Home » షేన్ వార్న్ కు రాజస్థాన్ ఘన నివాళి..!

షేన్ వార్న్ కు రాజస్థాన్ ఘన నివాళి..!

by Azhar
Ad

2008 లో ప్రారంభమైన ఐపీఎల్ లో రాజస్థాన్ రాయల్స్ జట్టుని విజేతగా నిలిపాడు.. అప్పటి ఆ జట్టు కెప్టెన్ షేన్ వార్న్. అయితే ఐపీఎల్ లో వార్న్ రాజస్థాన్ కెప్టెన్ గానే కాకుండా… తన రిటైర్మెంట్ తర్వాత ఆ జట్టుకు మెంటార్ గా కూడా పనిచేసాడు. యువ ఆటగాళ్లలో స్ఫూర్తిని నింపుతూ.. తన క్రికెట్ జ్ఞానాన్ని వారికీ పంచాడు.

Advertisement

అయితే ఈ ఐపీఎల్ ప్రారంభానికి ముందు వార్న్ ఆకస్మాత్తుగా మరణించారు. ఈ వార్త మొత్తం క్రికెట్ ప్రపంచాన్ని షాక్ కు గురి చేసింది. చాలా మంది క్రికెటర్లు ఈ వార్త నిజం అని తాము మొదట్లో నమ్మలేదు అని చెప్పారు. అయితే ఈ ఐపీఎల్ కు తమతో లేని తమ మొదటి రాయల్ ను రాజస్థాన్ జట్టు స్మరించుకుంది. నేడు ముంబైతో మ్యాచ్ జరగడానికి ముందు ఈ సంస్మరణ సభను ఏర్పాటు చేసింది.

Advertisement

అలాగే షేన్ వార్న్ ను గుర్తు చేసుకుంటూ రాజస్థాన్ ఆటగాళ్లు అందరూ ఈరోజు తమ జెర్సీల పైన బ్లాక్ రిబ్బన్ ను ధరించారు. ఇక అనంతరం వార్న్ గురించి ఆటగాళ్లు మాట్లాడుతూ.. అతను ఇంకా తమతోనే ఉన్నట్లు తాము భావిస్తున్నాము అని తెలిపారు. అలాగే వార్న్ ఎప్పుడు… తన చుట్టూ ఉన్నవాళ్లలో నమ్మకాన్ని నింపేవాడు అని పేర్కొన్నారు.

ఇవి కూడా చదవండి :

చెన్నై కెప్టెన్ గా మళ్ళీ ధోనినే…!

పాండ్యకు సెహ్వాగ్ మద్దతు..!

Visitors Are Also Reading