాతలు..!

పూజా హెగ్డేకు షాక్ ఇస్తున్న నిర్మాతలు..!

by Manohar Reddy Mano
ప్రస్తుతం తెలుగుతో పాటుగా బాలీవడ్ లో కూడా పూజా హెగ్డే టైం అనేది నడుస్తుంది. అయితే కెరియర్ మొదట్లో వరుస ఫలపులు అందుకున్న ఈ హీరోయిన్ తర్వాత వెంటవెంటనే సూపర్ హిట్ సినిమాలను అందుకొని తెలుగులో స్టార్ హీరోయిన్ అయ్యింది. ఇక ఆ తర్వాత బాలీవుడ్ పైన దృష్టి పెట్టిన ఈ అమ్మడు అక్కడ కూడా మంచి హిట్స్ సాధించింది. అందువల్ల అందరూ పూజానే కావాలని అంటుండటంతో తన రెమ్యునరేషన్ అనేది పెంచేసింది. అందువల్ల నిర్మాతలను ఇబ్బంది అనేది మొదలయ్యింది.
ఇక రెమ్యునరేషన్ ఇబ్బందిగా మారింది అని నిర్మాతలు అనుకుంటుంటే.. పైగా తన వ్యక్తిగత బిల్లులను కూడా నిర్మాతే కట్టాలని ఇన్ని రోజులు అడిగింది. వ్యక్తిగత అంటే ఒక్క తన బిల్లులు మాత్రమే కాకుండా.. తన టీం బిల్స్ కూడా నిర్మాతలకు ఇచ్చేది. కానీ ఈ మధ్య కాలంలో ఈ అమ్మడు నటించిన పెద్ద పెద్ద సినిమాలు అనేవి ప్లాప్స్ అవ్వడం జరిగింది. అందువల్ల నిర్మాతలకు భారీ నష్టాలూ రావడంతో.. పూజా వ్యక్తిగత బిల్స్ ను ఆమెనే కట్టుకోవాలని వెన్నకి పంపారు. ఇలా బాలీవుడ్ లో నెగెటివ్ టాక్ రావడంతో ఇప్పుడు మళ్ళీ ఇకఫండా టాలీవుడ్ పైన దృష్టి పెట్టింది.
కానీ ఇక్కడ మన నిర్మాతలు పూజాకు షాక్ ఇవ్వడం ప్రారంభించారు. మొదట ప్లాప్స్ లో ఉన్న పూజా రెమ్యునరేషన్ తగ్గించాలని భావిస్తున్నారు. దానితో పాటుగానే ఇక నుండి పూజాతో సినిమాను సైన్ చేయించుకొని కాంట్రాక్ట్ ఇచ్చే సమయంలోనే అందులో క్లారిటీగా చెప్పనున్నారట. ఇక మీదట నీ వ్యక్తిగత బిల్స్ అనేవి ప్రొడక్షన్స్ లోకి రావు అని. ఇలానే ఇక్కడి నిర్మాతలు అందరూ చేయబోతున్నట్లు తెలుస్తుంది. అయితే ఇప్పుడు ప్లాప్స్ లో ఉన్న కూడా పూజాకు అవకాశాలు అనేవి తగ్గడం లేదు. కానీ ఇలా షరతులతో వస్తున్నాయి అని తెలుస్తుంది.