Home » రాజమౌళి ఫ్యామిలీ చేసే ప్లాన్ గురించి మీకు తెలుసా ?

రాజమౌళి ఫ్యామిలీ చేసే ప్లాన్ గురించి మీకు తెలుసా ?

by Anji
Ad

తెలుగు చలన చిత్రపరిశ్రమలో రాజమౌళి ఫ్యామిలీ గురించి ప్రత్యేకంగా చర్చించుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఎందుకంటే సినీ ఇండస్ట్రీలో ఏ ఫ్యామిలీ కూడా రాజమౌళి ఫ్యామిలీ లా మొత్తం సినిమాకు పని చేసే వారు ఇంకెవ్వరుండరని చెప్పవచ్చు. ఇండియన్ సినిమా చరిత్రలోనే ఒకే ఫ్యామిలీకి సంబంధించిన డైరెక్టర్, మ్యూజిక్ డైరెక్టర్, కాస్టూం డిజైనర్, ప్రొడక్షన్ మేనేజర్ ఇలా అన్ని విభాగాలలో రాజమౌళి ఫ్యామిలీ తమ పనితనం చూపిస్తుంది. 

Advertisement

కేవలం దర్శకధీరుడు రాజమౌళి వల్లనే వారు అలా తమకు నచ్చిన విభాగాలు సెట్ చేసుకున్నారని తెలుస్తోంది. ఇదిలా ఉండగా.. రాజమౌళి ఫ్యామిలీ నుంచి లేటెస్ట్ గా కీరవాణి తనయుడి శ్రీసింహా హీరోగా నటిస్తున్నాడు. మత్తువదలరా మూవీతో హీరోగా పరిచయం అయ్యాడు. ఇక అతను మొదటి మూవీతోనే హిట్ అందుకున్నా ఆ తరువాత వరుస సినిమాలు కాస్త నిరాశపరిచాయి. తాజాగా ఉస్తాద్ మూవీతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. ఉస్తాద్ మూవీ ఆగస్టు 12, 2023న ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఈ మూవీ పాజిటివ్ టాక్ వినిపిస్తుంది. కాకపోతే సినిమా చాలా స్లోగా సాగుతుందనే ఒక నెగటివ్ టాక్ ఉంది. ఈ సినిమా కలెక్షన్లు ఎలా ఉంటానేది మాత్రం రెండు, మూడు రోజులు వెయిట్ చేస్తే కానీ తెలియదు. 

Advertisement

usthadmovie

మరోవైపు ఈ మూవీ విషయంలో మేకర్స్ మాత్రం  భారీ అంచనాలతో ఉన్నారు. ఉస్తాద్ ప్రీ రిలీజ్ ఈవెంట్ లో రాజమౌళి మాట్లాడిన విధానం చూస్తుంటే.. శ్రీసింహాని కచ్చితంగా స్టార్ హీరోని చేసే ఆలోచనలో ఉన్నట్టు స్పష్టమవుతోంది. మొత్తానికి శ్రీసింహాతో జక్కన్న ఫ్యామిలీ పెద్ద ప్లానింగ్ తోనే ఉందని చెప్పవచ్చు. మరోవైపు శ్రీసింహాతో రాజమౌళి కనుక సినిమా తీస్తే ఏ రేంజ్ లో ఉంటుందో ఊహించుకోవచ్చనే ఊహగానాలు వినిపిస్తున్నాయి. ఏం జరుగుతుందనేది వేచి చూడాలి మరీ. 

మరికొన్ని ముఖ్యమైన వార్తలు

Ustaad Movie Review : `ఉస్తాద్‌` మూవీ రివ్యూ

 NTR: ఎన్టీఆర్‌తో కలిసి నటించిన ఈ హీరోయిన్ గుర్తుందా? ఇప్పుడు ఎలా ఉందంటే?

“బ్రో” తో ఇంత జరిగినా తగ్గేదేలే.. “ఉస్తాద్” లో కూడా పవన్ పొలిటికల్ పంచ్ ఉండబోతోందా?

Visitors Are Also Reading